TE/Prabhupada 0551 - మన విద్యార్థులు ఉన్నత విషయంలో నిమగ్నమై ఉన్నారు, స్వీట్బాల్స్ పొందారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0551 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
(No difference)

Revision as of 11:01, 13 October 2017



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద : Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) పరమ్, మీరు ఉన్నత విషయము పొందితే, మీరు నాశిరక విషయము నీచమైన లక్షణమును వదిలి వేస్తారు. ఇది మన స్వభావం. ఉదాహరణకు మన విద్యార్థులు, అమెరికన్ విద్యార్థులు వలె, వారు అందరు మాంసం తినడంకు అలవాటు పడ్డవారు. కానీ ఇప్పుడు మరొక విద్యార్థి, ఆమె గులాబ్ జామూన్ స్వీట్బాల్స్ సిద్ధం చేస్తుంది, ISKCON బంతులు, వారు మాంసం తినడం మర్చిపోతున్నారు. వారికి ఇక ఏ మాంసం తినడం ఇష్టం లేదు. వారు ఉన్నత విషయంలో నిమగ్నమై ఉన్నారు, స్వీట్బాల్స్ పొందారు. (నవ్వు) అదేవిధముగా, అది మార్గం. ఉన్నత విషయంలో నిమగ్నమై ఉన్నప్పుడు... మనము ఆనందంను కాంక్షిస్తాము. Ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). ప్రతి జీవాత్మ ఆనందం కొరకు వెతుకుతుంది. అది ఆయన స్వభావం. మీరు ఆపలేరు. మీరు ఆపివేస్తే... ఉదాహరణకు బిడ్డ ఆనందం కొరకు వెతుకుతుంది, అతను ఏదో విరొగ్గొడతాడు, ఆనందం అనుభస్తాడు. కాని వాడికి తెలియదు, అది ... అతను ఏదో విరొగ్గొడతాడు, కాని ఆయన కేవలం ఆ విరొగ్గొట్టడం ఆనందిస్తున్నాడు. అదేవిధముగా, జీవితం యొక్క భౌతిక భావనలో ఆనందము ఏమిటో మనకు తెలియదు. మనము కూల్చుతున్నాము మరియు కట్టడం, చేస్తున్నాము. మీ దేశంలో నేను అనేక ప్రదేశాల్లో చూసినట్లు. చక్కని భవనమును కూల్చడం, మరలా ఆ స్థలములో మరొక భవనం కట్టడము. మీరు చూడండి? కూల్చడం మరియు కట్టడం, కూల్చడం మరియు... ఓహ్, ఈ భవనం పాతది. అది కూల్చండి. అదే పిల్లతనం ఆట. మీరు చూడండి? ఈ మానవ రూపం యొక్క విలువైన సమయం వృధా చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు, . కూల్చడం మరియు కట్టడం, కూల్చడం మరియు కట్టడం, "ఈ మోటార్ కారు నిరుపయోగం, మరొక '69 మోడల్." వేల మంది ప్రజలు ఆ '69 నమూనాలో నిమగ్నమై ఉన్నారు. మీరు చూడండి? అది ఏమిటి? సారాంశం, కూల్చడం మరియు కట్టడం, కూల్చడం మరియు కట్టడం, పిల్లల్లాగానే. మీరు చూడండి? అందువల్ల ఒకరు ఉన్నత విషయంలో నిమగ్నం కాకపోతే, కృష్ణ చైతన్యములో, తప్పనిసరిగా వారు ఈ కూల్చడం మరియు కట్టడం, కూల్చడం మరియు కట్టడం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. పనికిమాలిన విషయాల్లో నిమగ్నమై ఉన్నారు. Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మరియు ఇప్పటి వరకు మన కృష్ణ చైతన్యము యొక్క విద్యార్ధులు, వారు ఇరవై నాలుగు గంటలు కంటే రెండు గంటల ఎక్కువ సమయం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఎంతో పొందారు, చాలా విషయాల్లో నిమగ్నమయ్యారు.

అందుచేత ఒకరు కృష్ణ చైతన్యములో లేకపోతే, ఆయన తప్పక మాయ యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి, అదే విషయం. ప్రజలు అటువంటి నిమగ్నతను కీర్తించ వచ్చు. ఆయన డబ్బులు గల మనిషి. ఆయన అలాంటి మంచి భవంతిని విచ్ఛిన్నం చేశాడు మరొక మంచి భవనాన్ని నిర్మించాడు." కాబట్టి, ఈ భౌతిక అంచనాలో ఇది చాలా మంచిది, కానీ ఆధ్యాత్మిక అంచనాలో వారు కేవలం సమయం వృధా చేస్తున్నారు. (పాడతాడు) Hari hari biphale janama goṅāinu, ఆ పాట. (పాడతాడు) Manuṣya-janama pāiyā, rādhā-kṛṣṇa nā bhajiyā, jāniyā śuniyā biṣa khāinu. తెలిసే, ఉద్దేశ్యపూర్వకంగా, నేను విషం తాగుతున్నాను. విషం. ఎందుకు విషం? ఈ విలువైన మానవ జీవితం యొక్క సమయం వృధా చేస్తూ విషం తాగుతున్నాను. ఒక వ్యక్తి విషాన్ని త్రాగినట్లుగా. తన తదుపరి జీవితము ఏమిటో ఆయనకు తెలియదు. ఆయన ఒక దెయ్యం అవుతాడు. సంవత్సరాల తరబడి, ఆయన శిక్షగా ఈ భౌతిక శరీరం కలిగి ఉండడు. మీరు చూశారు? గౌరసుందర మన భగవద్ధర్శన్ లో ఒక దెయ్యం కథనాన్ని రాశారు. ఇంగ్లాండ్లో, క్రోంవెల్ తో పోరాడిన దెయ్యం? ఇప్పటికీ పోరాడుతోంది. రాత్రి పూట, జరుగుతున్న పోరాటము యొక్క ధ్వని ఉంది. మీరు చూడండి? కాబట్టి విషం అంటే ఈ మానవ జీవితం కృష్ణ చైతన్యమును పొందుటకు భగవంతుడు దగ్గరకు తిరిగి వెళ్ళడానికి అవకాశం. కానీ మనము ఈ కృష్ణ చైతన్యములో పాలుపంచుకోకపోతే, కేవలం ఈ కూలగొట్టడం మరియు నిర్మించడములో నిమగ్నమై ఉంటాము, అప్పుడు మనము కేవలం విషాన్ని త్రాగుతున్నాము. దాని అర్థం ఆ తరువాతి జీవితం నేను జనన మరణము యొక్క చక్రం లోనికి విసిరివేయబడతాను 84,00,000 జీవన జాతులలో, నా జీవితము చెడిపోయింది. మనకు తెలియదు ఎన్ని లక్షల సంవత్సరాలు నేను ప్రయాణించవలసి వచ్చేది ఆ జనన మరణ చక్రంలో. అందువలన ఇది విషం