TE/Prabhupada 0978 - మీకు బ్రాహ్మణుని అవసరము లేకపోతే, అప్పుడు మీరు బాధపడతారు



730408 - Lecture BG 04.13 - New York


మీకు బ్రాహ్మణుని అవసరము లేకపోతే, అప్పుడు మీరు బాధపడతారు Tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) కానీ ప్రజలు ఈ భౌతిక శరీరానికి ఎంతగానో ఆకర్షించ బడుతున్నారు వారు పిల్లులు మరియు కుక్కల వలె తదుపరి జీవితమునకు సిద్ధమవుతున్నారు, కానీ వారు తిరిగి భగవద్ధామమునకు తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా లేరు. ఇది సమస్య. ఎందుకు ఈ సమస్య? ఎందుకంటే మానవ సమాజం గందరగోళంలో ఉంది. అస్తవ్యస్తమైన పరిస్థితి. కావున నాలుగు తరగతులు విభజన ఉండాలి. ఒక తరగతి బ్రాహ్మణులు తెలివైన వ్యక్తుల తరగతి ఉండాలి. ఒకరు క్షత్రియులుగా ఉండాలి, ఒక తరగతి, నిర్వాహకులు. ఎందుకంటే మానవ సమాజం, వారికి మంచి సలహాలు ఇచ్చే బుర్ర అవసరం, చక్కని నిర్వాహకులు, చక్కగా ఉత్పత్తి చేసే వారు, చక్కగా పని చేసే వారు. అది బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల యొక్క విభజన. అందువల్ల కృష్ణుడు చెప్తున్నారు: catur varṇyaṁ mayā sṛṣṭam ( BG 4.13) మానవ జీవితం కోసం మృదువైన సౌకర్యాలను కల్పించడానికి, నాలుగు విభాగాలు ఉండాలి. అలా చేయలేము అంటే, "మాకు బ్రాహ్మణులు అవసరం లేదు." మీరు బ్రాహ్మణ అవసరం లేకపోతే, మీరు బాధపడతారు.

ఉదాహరణకు మీకు ఈ శరీరము ఉన్నట్లుగా. మీరు ఆలోచిస్తే "శరీరం యొక్క ఈ భాగం చాలా ఖరీదైనది, ఎల్లప్పుడూ తింటుంది, కత్తిరించేద్దాము అప్పుడు మీరు చనిపోతారు. అదేవిధముగా, మీ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి, జీవన స్థితిలో, మీరు మీ తల కలిగి ఉండాలి, మీరు మీ చేతులు కలిగి ఉండాలి, మీరు మీ కడుపు కలిగి ఉండాలి, మీరు మీ కాళ్ళను కలిగి ఉండాలి. మీరు "నేను శరీరం యొక్క ఈ భాగం వదలి వేయవచ్చు." లేదు అదేవిధముగా, catur varṇyaṁ mayā srhmr ( BG 4.13) సమాజంలోని నాలుగు విభాగాలు అక్కడ ఉండాలి, లేకపోతే అది అస్తవ్యస్తమైనది లేదా మృతదేహము అవుతుంది.

కాబట్టి ప్రస్తుత క్షణములో, ఆ కష్టము ఉంది, ఏ బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు కేవలం వైశ్యులు మరియు శూద్రులు మాత్రమే ఉన్నారు, బొడ్డు, వైశ్యులు అంటే బొడ్డు శూద్రుడు అంటే అంటే కాలు. కాబట్టి, నాలుగు విభాగాలలో, ఒకటి కావలసి వస్తే , లేకపోతే, సమాజం అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంటుంది. నాలుగు తప్పకుండా ఉండాలి. తులనాత్మకంగా, తల శరీరంలో చాలా ముఖ్యమైన భాగం, అయినప్పటికీ మీరు కాలును అయినా నిర్లక్ష్యం చేయ కూడదు. ఇది సహకార కలయిక.

కాబట్టి మనము సహకరించుకోవాలి. ఇది పట్టింపు లేదు. ఒకరు చాలా తెలివైనవాడు. మరొకరు కొంచము తక్కువ తెలివైనవారు. ఇంకొకరు ఇంకొంచం తక్కువ తెలివైన వారు. నాలుగు తరగతుల వారు ఉన్నారు. అత్యంత తెలివైన తరగతి గల వారు తల, మనస్సు. తదుపరి తెలివైన తరగతి వారు, నిర్వాహకుడు, ప్రభుత్వం. తదుపరి తెలివైన తరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు. తదుపరి తెలివైన తరగతి కార్మికుడు. వారు అందరూ అవసరం. కానీ ప్రస్తుత సమయమున, ఈ వర్తకులు, పారిశ్రామికవేత్త మరియు కార్మికులు మాత్రమే ఉన్నారు. బుర్ర లేదు. సమాజాన్ని ఎలా నిర్వహించాలి? అనేదానికి పరిపూర్ణ మానవ సమాజముగా ఎలా మారాలి, ఎలా మానవ సమాజం యొక్క లక్ష్యము పూర్తి చేయాలి, ఈ విషయాల కొరకు, బుర్ర లేదు.