TE/Prabhupada 0014 - భక్తులు చాలా ఉన్నతమైనవారు: Difference between revisions

(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
(No difference)

Latest revision as of 18:21, 8 October 2018



The Nectar of Devotion -- Calcutta, January 30, 1973

భక్తుడికి, కృష్ణుడు అతని అరచేతిలోనే ఉన్నాడు. అజిత, జితోఽప్యాషౌ. కృష్ణుని జయించడము అసాధ్యం అయినప్పటికి, కానీ ఆయన తన భక్తులచే జయించబడడానికి ఇష్టపడతాడు. అది పరిస్థితి. ఇదే విధంగా, ఆయన ఇష్టపూర్వకంగా తన అంతకు తానే తల్లి యశోద చే నియంత్రించ బడుతున్నాడు. రాధారాణిచే నియంత్రించ బడతాడు, ఆయన స్నేహితులచే నియంత్రించ బడతాడు. కృష్ణుడు ఓడించబడతాడు మరియు అతని స్నేహితుడిని తన భుజాలు పైకి తీసుకుంటాడు. ఆచరణాత్మకంగా మనము చూడవచ్చు కొన్నిసార్లు రాజు తన సహచరులలో జోకర్ ని ఉంచుతాడు. మరియు కొన్నిసార్లు జోకర్ రాజుని అవమానిస్తాడు, మరియు రాజు ఆనందిస్తాడు. కొన్నిసార్లు జోకర్... ఒక ప్రఖ్యాత జోకర్ గోపాల బోన్ బెంగాల్ లో ఉన్నాడు అతని వలె. కావున ఒక రోజు రాజు అతన్ని అడిగాడు, గోపాల నీకు మరియు గాడిద మధ్య తేడా ఏంటి అని?" అప్పుడు అతను వెంటనే రాజు నుంచి దూరం లెక్కపెట్టాడు. అతను చెప్పాడు, "అది కేవలం మూడు అడుగులు మాత్రమే, సర్. తేడా కేవలం మూడు అడుగులు మాత్రమే." కావున అందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు రాజు కూడా ఆ అవమానం ని ఆనందించాడు. ఎందుకంటే కొన్ని సార్లు అది అవసరం.

కావున కృష్ణ కూడా... ప్రతి ఒక్కరు ఆయనను ఘనమైన స్థానంలో కీర్తిస్తారు, ప్రతి ఒక్కరు. అది కృష్ణుని స్థానం-మహోన్నతమైన భగవంతుడు. వైకుంఠంలో ఒక్క స్తోత్రము మాత్రమే ఉంటుంది. అక్కడ ఇటువంటివి లేవు. కానీ వృందావనంలో కృష్ణుడు నిబంధనలు లేకుండా ఆయన భక్తుల నుంచి అవమానాన్ని అంగీకరిస్తాడు. ప్రజలకు తెలియదు, వృందావన జీవితం ఎటువంటిదో అని. కావున భక్తులు చాలా పై స్థాయి లో ఉంటారు.

రాధారాణి ఆజ్ఞ ఇస్తుంది, "కృష్ణుడిని ఇక్కడికి రావడానికి అనుమతి ఇవ్వద్దు."

కృష్ణుడు ఇక్కడికి రాకూడదు. ఆయన మిగితా గోపికలను పొగుడుతాడు

"దయచేసి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి."

లేదు, లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ వెళ్ళడానికి ఆజ్ఞ లేదు.

కావున కృష్ణుడు దాన్ని ఇష్టపడతాడు.