TE/Prabhupada 1080 - భగవద్గీత లో సంగ్రహముగా చెప్పినది - అది ఒకే ఒక భగవంతుడు కృష్ణుడు
660219-20 - Lecture BG Introduction - New York
భగవద్గీతలో సంగ్రహముగా చెప్పబడినది - అది ఒకే ఒక భగవంతుడు కృష్ణుడు. కృష్ణుడు ఒక మతపరమైన భగవంతుడు కాదు, శ్రీ భగవానుడు అంత్యములో బిగ్గరగా భగవద్గీతలో చెప్పాడు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః ( BG 18.66) ఈ విధముగా భగవంతుడు బాధ్యతలు తీసుకుంటాడు ఈ విధముగా భగవంతుడు తనకు శరణము పొందిన వారి బాధ్యతలు తీసుకుంటాడు. వారి సర్వ కర్మఫలముల నుండి ముక్తి పొందడానికి ఆయనే బాధ్యత తీసుకుంటాడు
- మలినే మోచనం పుంసాం
- జలస్నానం దినే దినే!
- సకృధ్ గీతామృతస్నానం
- సంసారమలనాశనం!!
- (గీతామాహాత్మ్యము - 3)
ప్రతి రోజు చేసే స్నానం వల్లన మనిషి తనను తాను శుభ్రపరుచుకుంటాడు. కానీ ఒక్కసారి భగవద్గీతను పవిత్ర గంగా జలములో స్నానం ఆచరించడము ద్వారా తన మలినమైన భౌతిక జీవితము నష్ణం అయిపోతుంది (గీతామాహాత్మ్యము - 3)
- గీతా సుగీతా కర్తవ్యా
- కిం అన్యైః శాస్త్రవిస్తరైః !
- యా స్వయం పద్మనాభస్య
- ముఖపద్మాద్ వినిఃసృతా!!
- (గీతామాహాత్మ్యము- 4)
భగవద్గీత దేవదేవుడైన కృష్ణునిచే ప్రసంగించబడింది కనుక, అందువలన ప్రజలు.......... .....ప్రజలు వేదవాజ్మయమును పఠించాల్సిన అవసరము లేదు అతను కేవలం భగవద్గీతను శ్రద్ధతో క్రమముగా పఠించాలి ఇంకా వినాలి. ‘గీతా సుగీతా కర్తవ్యా ‘.......... .......ఇంకా తప్పకుండా మనిషి అదే అన్నివిధాలా ఈ విధులని అనుసరించాలి గీతా సుగీతా కర్తవ్యా కిం అన్యైః శాస్త్రవిస్తరైః ఎందుకంటే ప్రస్తుత యుగములో మనుషులు చాలా లౌకికమైన సంగతులతో కలవరపడిపోతున్నారు అందుచేతనే వేదవాజ్మయముల వైపు అతని దృష్టిని మల్లించడం సాధ్యము కాదు ఈ ఒక్క గ్రంథము చాలు. ఎందుకంటే. ఇది అన్ని వైదిక గ్రంథాల సారం. మరియు ప్రత్యేకముగా దేవదేవుడైన పూర్ణ పురుషోత్తముని ద్వారా ఉపదేశించబడింది
- భారతామృతసర్వస్వం
- విష్ణువక్త్రా ద్వినిసృతమ్!
- గీతాగంగోదకం పీత్వా
- పునర్జన్మ న విద్యతే !!
- ( గీతామాహాత్మ్యము - 5)
ఇక్కడ ఏమని చెప్పబడి ఉన్నది అంటే గంగాజలమును త్రాగిన వాడు అతను కూడా ముక్తిని పొందుతాడు మరి భాగవద్గీతామృతాన్ని పఠనము చేసే వాడి గురించి వేరుగా చెప్పేదేమి ఉంటుంది? భగవద్గీత యన్నది పూర్తి మహాభారతము నించి ద్రవించిన అమృతము. ఇది విష్ణువుచే పలుక బడినది కృష్ణుడే అది విష్ణువు, ఆయన ద్వారా ఉపదేశించబడింది విష్ణువక్త్రా ద్వినిసృతమ్ ఇది దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు నోటినుండి వస్తుంది. ఇంకా గంగా ‘గంగోదకమ్’ కూడాను భగవంతుడి పాదపద్మము నుండి పుట్టింది మరియు భగవద్గీత పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుని నోటి నుండి వస్తుంది దేవదేవుని నోటికి ఇంకా ఆయన చరణాలకి ఏమియు తేడా లేదు అనుకోండి కానీ, నిపక్షపాతముతో కనుక చూస్తే భగవద్గీత గంగజాలము కన్నా అధికమైంది అని మనము గుర్తించవచ్చు
- సర్వోపనిషదో గావో
- దోగ్ధా గోపాలనందనః!
- పార్థో వత్సః సుధీర్భోక్తా
- దుగ్ధం గీతామృతం మహత్ !!
- (గీతామాహాత్మ్యము - 6)
ఈ గీతోపనిషత్తు గోవు లాంటిది దేవదేవుడు ప్రసిద్ధి గాంచిన గోపాలుడు ఇంకా ఆయన ఈ గోవు పాలను పితుకుతున్నాడు ‘సర్వోపనిషదో’, మరియు ఇది అన్ని ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అన్నీ గోవుగా వర్ణించబడింది భగవంతుడు నైపుణ్యము కలిగిన గోప బాలుడు. అతను గోవును పితుకుతూ ఉన్నాడు మరుయు ‘పార్థో వత్సః’ అర్జునుడు దూడ లాగా ఉన్నాడు ‘సుధీర్భోక్తా' పండితులు మరియు శుధ్ధభక్తులు అమృతమైన భగవద్గీతని తీసుకోబోతున్నారు సుధీర్ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఆ పాలు, ఆ అమృతము - భగవధ్గీత జ్ఞానవంతులైన భక్తుల కొరకు ఉంది
- ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం
- ఏకో దేవో దేవకీపుత్ర ఏవ!
- ఏకో మంత్రస్తస్య నామానియాని
- కర్మాప్యేకం తస్య దేవస్య సేవా !!
- (గీతామాహాత్మ్యము - 7)
ఇప్పుడు ప్రపంచము భగవధ్గీత నుండి పాఠము తప్పకుండా నేర్చుకోవాలి ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ప్రస్తుత కాలములో ప్రపంచమునంతటికీ ఒక్కటే గ్రంథము ఆ శాస్త్రమే భగవద్గీత ఏకో దేవో దేవకీపుత్ర ఏవ’ ప్రపంచానికి ఒకటే భగవంతుడు అదే శ్రీ కృష్ణుడు ఏకో మంత్రస్తస్య నామానియాని‘. ఆ మంత్రము. ఆ శ్లోకము. ఆ ప్రార్థన ఏమిటంటే ప్రార్థన ఏమిటంటే ఆయన పేరు కీర్తించడం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే. ఏకో మంత్రస్తస్య నామానియాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా మరియు ఏదైనా పని ఉంటే అది ఆ దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణునికి సేవ చెయ్యడమే అందుకనే భగవద్గీత నించి నేర్చుకోవాలి, ప్రజలు చాలా వరకు ఒకే మతము, ఒకే భగవంతుడు, ఒకే శాస్త్రము, ఒకే కార్యము లేదా ఒకే పని జీవితము మొత్తం ఆత్రుతగా (ఆందోళనగా) ఉన్నారు ఇది భగవద్గీతలో సంగ్రహముగా చెప్పబడి ఉన్నది. అది ఒకే ఒక భగవంతుడు కృష్ణుడు కృష్ణుడు ఒక మతపరమైన భగవంతుడు కాదు ఆ పేరు నుండే కృష్ణ..... ...... కృష్ణుడు అంటే మేము ముందే వివరించాము, కృష్ణుడు అంటే సర్వోన్నతమైన ఆనందం............