TE/Prabhupada 0214 - మనము భక్తులుగా ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని చురుకుగా ముందుకు సాగించవచ్చు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0214 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Washington D.C.]]
[[Category:TE-Quotes - in USA, Washington D.C.]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0213 - Arrêtez la mort et alors j’accepterai votre pouvoir mystique|0213|FR/Prabhupada 0215 - Lisez et vous comprendrez|0215}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0213 - మరణాన్ని ఆపు - అప్పుడు నేను మీ అనుభూతి యోగాన్ని చూస్తాను|0213|TE/Prabhupada 0215 - మీరు చదవాలి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు|0215}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|GemQlulwjec|మనము భక్తులుగా ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని చురుకుగా ముందుకు సాగించవచ్చు  <br />- Prabhupāda 0214}}
{{youtube_right|XhZ3QermjFA|మనము భక్తులుగా ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని చురుకుగా ముందుకు సాగించవచ్చు  <br />- Prabhupāda 0214}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Room Conversation 1 -- July 6, 1976, Washington, D.C.


ప్రభుపాద: భారతదేశంలో మనకు చాలా భూమి ఇవ్వబడింది. కానీ నిర్వహించడానికి మన వద్ద వ్యక్తులు లేరు.

స్వరూప దామోదర: నాకు కూడా మణిపూర్ నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లైఫ్ సభ్యుడు, కులావిదా సింగ్, యువకులు ఇప్పుడు దైవపరమైన ఆలోచనకు దూరంగా వుంటున్నారు అని అతను ఆందోళన పడుతున్నాడు, అందువలన అతను పాఠశాల లాంటిది ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు ....

ప్రభుపాద: వివేకానంద చేత ఆ విపత్తు చేయబడింది, yato mata tato patha, (అస్పష్టమైన)

స్వరూప దామోదర: వెంటనే ... వారు ఒక ISKCON శాఖ ప్రారంభించాలని కోరుకున్నారు, అతను ఒక ...

ప్రభుపాద: నేను కష్టం కాదని భావిస్తున్నాను. మణిపూర్ ...

స్వరూప దామోదర: ఇది చాలా సులభం, ఎందుకంటే ...

ప్రభుపాద: ... వైష్ణవా. వారు అర్థం చేసుకుంటే, అది చాలా బాగుంటుంది.

స్వరూప దామోదర: అన్ని, ప్రభుత్వం కూడా పాల్గొంటుంది. కాబట్టి వారు మనకు మంచి భూమి, ప్లాటు, ... ఇస్తామని ఒక లేఖ వ్రాశారు.

ప్రభుపాద: ఓ అవును. ఇప్పుడు గోవిందజీ ఆలయం?

స్వరూప దామోదర: గోవిందజీ ఆలయం ప్రభుత్వముచే తీసుకొన బడింది, అందువలన నేను మాట్లాడాను, ఒక లేఖ వ్రాశాను ...

ప్రభుపాద: ప్రభుత్వం, వారు నిర్వహించలేరు.

స్వరూప దామోదర: వారు సరిగ్గా నిర్వహించటంలేదు.

ప్రభుపాద: వారు చేయలేరు. భారతదేశంలో ప్రత్యేకించి, రాష్ట్రంలోకి వెళ్లిన వెంటనే, ఏదైనా సరే ప్రభుత్వ మార్గములోకి వెళుతుంది, అది చెడిపోతుంది. ప్రభుత్వం అనగా అందరూ దొంగలు మరియూ మోసగాళ్ళు. ఎలా నిర్వహించగలరు? ఏది వచ్చినా, వాళ్ళు నేరుగా అది మింగేస్తారు. ప్రభుత్వం అంటే ... వారు నిర్వహించలేరు, వారు భక్తులు కాదు. ఇది భక్తుల చేతుల్లో ఉండాలి. (అస్పష్టమైన), చెల్లింప బడిన వ్యక్తి, వారికి కొంత డబ్బు కావాలి, అంతే. ఎలా వారు ఆలయం నిర్వహిస్తారు? అది అసాధ్యం.

స్వరూప దామోదర: ఇది రాజకీయ సమస్యగా మారుతుంది.

ప్రభుపాద: అంతే. యా?

స్వరూప దామోదర: ఇది రాజకీయాల్లో కలసి పోతుంది. ఆ విధంగా ... దైవారాధనతో సంబంధము వుండదు.

ప్రభుపాద: ఏమైనా, అందువల్ల ప్రభుత్వం భక్తుని చేతికి ఇవ్వాలి. మనము గుర్తించబడ్డ భక్తులము, ఇస్కాన్. వారికి కావాలంటే, వాస్తవమైన నిర్వహణ. భక్తుల ఖాతాలో మనము చాలా కేంద్రాలు నిర్వహిస్తున్నాము. ఈ పనులను చెల్లింపబడిన వ్యక్తుల చేత నిర్వహించబడటము సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు.

భక్తుడు: కాదు.

ప్రభుపాద: వారు ఎప్పటికీ కాదు ........ వారు కాదు ... మనము భక్తులుగా ఉన్నంత కాలము ఈ ఉద్యమాన్ని చురుకుగా సాగించవచ్చు, లేదంటే ఇది ముగిసి పోతుంది. ఇది బయటివారిచే నిర్వహించబడలేదు. కాదు భక్తులు మాత్రమే. అదీ రహస్యం.

భక్తుడు: మీరు భక్తునికి వేతనం చెల్లించలేరు.

ప్రభుపాద: యా?

భక్తుడు: మీరు భక్తుని కొనుగోలు చేయలేరు.

ప్రభుపాద: ఇది సాధ్యం కాదు.

భక్తుడు: మీరు నేలని వూడవటానికి ఎవరినైనా కొనవచ్చు, కానీ మీరు బోధకుని కొనలేరు.

ప్రభుపాద: లేదు, అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. కాబట్టి ఎంత కాలము వరకు మనము భక్తులుగా ఉంటామో, మన ఉద్యమము ముందుకు సాగుతూనే వుంటుంది, ఏ విధమైన తనిఖీ లేకుండానే.

భక్తుడు: భక్తులు ప్రపంచాన్నంత వారి ఆధీనములోకి తీసుకోవాలి.

ప్రభుపాద: అవును, అది ... ప్రపంచానికి మంచిది.

భక్తుడు: అవును.

ప్రభుపాద: భక్తులు ప్రపంచాన్నంత నిర్వహణ కోసం తీసుకుంటే, అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణునికి అది కావాలి. పాండవులు ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని కృష్ణుడు కోరాడు. అందువలన అతను పోరాటంలో పాల్గొన్నాడు. "అవును, మీరు ఉండాలి ... కౌరవులందరూ చంపబడాలి, మరియూ మహారాజు యుధిష్టురిని సంస్థాపించారు. " అతను అది చేశాడు. Dharma-saṁsthāpanārthāya. Paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām ( BG 4.8) అతను ప్రతిదీ చాలా సజావుగా వెళ్ళాలని కోరారు మరియూ ప్రజలు దైవ చైతన్యవంతులౌతారు. కాబట్టి వారి జీవితం విజయవంతమవుతుంది. అది కృష్ణుని పథకం. ఆ, "ఈ దుష్టులు తప్పుదోవ పట్టిస్తున్నారు మరియూ వారి ... వారు మానవ జీవితం పొందారు మరియూ అది చెడిపోయింది." అందువలన "స్వాతంత్ర్యం అంటే అర్ధం ఏమిటి? డాగ్ డాన్సింగ్." జీవితం చెడిపోయింది. వారు వారి జీవితాన్ని పాడుచేసుకుంటారు మరియూ తరువాతి జన్మలో కుక్క అవుతారు, మరియూ ఈ పెద్ద పెద్ద భావనాల్ని తేరి పార చూస్తూవుంటారు, అంతే. ఎవరైతే తరువాతి జన్మలో కుక్కగా ఉంటారో, వారికి ఈ పెద్ద భవంతులు ఏమి లాభము చేకూరుస్తాయి? ఒక సిద్ధాంతంగా తీసుకుంటే, ఈ గొప్ప గొప్ప భవనాల్ని నిర్మించిన వారు తదుపరి జన్మలో వారు ఒక కుక్కగా ఉంటారు.

స్వరూప దామోదర: కానీ వారు తరువాతి జన్మలో కుక్కై ఉంటారని వారికి తెలియదు.

ప్రభుపాద: ఇదే ఇబ్బంది. వారికి ఇది తెలియదు. అందువలన మాయ.