TE/Prabhupada 0817 - నేను క్రైస్తవుడను,' నేను హిందూ, 'నేను ముస్లిమ్,' అని ముద్ర వేసుకొనుట వలన లాభం లేదు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0817 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 4: | Line 4: | ||
[[Category:TE-Quotes - 1975]] | [[Category:TE-Quotes - 1975]] | ||
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]] | [[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]] | ||
[[Category:TE-Quotes - in South | [[Category:TE-Quotes - in South Africa]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0816 - ఈ శరీరం ఒక యంత్రం, కాని మనము యంత్రమును నేనుగా అంగీకరిస్తున్నాము|0816|TE/Prabhupada 0818 - సత్త్వ గుణము యొక్క స్థితిపై, పరిపుర్ణమైన మంచిని అర్థం చేసుకోవచ్చు|0818}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 17: | Line 17: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|bv-94R5Xr1w|నేను క్రైస్తవుడను,' నేను హిందూ, 'నేను ముస్లిమ్,' అని ముద్ర వేసుకొనుట వలన లాభం లేదు <br/>- Prabhupāda 0817}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Latest revision as of 23:45, 1 October 2020
751019 - Lecture BG 04.13 - Johannesburg
కాబట్టి మనం ఏదైనా మత పద్ధతిని (ధర్మ పద్ధతిని) తీసుకోవాలి. అది మానవత్వం. మీరు ఏ మతమునైన (ధర్మమునైనా ) తీసుకోండి, కానీ ధర్మము యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోండి, నేను క్రైస్తవుడను, "నేను హిందువును," "నేను ముస్లిమ్ ను." అని కేవలము చెప్పుకోవటము కాదు కానీ ధర్మమును పాటించే వారిమి కావడములో ఉద్దేశం ఏమిటి? అది మీకు తెలిసి ఉండాలి. ఇది బుద్ధి అంటే. కేవలము 'నేను క్రైస్తవుడను, "నేను హిందూవును," "నేను ముస్లిం" అని చెప్పడం ద్వారా గర్వముగా ఉండకండి. అది సరియైనదే, మీరు కొన్ని రకాలైన హోదాలను కలిగి ఉన్నారు. కానీ భాగవతము చెప్తుంది ఆ ధర్మము యొక్క పద్ధతి పరిపూర్ణమైనది. అది ఏమిటి? Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) ఆ ధర్మము, ఆ ధర్మము యొక్క పద్ధతి, ఖచ్చితమైనది. Sa vai puṁsāṁ paro. పరో అంటే ఖచ్చితమైన అని అర్థము, ఏ లోపం లేకుండా. అది ఏమిటి? Yato bhaktir adhokṣaje: దాని ద్వార, అటువంటి ధర్మ పద్ధతిని అనుసరించడము ద్వారా, నీవు భగవంతుని భక్తుడివి అయితే, అది పరిపూర్ణము. " ఆయన మీరు ఒక హిందువు లేదా మీరు ఒక ముస్లిమ్ అవ్వండి అని చెప్పడము లేదు. లేదా మీరు ఒక క్రిస్టియన్ లేదా ఒక బౌద్ధ లేదా ఏదైనా ఇతర విషయమును అవ్వండి అని చెప్పడము లేదు. ఇది చాలా ఉదారంగా ఉంది, మీరు స్వీకరించే ధర్మ పద్ధతి ఏదైనా, దాని వలన హాని లేదు, ఇది చాలా ఉదారంగా ఉంది; పర్వాలేదు. కానీ ఫలితం చూడండి. ఫలితమేమిటి? Yato bhaktir adhokṣaje: మీరు భగవంతుణ్ణి అర్థం చేసుకున్నారా మరియు మీరు భగవంతుని ప్రేమికుడు అయినారా లేదా. అప్పుడు మీ ధర్మము పరిపూర్ణంగా ఉంది. నేను క్రైస్తవుడను,' నేను హిందూ, 'నేను ముస్లిమ్,' అని ముద్ర వేసుకొనుట వలన లాభం లేదు. ఇది కూడా శ్రీమద్-భాగవతము లో వివరించబడింది.
- dharmaḥ svanuṣṭhitaḥ puṁsāṁ
- viṣvaksena-kathāsu yaḥ
- notpādayed ratiṁ yadi
- śrama eva hi kevalam
- (SB 1.2.8)
Dharmaḥ svanuṣṭhitaḥ, మీరు పాటించే ఏ ధర్మమైనా, అది పట్టింపు లేదు. మీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ధర్మ పద్ధతి ప్రకారం, మీరు నియమాలు నియంత్రణలను అనుసరిస్తున్నారు మరియు అన్నింటినీ చేస్తున్నారు. Dharmaḥ svanuṣṭhitaḥ puṁsām: "జాగ్రత్తగా సూత్రాన్ని అమలు చేయడం ద్వారా," Viśvaksena-kathāsu yaḥ, "మీరు భగవంతుని గురించి మరింతగా మరియు మరింతగా తెలుసుకోవడానికి మీరు ఆతృత చెందుకుంటే..." Viṣvaksena kathā... Viṣvaksena అంటే భగవంతుడు. Kathāsu yaḥ, notpādayed ratiṁ yadi: మీరు భగవంతుని గురించి మరింత ఎక్కువగా శ్రవణము చేయడానికి మరింత ఆసక్తి పెంచుకోక పోతే, అప్పుడు అది "śrama eva hi kevalam," కేవలం సమయం వృధా. " కేవలము సమయము వృథా, ఎందుకంటే ధర్మము అంటే dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) ధర్మము అంటే భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ, మీరు అనుసరిస్తారు. ఇది ధర్మము యొక్క సరళమైన నిర్వచనం. ఇతర సంప్రదాయక వేడుకలు, సూత్రాలు, చర్చికి వెళ్ళటము లేదా ఆలయానికి వెళ్ళటము, ఇవి వివరాలు. కానీ వాస్తవమైన ధర్మం అనగా, ధర్మము యొక్క మొత్తం విషయము అంటే భగవంతుడు ఆజ్ఞలకు కట్టుబడి ఉండటము. అంతే. అది ధర్మము. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam.
మీరు ధర్మమును తయారు చేయలేరు. వాస్తవ ధర్మము అంటే ఏమిటి, మీరు అనుసరించినట్లయితే, అప్పుడు మీరు ధర్మముగా ఉంటారు. వాస్తవమైన ధర్మము అంటే భగవంతుని ఆజ్ఞ. అంటే... ప్రతి ఒక్కరూ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ధర్మము యొక్క కొన్ని సూత్రాలను అనుసరిస్తారు. మన వేదముల పద్ధతిలో జీవితము యొక్క ఏకైక ఉద్దేశము భగవంతుని అర్థం చేసుకోవటం. Athāto brahma jijñāsā.. మానవ జీవితములో మనకు వేరే కర్తవ్యము లేదు. ఏ ఇతర పని లేదు. ఇతర పని, ఆ, పిల్లులు కుక్కలు కూడా చేస్తున్నాయి మనము కూడా చేస్తున్నాము. ఇది సహజముగా. జంతువులు ఆకలితో ఉన్నాయి అని కాదు అవి కూడా తింటున్నాయి మనము కూడా తింటున్నాము కానీ సౌకర్యం ఏమిటంటే, మానవుని కంటే అధమ స్థాయిలో ఉన్న జంతువులు, అవి ఏ పనులను లేదా వృత్తిని చేయడము లేదు జీవనోపాధి సంపాదించడానికి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లడం లేదు. అది వాటి కున్న లాభము. మనకు ఉన్న నష్టం ఏమిటంటే మనం మంచి ఆహార పదార్థాలను కనుగొనాలని ప్రయత్నిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాము, అయినా మనము ఇంకా పొందడము లేదు. కాబట్టి వాటి ప్రయోజనము మెరుగైనది. ఉదయాన్నే పక్షులు, చిన్న పక్షులు, ఉదయాన్నే అవి నిద్ర లేస్తాయి అవి కిచకిచ మని అరుస్తూ ఉంటాయి, అవి వెళ్లుతాయి, ఎందుకంటే అవి నమ్ముతాయి మన ఆహారము సిద్ధంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా మనము. అది సత్యము. అవి ఏ చెట్టు మీదకు అయినా వెళ్లుతాయి. పక్షి ఏమి తింటుంది? నాలుగు, ఐదు చిన్న పండ్లను. కానీ ఒక్క చెట్టులో అసంఖ్యాకమైన పండ్లు ఉన్నాయి, అసంఖ్యాకంగా చెట్లు ఉన్నాయి. అదేవిధముగా ఏ జంతువును అయినా తీసుకోండి, ఏనుగు అయినా కూడా. ఆఫ్రికాలో చాలా ఏనుగులు ఉన్నాయి, లక్షలాది ఏనుగులు ఉన్నాయి. అవి ఒకే సమయంలో నలభై కిలోలు తింటాయి. ఆహారాన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు? వాటికి పని లేదు. వాటికి వృత్తి లేదు. కానీ అవి ఎలా తింటున్నాయి? హమ్?