TE/Prabhupada 0438 - ఆవు పేడను ఎండబెట్టి మరియు కాల్చి బూడిద చేసి తర్వాత పళ్ళపొడిగా వాడవచ్చును: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0438 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 17:23, 21 September 2017



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


ఆయుర్వేధంలో,ఆవు పేడను ఎండబెట్టి మరియు కాల్చి బూడిద చేసి తర్వాత పళ్ళపొడిగా వాడవచ్చును. ఇది చాలా క్రిమినాశక పళ్ళపొడి. అదేవిధంగా, అనేక విషయలు ఉన్నాయి, వేదాలలో అనేక ఉత్తర్వులు వున్నాయి, ఇవి చూడటానికి విరుద్ధంగా కనిపిస్తాయి, కానీ అవి విరుద్ధమైనవి కావు. అవి అనుభవపూర్వకమైనవి. దివ్య అనుభవపూర్వకమైనవి. ఎలాగయితే ఒక తండ్రి తన పిల్లవాడితో ఇలా అంటాడు, నా ప్రియమైన బాబూ, నీవు ఈ ఆహారాన్ని తీసుకో.ఇది చాలా బాగుంది. తండ్రి యొక్క ప్రామాణికతను నమ్మి, పిల్లవాడు దానిని తీసుకుంటాడు. తండ్రి ఆవిధంగా చెప్తాడు ... పిల్లవాడికి తెలుసు "నా తండ్రి ..." నా తండ్రి విషపూరితమైన దాన్ని నాకు ఎన్నడూ ఇవ్వడు అని అతను నమ్మకంతో ఉన్నాడు. అందువలన అతను ఏ కారణం అడగకుండా, దానిని గుడ్డిగా స్వీకరింస్తాడు, అది స్వచ్చమైనదా లేదా కలుసితమైనదా అని ఆహారం మీద ఎటువంటి పరిశోధన చేయడు. మీరు ఆ విధంగా నమ్మాలి. మీరు పలానా భోజనశాలకు వెళతారు ఎందుకంటే అది ప్రభుత్వంచే ఆమోదించబడింది కాబట్టి. మీరు అక్కడ ఆహారాన్ని తీసుకున్నప్పుడు మీరు దానిని నమ్మవలసివుంటుంది.అది మంచిది, ఇది శుభ్రమైనది, లేదా అది క్రిమినాశకరంగా ఉంటుంది, లేదా అది ... కానీ మీకు అది ఎలా తెలుసు? ప్రామాణికాన్ని బట్టి. ఆ భోజనశాల ప్రభుత్వంచే ఆమోదించబడినది మరియు ద్రువీకరించబడింది కాబట్టి మీరు దాన్ని నమ్ముతారు. అదేవిధంగ శబ్ద ప్రమాణం అంటే సాక్ష్యం లభించిన వెంటనే, వేద సాహిత్యం లో, "ఇది ఇది,"అని వుంటుంది. మీరు అంగీకరించాలి. అంతే. అప్పుడు మీ జ్ఞానం పరిపూర్ణము అవుతుంది, ఎందుకంటే మీరు పరిపూర్ణ మూలం నుండి విషయాన్ని అంగీకరించారు కాబట్టి. అదేవిధంగా కృష్ణుడు, కృష్ణుడు దేవాది దేవుడుగా అంగీకరించబడ్డాడు. అతను ఏది చెప్పినా,అదంతా సత్యమే. అంగీకరించాలి. చివరన అర్జునుడు ఇలా అన్నాడు , sarvam etad ṛtaṁ manye ( BG 10.14) నా ప్రియమైన కృష్ణా! నీవు చెప్పినదంతా నేను అంగీకరిస్తున్నాను. మన పధ్ధతి ఆవిధంగా వుండాలి. సాక్ష్యం ప్రామాణికం నుండి పొందివున్నప్పుడు, మనము పరిశోధన గురించి ఎందుకు ఆలోచించాలి? కాబట్టి సమయం వృధా, శ్రమ వృథా కాకుండా ప్రతి ఒక్కరూ ప్రామాణికత్వాన్ని, వాస్తవమైన ప్రామాణికత్వాన్ని అంగీకరించాలి. ఇది వైధిక పద్ధతి. అందువలన, వేదాలు ఇలా చెబుతున్నాయి, tad vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12).