TE/Prabhupada 1043 - మనము కోకా-కోలా పానీయం త్రాగము. మనము పెప్సి-కోలా పానీయము త్రాగము



751002 - Lecture SB 07.05.30 - Mauritius


మనము కోకా-కోలా పానీయం త్రాగము. మనము పెప్సి-కోలా పానీయము త్రాగము. మనము పొగ త్రాగము ఒక వ్యక్తి ఈ భౌతిక జీవన విధానానికి అలవాటు పడినట్లయితే, ఆయన అర్థం చేసుకోలేడు, లేదా కృష్ణ చైతన్యము గురించి, ఒప్పించలేము. భగవద్గీతలో కూడా, ఇది చెప్పబడినది

bhogaiśvarya-prasaktānāṁ
tayāpahṛta-cetasāṁ
vyavasāyātmikā buddhiḥ
samādhau na vidhīyate
( BG 2.44)

ఎవరైతే భౌతిక జీవన విధానము పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారో అంటే-ఇంద్రియ తృప్తి... భౌతిక జీవితము అంటే అర్థం ఇంద్రియ తృప్తి. ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక జీవితము మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ బాలురు, ఐరోపా మరియు అమెరికా నుండి వచ్చిన ఈ బాలురు, వారు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించారు అంటే వారు ఇంద్రియ తృప్తి పద్ధతిని నిలిపివేశారు. ఏ అక్రమ లైంగిక సంబంధము లేదు, మాంసం తినడం లేదు, ఏ జూదము లేదు, ఏ మత్తు లేదు. ఇది భౌతిక జీవన విధానం. లేకపోతే, ఈ జీవితం ఆ జీవితం మధ్య ఉన్న తేడా ఏమిటి?

మనము భౌతిక జీవన విధానానికి హత్తుకొని ఉంటే, ఈ కృష్ణ చైతన్యము ఉద్యమమును అర్థం చేసుకునేందుకు చాలా కష్టముగా ఉంటుంది. Matir na kṛṣṇe parataḥ svato vā mitho 'bhipadyeta gṛha-vratānām. ఎందుకు? ఇప్పుడు, అదాంత -గోబిః. అదాంత నియంత్రిత లేని అని అర్థం. నియంత్రిత లేని. మన ఇంద్రియాలు నియంత్రించ లేనివి. ఈ ఉదయం, నేను బీచ్ లో నడుస్తున్నప్పుడు, మనము చాలా విషయాలు తెలుసుకున్నాము - కోకా-కోలా సీసా, సిగరెట్ ముక్కలు, మరియు చాలా ఇతర విషయాలు. కాబట్టి ఈ కోకా-కోల అవసరం ఏమిటి? మీరు ఈ సమాజములో ఈ విషయాలను కనుగొనలేరు. మనము కోకా-కోలాను తాగము. మనము పెప్సి-కోలా తాగము. మనము పొగ తాగము. నిస్సహాయమైన కొనుగోలుదారులను భాదితులను చేస్తూ ప్రకటనల ద్వారా భారీ పరిమాణంలో మార్కెట్లో విక్రయించే అనేక విషయాలు... కానీ అవి అనవసరమైన విషయాలు అని అంటారు. అలాంటి విషయాలు అవసరం లేదు. కానీ అదాంత -గోబిః, ఎందుకంటే ఇంద్రియాలను నియంత్రించలేము, వారు వ్యాపారము చేస్తున్నారు. వారు వ్యాపారము చేస్తున్నారు, అనవసరమైన విషయము. కాబట్టి మనము ఇంద్రియాలను నియంత్రించవలసి ఉంటుంది. మనకు వాస్తవముగా ఆధ్యాత్మిక జీవితం కావాలంటే, ఈ భౌతిక కోరల నుండి వాస్తవముగా మనము విడుదల కోరుకుంటే, అప్పుడు మనము ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలి అనే జ్ఞానము కలిగి ఉండాలి. అది కావలసినది. అది మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం. అది మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం. మానవ జీవితం పిల్లులు, కుక్కలు పందుల జీవితాన్ని అనుకరించడం కాదు. అది మానవ జీవితం కాదు