TE/Prabhupada 1013 - మరణము వచ్చే ముందే మనము చాలా వేగంగా ప్రయత్నించాలి
750620c - Arrival - Los Angeles
మరణము వచ్చే ముందే మనము చాలా వేగంగా ప్రయత్నించాలి
రామేశ్వర: మీ పుస్తకాలను ప్రచురించేంత వరకు ముద్రణ చేస్తున్న భక్తులు ఆనందముగా ఉండరు.
ప్రభుపాద: అది బాగుంది. (నవ్వు)
జయతీర్థ: వారు ఇప్పుడు రాత్రి వేళ కూడా పని చేస్తున్నారు.
ప్రభుపాద: ఓ
రామేశ్వర: ఇరవై నాలుగు గంటలు.
జయతీర్థ: కంపోజ్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు, తద్వారా మనము యంత్రాల యొక్క పూర్తి ప్రయోజనమును పొందగలము.
ప్రభుపాద: హయగ్రీవ ప్రభు, ఎన్ని పేజీలు నీవు పూర్తి చేస్తున్నావు? మీరు కనీసం యాభై పేజీలను పూర్తి చేయవచ్చు.
హయగ్రీవ: నేను ప్రయత్నిస్తున్నాను. ఒక గంటకు ఒక టేప్ ను.
రాధ-వల్లభ: హయగ్రీవ నేడు మధ్య-లీలలో ఆరవ సంపుటిని పూర్తి చేసినాడు.
ప్రభుపాద: హు్?
రాధ-వల్లభ: హయగ్రీవ నేడు మధ్య-లీలలో ఆరవ సంపుటం సవరణను పూర్తి చేసారు.
ప్రభుపాద:ఓ, ఆరవ సంపుటం, చైతన్య-చరితామృతంలోనా?
రాధ-వల్లభ: అవును. తొమ్మిదవ సంపుటంలో హయగ్రీవ మధ్య-లీలలో ఆరు సంపుటాలను పూర్తి చేశారు.
ప్రభుపాద: మొత్తం తొమ్మిది సంపుటాలు ఉంటాయా?
రామేశ్వర: మధ్య-లీలలో.
జయతీర్థ: మధ్య-లీలలో, మొత్తం తొమ్మిది సంపుటాలు.
రాధ-వల్లభ: నాలుగు సంపుటాలు అంత్య-లీల.
జయతీర్థ: మొత్తం పదహారు సంపుటాలు.
ప్రభుపాద: మన గర్గముని ఎక్కడ ఉన్నాడు?
భవానంద: ఆయన తూర్పున ఉన్నాడు. బఫెలో దగ్గర.
ప్రభుపాద: ప్రచారము చేస్తున్నాడా?
భవానంద: అవును.
ప్రభుపాద: నీవు ఆయనతో ఉన్నావా, సుధామా?
సుధామ: అవును, శ్రీల ప్రభుపాద.
ప్రభుపాద: ప్రతిదీ బాగా జరుగుతుందా?
సుధామ: అవును. (విరామం)
జయతీర్థ:... మొత్తం చైతన్య-చరితామృతం యొక్క, సంకలనం, ఆగస్టు చివరి నాటికి పూర్తి అవుతుంది అని నాకు చెప్పారు.
ప్రభుపాద: అయ్యో? జయతీర్థ: ఆగష్టు ముగిసే సమయానికి చైతన్య-చరితామృతం ఎడిటింగ్ పూర్తి అవుతుంది.
ప్రభుపాద: వారు కూడా వస్తున్నారు, నీతాయ్...?
జయతీర్థ : నితాయ్ మరియు జగన్నాథ వారు రాబోతున్నారు...
రామేశ్వర: మూడు రోజులలో.
జయతీర్థ: జూలై చివరినాటికి వారు వస్తున్నారు... కాబట్టి ఇప్పుడు చాలా వేగంగా వెళ్తున్నది.
ప్రభుపాద: చాలా బాగుంది.Tūrṇaṁ yateta ( SB 11.9.29) తరువాతి మరణం రావడానికి ముందు మనం చాలా వేగంగా ప్రయత్నించాలి. మరణం వస్తుంది. మనం తరువాతి మరణం వచ్చే ముందే మనము తయారు అవ్వాలి ఏ విధముగా అంటే, మన కృష్ణ చైతన్యము పనులను పూర్తి చేసి మనము, భగవధ్ధామమునకు తిరిగి వెళ్ళాలి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళాలి. Tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) ఇది పరిపూర్ణత అంటే. మనము మరొక జన్మ కోసం వేచి ఉంటే, బహుశా మనము పొందలేక పోవచ్చు. భరత మహా రాజ కూడా, ఆయన కూడా పతనమయినాడు. ఆయన ఒక జింక అయ్యాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, "మనకు ఈ అవకాశము వచ్చినది, మానవ జీవితం. మనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి తిరిగి భగవధ్ధామమునకు తిరిగి వెళ్లటానికి అర్హత పొంది ఉండాలి. " ఇది బుద్ధి. అంతే కానీ "అది సరే, నేను మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం ఉన్నది" ఇది మంచి విధానం కాదు. Tūrṇam. తూర్ణం అంటే చాలా త్వరగా పూర్తి చేయడము. Tūrṇaṁ yateta anumṛtyuṁ pated yāvat ( SB 11.9.29) (స్టూడియో ప్రక్కన కరాటే సాధన చేసే వ్యక్తులు ధ్వని మొత్తం గది సంభాషణ యొక్క నేపథ్యాన్ని విస్తరించింది) వారు శాశ్వతంగా జీవించి ఉండేటట్లు, ఈ ప్రజలు సమయం వృధా చేస్తున్నారు. (నవ్వుతు) ఈ కరాటే యొక్క ఉపయోగం ఏమిటి? కరాటే?
జయతీర్థ: కరాటే.
ప్రభుపాద: కరాటే. ఇది మెక్సికోలో చాలా ప్రజాదరణ పొందింది.
జయతీర్థ: ప్రతిచోటా.
ప్రభుపాద: అయితే ఆ పద్ధతి మరణం నుండి కాపాడుతుందా? మరణం వచ్చినప్పుడు, శబ్దం "గో!" (నవ్వు) వారిని రక్షిస్తుందా? ఇది మూర్ఖత్వం. హరే కృష్ణ కీర్తన చేసే బదులుగా, వారు కొంత ధ్వనిని చేస్తున్నారు, ఆ ధ్వని ఆయనని రక్షిస్తుందని ఆలోచిస్తున్నారు. దీనిని మూర్ఖత్వం అని పిలుస్తారు, ముర్ఖుడు. (కరాటే వ్యక్తులు చాలా బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు; భక్తులు నవ్వు) Piśācī pāile jane mati-cchanna haya (Prema-vivarta). మీరు వారిని అడిగితే "ఎందుకు మీరు చాలా పెద్దగా శబ్దం చేస్తున్నారు? హరే కృష్ణ కీర్తన చేయండి, "వారు నవ్వుతున్నారు.
విష్ణుజన: శ్రీల ప్రభుపాద, భక్తివినోద ఠాకురా చెప్పిన దానికి అర్థము ఏమిటి "నేను వెళ్తున్నాను, నా పని పూర్తి కాలేదు"
ప్రభుపాద: మ్..?
విష్ణుజన: భక్తివినోద ఠాకురా తన పనులు పూర్తి కాకుండా ఈ లోకము విడిచిపెట్టినట్లు పేర్కొన్నప్పుడు?
ప్రభుపాద: అప్పుడు మనము పూర్తి చేద్దాము. మనము భక్తివినోద ఠాకురా వారసులము. అందువల్ల అతడు అసంపూర్ణముగా ఉంచారు, తద్వారా దానిని పూర్తి చేయగల అవకాశాన్ని మనము పొందుతాము. అది ఆయన దయ. ఆయన వెంటనే పూర్తి చేయవచ్చు. ఆయన వైష్ణవుడు; ఆయన సర్వశక్తిమంతుడు. కానీ ఆయన మనకు అవకాశం ఇచ్చాడు "మీరు వెర్రి ప్రజలు, మీరు అందరూ కూడా పని చేయండి." అది ఆయన దయ