TE/Prabhupada 0995 - కృష్ణ చైతన్య ఉద్యమము క్షత్రియుల లేదావైశ్యుల కర్తవ్యము కోసం ఉద్దేశించబడ లేదు

From Vanipedia
Jump to: navigation, search

కృష్ణ చైతన్య ఉద్యమము క్షత్రియుల లేదా వైశ్యుల కర్తవ్యము కోసం ఉద్దేశించబడ లేదు,
- Prabhupāda 0995


730407 - Lecture SB 01.14.43 - New York


కృష్ణ చైతన్య ఉద్యమము క్షత్రియులకు లేదా వైశ్యుల కోసం కాదు

ప్రభుపాద: మీరు బంగారు కుండలో లేదా ఇనుప కుండలో పాలు త్రాగినా, రుచి ఒకే విధముగా ఉంటుంది. మీరు బంగారు కుండలో ఉంచిన, పాలు లేదా దేని యొక్క రుచిని మార్చలేరు. కానీ ఈ మూర్ఖులు వారు ఆలోచిస్తున్నారు, ఇనుము కుండ బదులుగా బంగారు కుండలో ఉంచినప్పుడు మన భౌతిక ఆనందం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. Mūḍhāḥ. వారిని మూఢులు అని పిలుస్తారు. (నవ్వు) మనము ఈ భౌతిక శరీరము నుండి ఎలా బయటపడాలనేది మన వాస్తవిక పని అని వారికి తెలియదు. అంటే, janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) ఇది నిజమైన జ్ఞానం. వ్యక్తి జ్ఞాపకము ఉంచుకోవాలి, జీవితంలో నా నిజమైన బాధ ఈ నాలుగు విషయాలు, janma-mṛtyu-jarā-vyādhi జన్మించడము, చనిపోవటము, వృద్ధులు అవ్వడము, వ్యాధిగ్రస్తులు అవడము. ఇది నా సమస్య. " కానీ వారికి ఇది తెలియదు. వారు ఇప్పుడు పెట్రోలియం సమస్యలో బిజీగా ఉన్నారు. అవును. వారు ఈ పెట్రోలియం సమస్యను సృష్టించారు, ఈ గుర్రము లేని తగరం రవాణా. (నవ్వు) అవును. వారు అనుకుంటున్నారు "గుర్రం కన్నా మెరుగైనది, ఇప్పుడు నేను ఈ తగరం బండిని కలిగి ఉన్నాను." దానికి వృద్ధాప్యము రాగానే దానికి విలువ లేదు. ముఖ్యంగా మీరు మీ దేశంలో వీధిలోకి వదిలేస్తారు. ఎవరూ దానిని పట్టించుకోరు, కానీ వ్యక్తులు ఈ వాహనం కలిగి ఉండాలి. అది పెట్రోల్తో నడవాలి. శ్రమ తీసుకొని, చాలా కష్టమైన శ్రమ, ఎడారిలోకి వెళ్ళి, దానికి రంధ్రం వేస్తారు, ఆపై చమురును తీసి, దానిని ట్యాంకులలో తెచ్చుకుంటారు. దీనిని ఉగ్ర కర్మ అని పిలుస్తారు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, ఈ దుష్టులు, రాక్షసులు, వారు కేవలం ప్రజలందరికి ఇబ్బందులు తెచ్చే ఉగ్ర కర్మ ను సృష్టించారు. అంతే. Kṣayāya jagato 'hitāḥ, నాశనమును దగ్గరగా తీసుకువస్తున్నారు , దగ్గరగా. ఇప్పుడు వారు వెళ్తున్నారు, గొప్ప యుద్ధం ఉండవచ్చు, అంటే నాశనం. కేవలం కొద్దిగా సౌకర్యం సృష్టించడానికి. గతంలో కూడా వారు ప్రయాణము చేసే వారు. రవాణా ఉంది. కానీ వారికి నిమగ్నమవటానికి ఇతర పనులు లేనందున, వారు పూర్వపు మార్గాలలో ఉండటానికి ఇష్టపడరు. మెరుగైన నిమగ్నత, వారికి తెలియదు. ఇక్కడ మెరుగైన నిమగ్నత ఉన్నది: రాధా-కృష్ణుల ముందుకు వచ్చి, భగవంతుడుని కీర్తిస్తూ మన సంబంధమును అర్థం చేసుకోవటము. ఇది మన నిజమైన, నిజమైన కర్తవ్యము, కానీ నిజమైన కర్తవ్యములో ఎవరూ ఆసక్తి కలిగి లేరు. వారి ఆసక్తి నిరుపయోగమైన వాటిలో ఉంచారు: రోజూ మొత్తం కార్యాలయంలో పని చేస్తూ, తరువాత ఇక్కడకు వచ్చి, క్లబ్కు వెళ్ళి, ఫుట్బాల్ క్లబ్, టెన్నిస్ క్లబ్కు కు వెళ్లతారు. ఈ విధoగా వారు ఈ మానవ జీవితాన్ని విలువైన జీవితాన్ని ఎలా వృధా చేయాలి అనేది కనుగొన్నారు. వారు కనుగొన్నారు. వీటిని ఆపడానికి ఈ జీవితమును ఎలా ఉపయోగించాలి అనే భావనే లేదు, నేను చెప్తున్నది ఏమిటంటే ప్రధాన సమస్య, జన్మ, మృత్యు, జరా,... వారికి తెలియదు.

కావున, ఈ శ్రీమద్ భాగవతం ప్రపంచమునకు నిజమైన జీవితాన్ని ఇస్తుంది, నిజమైన, జీవితం అంటే ఏమిటి. కాబట్టి ఇవి ఆచారములు. శ్రద్ధ వహించడానికి, ముఖ్యంగా, బ్రాహ్మణులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు, ఆవులు. ఇది నాగరికత. ఈ జీవులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వారు ఈ పశువులు ఆవులను చంపి, స్త్రీలను వేశ్యలు చేస్తున్నారు, గర్భంలోనే పిల్లలను చంపుతున్నారు. బ్రాహ్మణుడిని గౌరవించాలనే ప్రశ్నే లేదు, బ్రాహ్మణ సంస్కృతి అనేది లేదు. అప్పుడు మీరు ఎలా ఆనందంగా ఉంటారు? అహ్? సమాజంలో బ్రాహ్మణ సంస్కృతి లేనట్లయితే, ఆ సమాజం జంతు సమాజం కన్నా హీనముగా ఉంటుంది. కాబట్టి మనము మన ప్రార్థనలను చేస్తాము

namo brahmaṇya-devāya
go-brāhmaṇa-hitāya ca
jagad-dhitāya kṛṣṇāya
govindāya namo namaḥ

మొదట గౌరవము ఇవ్వబడింది, go-brāhmaṇa-hitāya ca, jagad-dhitāya. మీరు వాస్తవమునకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేయాలనుకుంటే మొత్తం ప్రపంచ ప్రయోజనము కోసం, ఈ రెండు విషయాలను జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. go-brāhmaṇa-hitāya ca, ఆవులను, బ్రాహ్మాణులను వారికి మొదట రక్షణ ఇవ్వాలి. అప్పుడు jagad-dhitāya, అప్పుడు మొత్తం ప్రపంచానికి నిజమైన సంక్షేమం ఉంటుంది. వారికి తెలియదు. Kṛṣi-go-rakṣya-vāṇijyaṁ, go-rakṣya, vāṇijyam, vaiśya-karma svabhāva-jam. ఇది వర్తక తరగతి వ్యక్తుల యొక్క కర్తవ్యము: వ్యవసాయాన్ని మెరుగుపరచడము, ఆవులు రక్షించడము,kṛṣi-go-rakṣya vāṇijyam. మీరు అదనపు ఆహారాన్ని కలిగి ఉంటే, మీరు వాణిజ్యం చేయవచ్చు, vāṇijyam. ఇది వారి కర్తవ్యము. బ్రాహ్మణుడు బుద్ధి పని కోసం ఉద్దేశించబడినాడు. ఆయన సలహా ఇస్తాడు. ఉదాహరణకు మన లాగానే, కృష్ణ చైతన్య ఉద్యమం, మనము ... మనము క్షత్రియుల కర్తవ్యము లేదా వైశ్యుల కర్తవ్యము కోసం ఉద్దేశించబడలేదు, భక్తులు, కానీ అవసరమైతే వారు తీసుకోవచ్చు. కానీ నిజమైన కర్తవ్యము, బ్రాహ్మణులు యొక్క కర్తవ్యము వేదాలను తెలుసుకోవడము, బ్రహ్మణ్, మహోన్నతమైన బ్రహ్మణ్, సంపూర్ణ సత్యమును గురించి తెలుసుకోవడం. ఆయన, ఆయన తెలుసుకొని ఉండాలి, ఆయన జ్ఞానమును ప్రచారము చేయాలి. ఇది బ్రాహ్మణ అంటే. Kīrtayanto. Satataṁ kīrtayanto māṁ yatantaś ca dṛḍha-vratāḥ. ఇది బ్రాహ్మణులు యొక్క కర్తవ్యము.

కాబట్టి, దేవుడు ఉన్నాడని ప్రచారము చేసే ఈ కర్తవ్యమును మనము తీసుకున్నాము. మనము దేవుడితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాము. మీరు అనుగుణంగా పని చేస్తే, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఇది మన కృష్ణ చైతన్య ఉద్యమం. ఈ మూర్ఖులు, వారు మర్చిపోయారు, లేదా వారు, దేవుడిని తెలుసుకోవడము పట్టించుకోవడము లేదు, అది వారి బాధ యొక్క కారణం. నిన్న ఒక విలేఖరి అడిగారు ... అ ప్రశ్న ఏమిటి?

భక్తుడు: "ఇది చమురు సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయము చేస్తుందా?"

ప్రభుపాద: అవును. నేను ఏమి చెప్పాను?

భక్తుడు: "అవును, ఎందుకు కాదు?"

ప్రభుపాద: హూ?

భక్తుడు: "ఎందుకు కాదు?"

ప్రభుపాద: మీకు గుర్తు లేదు?

భక్తుడు: అవును.మీరు చెప్పారు పరిష్కారం ఇప్పటికే ఉంది, కృష్ణ చైతన్యము.

ప్రభుపాద: అవును. వాస్తవమునకు, అది సత్యము! కానీ వారు దానిని తీసుకోరు. వారు దానిని తీసుకోరు. ఇప్పుడు, సమస్య ఏమిటి? ఇది చాలా కష్టము కాదు అక్కడ పెట్రోల్ ఉంది, అది ఉపయోగించబడుతుంది, అది మన ఉపయోగం కోసం ఉద్దేశించబడింది, కానీ ఇబ్బంది ఏమిటంటే అరేబియన్లు, వారు ఇది నాది అని ఆలోచిస్తున్నారు...