TE/Prabhupada 1044 - నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు



751003 - Morning Walk - Mauritius


నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు

ప్రభుపాద: అనుభావికమైన విధానం చాలా బాగుంది, ఒకవేళ అది కృష్ణునికి చేయబడితే అప్పుడు వారు మొత్తం ప్రపంచాన్ని ఏకం చేయగలరు.

బ్రహ్మానంద: వారు చాలా బాగా నిర్వహించగల ప్రతిభ ఉన్నవారు.

ప్రభుపాద: ఓ, అవును. కానీ మొత్తం ప్రణాళిక వారి సొంత ఇంద్రియ తృప్తి కొరకు ప్రణాళిక చేసారు.

బ్రహ్మానంద: దోపిడి.

పుష్ట కృష్ణ: మనకు ఎప్పుడైనా అటువంటి శక్తి కలిగి ఉంటే, అలాంటిదే చేయాలని ప్రయత్నించాలి, వారు ఇది క్రూసేడ్స్ లాంటిది అని నిందిస్తారు.

ప్రభుపాద: ఇప్పుడు, క్రూసేడ్స్, కూడా..... వారు క్రిస్టియన్ యొక్క ఆలోచనలు విస్తరించ గలిగితే, భగవంతుని ప్రేమ, అది మంచిది. కానీ అది ఆ ఉద్దేశ్యం కాదు. ఇది దోపిడీ.

పుష్ట కృష్ణ: బలవంతం కూడా? ప్రభుపాద: అవును. శక్తి ద్వారా, మీరు మంచి ఔషధాన్ని ఇచ్చినట్లయితే, ఆయనకి మంచిది. నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనకుంటిని. సరిగ్గా ఇలాగే, ఇప్పుడు కూడా. (నవ్వు) కాబట్టి చెంచాతో బలవంతంగా నాకు ఔషధం ఇవ్వబడింది. ఇద్దరు మనుషులు నన్ను పట్టుకనే వారు, నా తల్లి నన్ను ఒళ్ళో తీసుకుని బలవంతం చేస్తే, నేను తీసుకునే వాడిని. నేను ఏ ఔషధం తీసుకోటానికి అంగీకరించలేదు.

హరికేశ: మనమిప్పుడు చేద్దామా, శ్రీలప్రభుపాద?

ప్రభుపాద: అప్పుడు మీరు నన్ను చంపివేస్తారు