TE/Prabhupada 0977 - ఈ భౌతిక శరీరం మన ఆధ్యాత్మిక శరీరం ప్రకారం తయారు అవుతుంది



730408 - Lecture BG 04.13 - New York


ఈ భౌతిక శరీరం మన ఆధ్యాత్మిక శరీరం ప్రకారం తయారు అవుతుంది ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు: catur varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) ఇప్పుడు... మనము జంతువులుగా ఉన్నప్పుడు... మనము జంతువుల శరీరముల గుండా వెళ్ళాలి. పరిణామం ద్వారా మనం ఈ మానవ శరీరానికి వచ్చాము. ఇప్పుడు అది జన్మ మరియు మరణముల యొక్క ఈ చక్రం నుండి బయటపడటానికి ఇది ఒక అవకాశం. ఇది మన వాస్తవమైన సమస్య. కానీ ప్రజలు, వారు విద్యావంతులు కానందున, జ్ఞానం లేకపోవడము వలన... ఆత్మ ఒక శరీరము నుండి మరొక శరీరమునకు ఎలా పరిణామము చెందుతుంది అని బోధించుటకు ఏ విద్యా సంస్థ లేదు. వారికి తెలియదు. పెద్ద పెద్ద ఎం.ఏ., పీహెచ్డీ. కానీ వారికి జీవి యొక్క వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియదు. కానీ అది వాస్తవమైన సమస్య. వారికి వాస్తవమైన సమస్య తెలియదు.

వాస్తవమైన సమస్య... ఇది భగవద్గీతలో పేర్కొనబడింది: janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి. ఇది వాస్తవమైన సమస్య. ఎవరూ జన్మ తీసుకోవాలని అనుకోరు. కనీసం ఎవరూ మరణించాలని కోరుకోరు. జన్మ మరియు మరణం. జన్మ ఉన్న చోట మరణం ఉండాలి. జన్మించినది ఏదైనా చనిపోవాలి. కాబట్టి janma-mṛtyu.. వృద్ధాప్యం. మీరు నివసించినంత కాలం, మీరు మీ స్థానాన్ని మార్చుకోవాలి. ఒక స్థితి ఈ వృద్ధాప్యము. మనము వృద్ధులము అయినట్లుగా. చాలా ఫిర్యాదులు ఉన్నాయి. జరా మరియు వ్యాధి. మనము వ్యాధితో ఉన్నప్పుడు. ప్రతి ఒక్కరూ వ్యాధికి గురవుతారు. అందరూ వృద్ధులు అవుతారు అందరూ చనిపోవాలి. ఇది సమస్య. Janma-mṛtyu-jarā-vyādhi duḥkha-doṣānudarśanam.

జీవితంలోని మన దుర్భర పరిస్థితులను తగ్గించుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము. ఇది జీవితము కోసం పోరాటం. మనము శాస్త్రవేత్తలము. మనము దుర్భరమైన పరిస్థితి నుండి బయటపడటానికి అనేక అభ్యంతరకర పద్ధతులను కనుగొంటాం. కానీ కఠినమైన పరిస్థితి, janma-mṛtyu-jarā-vyādhi, మనము తప్పించుకున్నాము. ఎందుకంటే మనము ఏమీ చేయలేము. మనము చేయలేము కూడా...శాస్త్రము అని పిలవబడేది, వారు ఈ సమస్యను పరిష్కరించలేరు. కొన్నిసార్లు వారు గర్వముగా ఉంటారు శాస్త్రము ద్వారా మనము అమరులము అవుతాము మరియు ఇంకా ఎన్నో. ఈ విషయాలు ముందు కూడా ప్రయత్నించబడ్డాయి నాస్తిక వ్యక్తులచే రావణుడు మరియు హిరణ్యకశిపుని వంటి వారిచే. కానీ జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి ఆపడానికి విజయవంతం కావడం సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. ఏదైనా సాధ్యం అయ్యే పద్ధతి ఉంటే, అది కృష్ణ చైతన్యము. ఇది కృష్ణ చైతన్యము.

మీరు కృష్ణ చైతన్య వంతులు అయితే, అప్పుడు మీరు ఒక శరీరాన్ని పొందవచ్చు. పొందడము కాదు... మీరు ఇప్పటికే శరీరం, ఆధ్యాత్మిక శరీరం పొందారు. ఆ ఆధ్యాత్మిక శరీరం మీద, ఈ భౌతిక శరీరం వృద్ధి చెందింది. ఉదాహరణకు దుస్తుల వలె. మీ శరీరాన్ని బట్టి మీ కోటు కత్తిరించబడింది. అదేవిధముగా, మన ఆధ్యాత్మిక శరీరం ప్రకారం ఈ భౌతిక శరీరము తయారు చేయబడినది. కాబట్టి మనము మన ఆధ్యాత్మిక శరీరమును కలిగి ఉన్నాము. ఈ భౌతిక శరీరం కప్పబడి ఉంది. Vāsāṁsi jirṇāni.

ఉదాహరణకు దుస్తుల వలె. మీ చొక్కా మరియు కోటు మీ వాస్తవమైన శరీరమును కప్పినాయి. అదేవిధముగా, ఈ శరీరం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం, భౌతిక అంశాలచే తయారు చేయబడి ఉన్నాయి... స్థూల శరీరం భూమి, నీరు, గాలి, అగ్నితో చేయబడుతుంది. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి అహంకారం తో తయారు చేయబడినది. ఇది చొక్కా కోటు. ఈ చొక్కా మరియు కోటు లోపల, ఆత్మ ఉంది. ఆత్మ ఇప్పుడు ఈ భౌతిక శరీరంలో బంధించబడినది. మానవ శరీరములో మన కర్తవ్యము... జంతువుల శరీరములో, మనము దీన్ని చేయలేము. కానీ మానవ శరీరములో మనము అర్థం చేసుకోవచ్చు "నేను ఈ శరీరం కాదు." శరీరం, ఈ భౌతిక శరీరం, ఇది ఒక బయట కప్పు నేను ఈ శరీరం కలిగి ఉన్నాను కనుక, నేను జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధికి గురి అవుతున్నాను.

ఇప్పుడు, శరీర మానవ శరీరములో నేను అర్థం చేసుకో గలను నేను పద్ధతిని తీసుకుంటే, ఈ జన్మ మరణ చక్రము నుండి ఎలా బయటపడాలి, అప్పుడు మన మానవ జీవితం విజయవంతమవ్వుతుంది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. ఎలా, మనము ఎలా ప్రజలకు సహాయము చేస్తున్నాము ఈ భౌతికము శరీరం నుండి బయటకు రావడానికి , మీ సొంత ఆధ్యాత్మిక శరీరమును పునరుద్ధరించుకోవడానికి, ఆ ఆధ్యాత్మిక శరీరములో, మీరు భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళతారు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళుతారు. ఇది పద్ధతి