TE/Prabhupada 0994 - భగవంతునికి మనకు మధ్య ఉన్న తేడా ఏమిటి
730407 - Lecture SB 01.14.43 - New York
భగవంతునికి మనకు మధ్య ఉన్న తేడా ఏమిటి? కమ్యునిస్ట్ దేశానికి వెళ్లినప్పుడు, మాస్కో, ప్రతి ఒక్కరూ అవసరముతో ఉన్నట్లు నేను భావించాను, వారికి నచ్చిన ఆహారాన్ని కూడా వారు పొందలేక ఉన్నారు. ప్రభుత్వం నియమాల ప్రకారము, సరఫరా చేసిన చెత్త విషయములను, వారు అంగీకరించవలసి ఉంది. వాస్తవానికి అక్కడ మంచి ఆహారం లేదు. మనము ఆ నేషనల్ హోటల్ లో ఉంటున్నాము, శ్యామ సుందర అవసరమైనవి తీసుకురావటానికి కనీసం రెండు గంటలు గడపవలసి వచ్చింది. అది కూడా చాలా మంచివి కాదు. బియ్యం పొందలేకపోయాము. ఒక మద్రాసి పెద్దమనిషి, ఆయన మాకు కొంత బియ్యం ఇచ్చాడు, చక్కని గోధుమ పిండిని; లేకపోతే పాలు మరియు వెన్న మాత్రమే అందుబాటులో ఉంది, మరియు మాంసం, అంతే పండు లేదు, ఏ కూరగాయలు లేవు, ఏ చక్కని బియ్యం లేవు, ఈ విషయాలు అందుబాటులో లేవు. ఇది కలి యుగము. వస్తువుల, సరఫరా తగ్గుతుంది. నిజానికి కృష్ణుడు సరఫరా చేస్తాడు.
- nityo nityānāṁ cetanaś cetanānām
- eko yo bahūnāṁ vidadhāti kāmān
ఇది భగవంతునికి మనకు మధ్య ఉన్న తేడా. మనము కూడా వ్యక్తి, భగవంతుడు కూడా వ్యక్తి. Nityo nityānāṁ cetanaś cetanānām. ఆయన కూడా జీవుడు, మనము కూడా జీవులము. కాబట్టి భగవంతునికి మరియు మనకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆ ఏక, ఆ ఒక జీవి, నిత్యః, ఏక సంఖ్య. bahūnāṁ vidadhāti kāmān. ఆయన ఈ బహువచన సంఖ్య యొక్క bahūnām జీవిత అవసరాలను సరఫరా చేస్తాడు. Nityo nityānāṁ cetanaś cetanānām. సంస్కృతంలో తెలిసిన వారు, ఈ నిత్య అంటే ఏక వచనము వ్యక్తి, నిత్యనాం, ఇది బహువచనం. వీరిద్దరూ వ్యక్తులు, వీరిద్దరూ జీవులు, కానీ ఎందుకు ఏక సంఖ్యను భగవంతునిగా భావిస్తారు? ఎందుకంటే ఆయన అన్ని బహువచనములకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తాడు. వాస్తవానికి కృష్ణుడు అన్ని జీవులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకలితో ఉండటానికి ఎవరూ ఉద్దేశించబడలేదు. లేదు. కారాగారములో ఖైదీలు ఖైదీలు జైలులో ఉనప్పటికీ, అయినప్పటికీ ప్రభుత్వము, వారి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, వారి ఆసుపత్రి ఖర్చులను, అంతే కానీ వారు ఆకలితో ఉండటానికి. కాదు అదేవిధముగా, ఈ భౌతిక ప్రపంచంలో మనం శిక్షించబడినప్పటికీ, మనము ఖైదీలము, ఖైదీలు. మనము కదలి పోలేము, మనము ఒక లోకము నుండి మరొక చోటకి వెళ్ళలేము. వారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారు విఫలమయ్యాయి. వారు ఇప్పుడు మాట్లాడరు. (నవ్వు) మనము ఖైదీలము కనుక ఇది సాధ్యం కాదు. బద్ధజీవులము. మీరు ఈ లోకములోనే ఉండవలసి ఉన్నది. వారు వారి లోకములోనే ఉండవలసి ఉంది. మీ స్వంత స్వేచ్ఛ మరియు కోరిక వలన అనే ప్రశ్నే లేదు ఎందుకంటే మీకు ఏ స్వేచ్ఛ లేదు
కానీ నారద మునికి స్వేచ్ఛ ఉంది. నారద ముని ఒక లోకము నుండి మరొక దానికి వెళ్ళుతున్నాడు. ఆయన ఆధ్యాత్మికం ఆకాశం నుండి భౌతిక ఆకాశం ద్వారా వస్తున్నాడు, ఎందుకంటే ఆయన పరిపూర్ణ భక్తుడు. కాబట్టి అది ఆదర్శ జీవి అంటే. కృష్ణుడికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లుగా, అదేవిధముగా మనము పరిపూర్ణము అయినప్పుడు, కృష్ణ చైతన్యములో, మనము కూడా స్వేచ్ఛను పొందుతాము. ఇది మన పరిస్థితి. కానీ మనము మన బద్ధ స్థితిలో కదిలే స్థితిలో లేము. చేయలేము. బద్ధ. Brahmāṇḍa bhramite kona bhāgyavān, మనము బద్ధ జీవులము. కానీ బద్ధ స్థితిలో కూడా, మనము వేదముల సూత్రాలను అనుసరించినట్లయితే మనం ఆనందంగా ఉండగలము. సంతోషంగా, ఈ మానవ రూపములో కూడా ముఖ్యంగా, ఇది ఆ ఉద్దేశ్యము కొరకు ఉద్దేశించ బడినది, మీరు సంతోషంగా జీవిస్తూ, కృష్ణ చైతన్యముని అభివృద్ధి చేసుకోవడానికి సమయమును పొదుపు చేసుకోండి తద్వారా మీరు తరువాతి జీవితములో ఈ భౌతిక ప్రపంచంలో ఇక ఉండరు. మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి బదిలీ చేయబడతారు. ఇది మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం. కానీ వారు ఈ మూర్ఖులకు ఇది తెలియదు. మనము నాగరికతలో ఉన్నత స్థానమునకు వెళ్తున్నామని వారు భావిస్తున్నారు, పిల్లులు మరియు కుక్కలు అవి నేలపై పడుకొని నిద్ర పోతాయి, మనకు 104-అంతస్తుల భవనం ఉంది. మనము అక్కడ పడుకుంటాము. ఇది వారి పురోగతి. కానీ వారు అర్థము చేసుకోరు నిద్రపోవడము, నిద్ర ద్వారా అనందించడము, కుక్కకు, 104 వ అంతస్తులో నిద్రపోతున్న వ్యక్తికి అది ఒకటే అని, అదే కథ. (నవ్వు) అదేవిధముగా, కుక్కకు, మనిషికి లేదా దైవతలకు లైంగిక జీవితం, ఆనందం అదే ఉంది. తేడా లేదు.