TE/Prabhupada 0987 - భగవంతుని చైతన్యములో ఆకలితో అలమటిస్తారు అని ఆలోచించవద్దు. ఎప్పటికీ ఆకలితో అలమటించరు

From Vanipedia
Jump to: navigation, search

భగవంతుని చైతన్యములో ఆకలితో అలమటిస్తారు అని ఆలోచించవద్దు. ఎప్పటికీ ఆకలితో అలమటించరు
- Prabhupāda 0987


720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA


మీరు భగవంతుని చైతన్యములో ఆకలితో అలమటిస్తారు అని ఆలోచించవద్దు. మీరు ఎప్పటికీ ఆకలితో అలమటించరు ఇప్పుడు భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. భగవంతుడు విశ్వమును సృష్టించారు, లెక్కలేనన్ని విశ్వాలను, కానీ ఆయనకు వాటిపై ఆసక్తి లేదు. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు; ఆయన సృష్టించాడు. ఆయన ఇక్కడ నివసించటానికి మనకు సౌకర్యం ఇచ్చాడు, కానీ ఆయన ఆస్వాదించడానికి ఇక్కడకు రావడము లేదు. ఆయనకు ఉన్నతమైనది ఉంది లేదా ఆయన ఈ సంపదలన్నింటిని పట్టించుకోడు. ఇది భగవంతుని యొక్క మరొక యోగ్యత. కాబట్టి ఈ మానవ రూపం భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉంది, శాస్త్రీయంగా పూర్తి జ్ఞానంతో ఉంది. ఇది శ్రీమద్-భాగవతం లో వివరించబడింది. అందువల్ల మనము ఈ భాగవత ప్రసంగమును బోధిస్తున్నాము. శ్రీమద్-భాగవతం ప్రారంభంలో భగవంతుని స్వభావం ఏమిటి? అది వర్ణించబడింది, janmādy asya yataḥ anvayād itarataś ca artheṣu abhijñaḥ svarāṭ ( SB 1.1.1) భగవంతుడు... భగవంతుడు జ్ఞానవంతుడు, ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయన చైతన్యము కలిగిన వ్యక్తి. అంతే కాని ఒక ప్రాణము లేని రాయి కాదు. ఒకవేళ భగవంతుడు చైతన్యము లేని ఒక వ్యక్తి కానట్లయితే, భగవంతుడు ఒక వ్యక్తి కాకపోతే ఎందుకు చాలా మంది శక్తివంతమైన వ్యక్తులు, చైతన్యము కలిగిన వ్యక్తులు ఆయన నుండి వస్తున్నారు? తండ్రికి తెలివి లేకపోతే, కుమారులు కుమార్తెలు ఎలా తెలివైనవారు అవుతారు? ఒక కుక్క తెలివైన వ్యక్తికి జన్మనివ్వలేదు, తెలివిగల వ్యక్తి, ఆయన తెలివైన పిల్లలకు జన్మనిస్తాడు. ఇది మా ఆచరణాత్మక అనుభవం. అందువలన ఈ భగవంతుని యొక్క వివరణ, aiśvaryasya samagrasya vīryasya yaśasaḥ śriyaḥ భగవంతుని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. మీరు ప్రతిదానిలో ఉన్నతమైన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఉంటే, సంపద, బలం, సౌందర్యము, కీర్తి, జ్ఞానం, త్యాగము, ఆయన భగవంతుడు. నాల్గవ తరగతి భగవంతుడిని పట్టుకోకండి. మీరు తెలివిగలవారైతే, భగవంతుడు అంటే అర్థం ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి... అర్థం చేసుకోండి.

ఇక్కడ శ్రీమద్-భాగవతం లో, ఇది చెప్పబడింది ఇది మొదటి తరగతి ధర్మము అని చెప్పబడింది. అది ఏమిటి? భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో అనుచరులకు ఇది అవకాశమిస్తుంది. ఎందుకు కాదు? భగవంతుడు గొప్పవాడు అయితే, మన తండ్రి చాలా గొప్ప వాడు అయితే , మనం ఎందుకు ప్రేమించకూడదు? మనము ఇక్కడ ఎవరినో పొగుడుతూ ఉంటాము... కొన్ని లక్షల డాలర్ల ఉన్న వారిని పొగుడుతూ ఉంటాము , అందరిలో అత్యంత ధనికులు అయిన వారిని, మనము ఆయనని ప్రేమించకూడదు? ఎందుకు? కారణం ఏంటి? వాస్తవానికి ఆయన ప్రతిదీ సరఫరా చేస్తున్నాడు, eko bahūnāṁ vidadhāti kāmān. ఆయన అన్ని జీవులకు జీవితపు అన్ని అవసరాలు సరఫరా చేస్తున్నాడు, చీమ నుండి మొదలు పెట్టి ఏనుగు వరకు. ఎందుకు మనకు చేయడు? మనము భగవంతుని సేవ కోసం మన జీవితాన్ని మొత్తం అంకితం చేసాము, కాబట్టి భగవంతుడు చీమకు, ఏనుగుకు, ఆహారాన్ని ఇస్తూ ఉంటే, ఎందుకు మనకు చేయడు? కాబట్టి మీరు భగవంతుని చైతన్యం లో ఆకలితో ఉంటారని అని భావించ వద్దు. మీరు ఆకలితో మరణించరు. మీరు మీ బాధ్యతతో ఉండండి, భగవంతుని ప్రేమిస్తూ, భగవంతుని ప్రేమను ప్రచారము చేస్తూ. మీరు ఎల్లప్పుడూ సంపన్నంగా ఉండండి, పూర్తిగా నమ్మండి. ఒక సాధారణ మనిషి, మీరు ఆయన కోసం పని చేస్తే, ఆయన మీకు జీతం, మంచి జీతం ఇస్తాడు. మనము భగవంతుని కోసం కృషి చేస్తున్నాము, మనం జీతం పొందడము లేదు? అది ఎలా? (నవ్వు) మనకు తప్పక ఉండాలి. మీరు వాస్తవమునకు భగవంతుణ్ణి ప్రేమిస్తే, భగవంతుని కార్మికుడు అయితే, మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించవద్దు. అది మద్దతు ఇవ్వబడుతుంది. భగవద్గీతలో yoga-kṣemaṁ vahāmy aham ( BG 9.22) అని అంటారు. ఆయన వ్యక్తిగతంగా ఏవైనా అవసరమైన వాటిని సరఫరా చేస్తాడు. ఒక తండ్రి వలె. తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడిన చిన్న పిల్లవాడు, తల్లిదండ్రులు అతడి జాగ్రత్తలను చూస్తారు. పిల్లవాడు తల్లిదండ్రులను అడగడు, ఎందుకంటే వాడు మాట్లాడలేడు కనుక. కాబట్టి ఆయన కేవలం భగవంతుని మీద ఆధారపడి ఉన్నాడు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాడు. కేవలము మీరు భగవంతుని మీద ఆధారపడి ఉంటే, మీ ఆర్థిక సమస్య గురించి ఎటువంటి ప్రశ్న ఉండదు. నమ్మకముతో ఉండండి. ఇది లౌకిక జ్ఞానము.

అందువల్ల ప్రస్తుత భక్తుల కొరత ఉంది. ప్రజలు భగవంతుడిని తిరస్కరించారు. ఎవరో చెప్తున్నారు, "భగవంతుడు చనిపోయాడు." ఎవరో భగవంతుడిగా ఒక దుష్టుడుని అంగీకరిస్తున్నారు. ఎవరో తనను తాను భగవంతునిగా ప్రకటించుకుంటున్నారు. లేదు, భగవంతుడిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక భక్తునిగా మారండి, భగవంతుని ప్రేమికునిగా, మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. అంతే కాని "నా భగవంతుడు," "మీ భగవంతుడు," "ఈ ధర్మము," "ఆ ధర్మము." అని కాదు భగవంతుడు ఒక్కడే మరియు ధర్మము ఒక్కటే . ఆ ధర్మము ఏమిటి? భగవంతుని ప్రేమ. అంతే. రెండవ ధర్మము ఏదీ లేదు. ఇది ధర్మము. అందువల్ల భగవంతుడు వచ్చి, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) అని చెప్తారు ఇది ధర్మము