TE/Prabhupada 0650 - మీరు ఈ చిక్కులలో నుండి నుండి బయటపడండి, లేదా పరిపూర్ణ యోగమైన కృష్ణ చైతన్యము ద్వారా: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0650 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0649 - Le mental est le conducteur. Le corps est le chariot ou l'automobile|0649|FR/Prabhupada 0651 - Tout le système de yoga veut dire faire du mental notre ami|0651}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0649 - మనస్సు చోదకుడు. శరీరం రథము లేదా కారు|0649|TE/Prabhupada 0651 - మొత్తం యోగ పద్ధతి అంటే మనస్సును మన స్నేహితుడిగా చేసుకోవడం|0651}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|WqXG-NfNRtc|మీరు ఈ చిక్కులలో నుండి నుండి బయటపడండి, లేదా పరిపూర్ణ యోగమైన కృష్ణ చైతన్యము ద్వారా.  <br />- Prabhupāda 0650}}
{{youtube_right|voWf8DWLbgY|మీరు ఈ చిక్కులలో నుండి నుండి బయటపడండి, లేదా పరిపూర్ణ యోగమైన కృష్ణ చైతన్యము ద్వారా.  <br />- Prabhupāda 0650}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969


భక్తుడు: "భౌతిక జీవితములో, మనస్సు ఇంద్రియాలు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తాయి. నిజానికి, పవిత్రమైన ఆత్మ భౌతిక ప్రపంచం లో చిక్కుకుంది ఎందుకంటే భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చేయాలనే మనస్సు యొక్క అహము వలన. అందువల్ల, భౌతిక ప్రకృతి యొక్క మెరుపులకు ఆకర్షించబడకుండా ఉండుటకు మనస్సు శిక్షణ పొందాలి. ఈ విధముగా బద్ధ జీవాత్మ రక్షించ బడుతుంది. భౌతిక వస్తువులకు ఆకర్షించ బడటము ద్వారా ఎవ్వరూ పతనము కాకూడదు ఎంత ఎక్కువగా ఇంద్రియార్థములకు ఆకర్షింపబడి ఉంటారో, అంతగా భౌతిక జీవితములో చిక్కుకొని ఉంటారు. కృష్ణుడి సేవలో మనస్సుని ఎల్లప్పుడూ నిమగ్నం చేసుకోవడము ఉత్తమమైన మార్గం, చిక్కుల నుండి విముక్తి పొందటానికి, ఈ శ్లోకములో సంస్కృత పదం హాయ్ ఈ అంశాన్ని నొక్కిచెప్పడానికి ఉపయోగించబడుతుంది, అనగా, దీనిని తప్పక చేయవలెను. ఇది కూడా చెప్పబడింది: మనిషికి, మనస్సే బంధనమునకు కారణం మనస్సే విముక్తికి కారణం. ఇంద్రియార్థములలో నిమగ్నమైన మనస్సు అనేది బంధనము యొక్క కారణం ఇంద్రియార్థముల నుండి వేరుపడిన మనస్సు విముక్తికి కారణం. ' కావున కృష్ణ చైతన్యములో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్నప్పుడు మనస్సు మహోన్నతమైన విముక్తికి కారణం అవుతుంది. "

ప్రభుపాద: అవును. అవకాశం లేదు. కృష్ణ చైతన్యములో ఎల్లప్పుడూ మనస్సు వినియోగించ బడినప్పుడు, మాయా చైతన్యములో నిమగ్నమయ్యే అవకాశం లేదు. మనం మన మనసును కృష్ణ చైతన్యములో ఎంత నిమగ్నము చేస్తామో, మీరు అంత సూర్యరశ్మిలోనే ఉంటారు, చీకటి లోకి రావటానికి అవకాశం లేదు. అది పద్ధతి. మీరు కావాలనుకుంటే, మీరు స్వేచ్ఛ కలిగి ఉన్నారు. మీరు చీకట్లో గదిలోనే ఉంటారు, మీరు పగటి పూట వెలుగులోకి వస్తారు. ఇది మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు స్పష్టమైన సూర్యకాంతిలోకి వచ్చినప్పుడు, చీకటికి అవకాశం లేదు. చీకటిని కాంతి ద్వారా నిర్మూలించవచ్చు, కానీ కాంతి చీకటిచే కప్పబడదు. మీరు ఒక చీకటి గదిలో ఉన్నారని అనుకుందాం. మీరు ఒక దీపం తీసుకుని రండి. చీకటి పోతుంది. కానీ మీరు ఏదైనా చీకటిగా ఉన్నది తీసుకొని, దానిని సూర్యకాంతిలోకి తీసుకు వెళ్ళండి అది వెలవెలబోతుంది. కావున కృష్ణుడు sūrya-sama māyā andhakāra. కృష్ణుడు కేవలం సూర్యకాంతిలా ఉంటాడు. మాయ కేవలం చీకటి లాగా ఉంటుంది. సూర్యకాంతిలో ఏ చీకటైనా ఏమి చేయగలదు మీరు సూర్యరశ్మిలోనే ఉండండి. చీకటి మీ మీద పని చేయడానికి (చేయలేక) విఫలమవుతుంది. ఇది కృష్ణ చైతన్యము యొక్క మొత్తం తత్వము. కృష్ణ చైతన్య కార్యక్రమాలలో ఎల్లప్పుడు నిమగ్నమై ఉండండి. మాయ మిమ్మల్ని తాకలేదు. ఎందుకంటే చీకటి, కాంతి లో ప్రభావవంతముగా మారడానికి అవకాశం లేదు. ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది. భక్తి-యోగ ద్వారా తన ఆధ్యాత్మిక గురువు, నారదముని యొక్క ఆధ్వర్యంలో వ్యాసదేవుడు ఉన్నప్పుడు: bhakti-yogena praṇihite samyak, praṇihite 'male. Bhakti-yogena manasi ( SB 1.7.4) అదే మనస్సు, మనసి అంటే మనస్సు. భక్తి-యోగ, భక్తి-కాంతి, ద్వారా జ్ఞానోదయము అయినప్పుడు bhakti-yogena manasi samyak praṇihite amale. మనస్సు పూర్తిగా అన్ని కాలుష్యముల నుండి విముక్తమైనప్పుడు. అది భక్తి-యోగ ద్వారా చేయబడుతుంది. Bhakti-yogena manasi samyak praṇihite 'male apaśyat puruṣaṁ pūrṇam. ఆయన భగవంతుని చూశాడు. Māyāṁ ca tad-apāśrayam. ఆయన ఈ మాయను కూడా అప్పుడే నేపథ్యంలో చూశాడు. Apāśrayam. కాంతి మరియు చీకటి, ఆయనతో పాటు. ఉదాహరణకు ఇక్కడ కాంతి ఉంది. ఇక్కడ కొంచము చీకటి ఉంది, కొద్దిగా చీకటి. కాబట్టి చీకటి కాంతి యొక్క ఆశ్రయములో ఉంది. కానీ కాంతి చీకటి యొక్క ఆశ్రయం కింద ఉండదు. అందువల్ల వ్యాసదేవుడు, భగవంతుడిని, కృష్ణుడిని చూసినాడు, ఈ మాయా, చీకటి, apāśrayam, ఆయన ఆశ్రయం కింద ఉంది.

ఈ మాయ ఎవరు? ఇది వివరించబడింది. Yayā sammohito jīva. ఇదే మాయ, అదే భ్రాంతి కలిగించే శక్తి అది బద్ధ జీవులను కప్పి ఉంచినప్పుడు. ఎవరు బద్ద జీవులు అయినారు? Yayā sammohito jīva ātmānaṁ tri-guṇātmakam ( SB 1.7.5) ఈ ఆత్మ కృష్ణుడు లేదా భగవంతుడి వలె చాలా తేలికగా ఉన్నప్పటికీ, చిన్నది అయినప్పటికీ. కానీ ఆయన ఈ భౌతిక ప్రపంచంతో తనని తాను గుర్తించుకుంటున్నాడు. Yayā sammohitaḥ, దీనిని భ్రాంతి అంటారు. మనము ఈ పదార్ధములతో మనల్ని మనము గుర్తించినప్పుడు. Yayā sammohito jīva ātmānaṁ tri-guṇātmakam, paro 'pi manute 'nartham. ఆయన ఆద్యాత్మికము అయినప్పటికీ, ఇప్పటికీ ఆయన పనికిమాలిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు. Paro 'pi manute 'narthaṁ tat-kṛtaṁ cābhipadyate. ఆయన ఈ మాయ మార్గ నిర్దేశములో పని చేస్తాడు. ఇవి శ్రీమద్-భాగవతం మొట్టమొదటి స్కంధము ఏడవ అధ్యాయములో చాలా చక్కగా వివరించబడ్డాయని కనుగొంటారు.

కాబట్టి మన పరిస్థితి అది. మనము ఆధ్యాత్మిక అగ్ని కణములము, మెరుపు కణములము. కానీ ఇప్పుడు మనం ఈ భౌతిక శక్తితో కప్పబడి ఉన్నాము, మాయ ద్వారా. మనము మాయ ఆధ్వర్యంలో నడుచుకుంటున్నాము, భౌతిక శక్తి లో మరింతగా చిక్కు కొంటున్నాము. మీరు ఈ చిక్కులలో నుండి నుండి బయటపడండి ఈ యోగా, లేదా పరిపూర్ణ యోగమైన కృష్ణ చైతన్యము ద్వారా. అది యోగ పద్ధతి