TE/Prabhupada 0897 - మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, అది మీ ప్రయోజనము: Difference between revisions

(No difference)

Revision as of 05:32, 8 February 2018



730417 - Lecture SB 01.08.25 - Los Angeles


మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, అది మీ ప్రయోజనము. కేవలం నామమాత్రపు శిక్ష వలె. కొన్నిసార్లు న్యాయస్థానాల్లో ఒక గొప్ప వ్యక్తి అపరాధి. కాబట్టి, న్యాయమూర్తి లక్ష డాలర్లు కావాలనుకుంటే, అతడు వెంటనే చెల్లించవచ్చు. కానీ అతడు ఆయన నుండి అడుగుతాడు: “వీరు కేవలం ఒక్క సెంటు ఇవ్వండి.” కాబట్టి ఇది కూడా శిక్ష. కానీ తక్కువ. అదే విధముగా మన గత కర్మల వలన మనకు బాధను అనుభవించాలి. అది సత్యము. మీరు నివారించలేరు. karmani nirdahati kintu ca bhakthi-bhajam (BS 5.54). కానీ భక్తియుత సేవలో ఉన్నవారు, కృష్ణ చైతన్యములో వున్నవారు, వారి బాధలు చిన్నవిగా అవుతాయి, నామమాత్రంగా. ఒకరు చంపబడవలసి ఉంటే, అందుచేత చంపబడుటకు బదులు, తన కత్తితో వేలు మీద కొంచెం చిన్నగా తెగుతుంది. ఈ విధముగా, karmani nirdahati kintu ca.....

భక్తియుత సేవలో వున్నవారు, వారు: aham tvam sarva-papebhyo moksayisyami ( BG 18.66) కృష్ణుడు రూఢీ చేస్తున్నారు: “మీ పాపభరితమైన జీవితపు కర్మల నుండి నేను రక్షణను ఇస్తున్నాను.” అతడి వెనుక చాలా, చాలా తీవ్రమైన నేర కార్యక్రమములు ఉన్నప్పుడు...... కొన్నిసార్లు దీనివలే. అతడిని ఉరి తీసేందుకు బదులుగా, వేలుపై కత్తితో కొంచెం గీత వుండవచ్చు. ఇదీ పరిస్థితి. అందువల్ల మనము ప్రమాదమునకు ఎందుకు భయపడాలి? మనము కేవలము కృష్ణచైతన్యము పై ఆధారపడి ఉండాలి, ఎందుకంటే మనం కృష్ణచైతన్యములో జీవించినప్పుడు, ఏ పరిస్థితులలోనైనా, నా ప్రయోజనము ఏమిటంటే నేను తిరిగి ఈ భౌతిక ప్రపంచమునకు రాను. Apunar bhava-darsanam ( SB 1.8.25) మీరు కృష్ణుడిని పదేపదే స్మరిస్తుంటే, మీరు కృష్ణుడిని చూస్తుంటే, మీరు కృష్ణుడి గురించి చదువుతుంటే, మీరు కృష్ణుడి కోసం పని చేస్తుంటే, ఏదో ఒక మార్గము ద్వారా, మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, అది మీ ప్రయోజనం. ఆ ప్రయోజనం మీరు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించకుండా రక్షిస్తుంది. అది నిజమైన ప్రయోజనం. ఇంక నేను ఇతర పనిలో కొంచెం సౌకర్యవంతంగా ఉంటే, నేను కృష్ణుడిని మర్చిపోతే, నేను మళ్ళీ జన్మించవలసి వస్తే, నాకు ప్రయోజనం ఏమిటి? మనము దీని గురించి చాలా జాగ్రత్తగా వుండాలి.