TE/Prabhupada 0988 - శ్రీమతి-భాగవతములో మూఢ విశ్వాసము ఉన్న ధర్మమును (మతమును) గురించి చెప్పలేదు



740724 - Lecture SB 01.02.20 - New York


శ్రీమతి-భాగవతములో మూఢ విశ్వాసము ఉన్న ధర్మమును (మతమును) గురించి చెప్పలేదు

evaṁ prasanna-manaso
bhagavad-bhakti-yogataḥ
bhagavat-tattva-vijñānaṁ
mukta-saṅgasya jāyate
(SB 1.2.20)

Bhagavat-tattva-vijñānaṁ. ఇది సెంటిమెంట్ కాదు; విజ్ఞాన. విజ్ఞాన అంటే శాస్త్రం ఒక భక్తుడు అవ్వటము అంటే ఒక సెంటిమెంటలిస్టు అని కాదు. సెంటిమెంటలిస్టుకు విలువ లేదు ఎవరైతే... నమ్మకము ఉంది. అది భావోద్వేగ నమ్మకము... ఉదాహరణకు ఈ పిల్లవాడు నృత్యం చేస్తున్నట్లుగా ఇది మూఢ విశ్వాసము కాదు - ఆయనకు మూఢ విశ్వాసము లేదు - కానీ ఆయనలో ఆధ్యాత్మికత మేల్కొనటము వలన నృత్యం చేస్తున్నారు ఈ నృత్యము కుక్క చేసే నృత్యము కాదు , ఇది... భగవంతుని ప్రేమను అనుభూతి చెందుతున్న వ్యక్తి , ఆయన నృత్యం చేస్తున్నాడు ఎంత ఎక్కువగా భగవంతుని ప్రేమను అనుభూతి చెందుతారో, ఆయన నృత్యం చేయగలడు, ఆయన కీర్తన చేయగలడు, ఆయన ఏడవ గలడు చాలా ఉన్నాయి ఎనిమిది రకాలు aṣṭa-sāttvika-vikāra ( CC Antya 14.99) శరీరములో మార్పులు, కళ్ళలో కన్నీరు

కాబట్టి...

bhagavat-tattva-vijñānaṁ.
jñānaṁ parama-guhyaṁ me
yad vijñāna-samanvitam
(SB 2.9.31)

కృష్ణుడు బ్రహ్మతో చెప్పాడు, jñānaṁ me parama-guhyaṁ. కృష్ణుని గురించి తెలుసుకోవడమంటే, అది చాలా చాలా రహస్యమైనది. ఇది సాధారణ భౌతిక విషయము కాదు విజ్ఞాన. కావున చాలామంది శాస్త్రవేత్తలు, వారు మన ఉద్యమంలో చేరుతున్నారు. చాలామంది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, కెమిస్ట్రీ, వారు ఈ శాస్త్రమును అర్థం చేసుకుంటున్నారు మీరు మరింత ప్రచారము చేస్తే, నా ఉద్దేశ్యం, సమాజములో ఉన్నత వర్గమునకు చెందిన వారు, జ్ఞానవంతులైన పండితులు, ఆచార్యులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వారు చేరతారు వారి కోసము మన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి ఎనభై పుస్తకాలను ప్రచురించడానికి మన దగ్గర ఒక ప్రతిపాదన ఉన్నది వాటిలో, మనము పధ్నాలుగు పుస్తకాలను ప్రచురించాము

కావున ఇది ఒక శాస్త్రము. లేకపోతే, ఎందుకు శ్రీమద్-భాగవతము పద్దెనిమిది వేల శ్లోకాలను అవగాహన కోసం అంకితం చేసింది? హ్మ్? శ్రీమద్ భాగవతములో ఇది చెప్పబడినది dharmaḥ projjhita-kaitavo 'tra ( SB 1.1.2) ఆ మోసము చేసే, మూఢ నమ్మకము, ధర్మము అని పిలవబడే మత పద్ధతి, projjhita, తన్ని వేయబడింది. శ్రీమద్-భాగవతములో ఇక్కడ అలాంటి ప్రదేశం లేదు. Projjhita. ఉదాహరణకు మీరు చీపురుతో లేదా దేనితో అయినా దుమ్మును దూరంగా పడ వేస్తారో అదేవిధముగా, మురికి విషయాలు, మూఢ విశ్వాసము అని పిలవబడే సెంటిమెంటల్ ధర్మము, ఇక్కడ శ్రీమద్-భాగవతం లో లేదు. ఇది ఒక శాస్త్రం. పరమ-గుహ్య: చాలా గోప్యమైనది.