TE/Prabhupada 0926 - అటువంటి వ్యాపార మార్పిడి ఉండకూడదు. అది కావలసినది. కృష్ణునికి అటువంటి ప్రేమ కావాలి: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0925 - Cupidon enchante tout le monde. Et Krishna enchante Cupidon|0925|FR/Prabhupada 0927 - Comment vous analyserez Krishna? Il est illimité. Il est impossible|0927}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0925 - ప్రతి ఒక్కరినీ మన్మథుడు ఆకర్షిస్తాడు. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షిస్తాడు|0925|TE/Prabhupada 0927 - కృష్ణుడిని మీరు ఎలా విశ్లేషిస్తారు ఆయన అపరిమితమైనవాడు. అది అసాధ్యం|0927}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|QrfPVqnCPGA|అటువంటి వ్యాపార మార్పిడి ఉండకూడదు. అది కావలసినది. కృష్ణునికి అటువంటి ప్రేమ కావాలి  <br/>- Prabhupāda 0926}}
{{youtube_right|jLG1SrNCAMU|అటువంటి వ్యాపార మార్పిడి ఉండకూడదు. అది కావలసినది. కృష్ణునికి అటువంటి ప్రేమ కావాలి  <br/>- Prabhupāda 0926}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



730423 - Lecture SB 01.08.31 - Los Angeles


అటువంటి వ్యాపార మార్పిడి ఉండకూడదు. అది కావలసినది. కృష్ణునికి అటువంటి ప్రేమ కావాలి మనము కొంత భౌతిక ప్రయోజనము కోసం కృష్ణుడిని ప్రేమించకూడదు. అది కాదు: "కృష్ణ, మాకు మా రోజు వారి రొట్టె ఇవ్వు, అప్పుడు నేను ప్రేమిస్తాను. కృష్ణ, నాకు ఇది ఇవ్వు. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను. " అలాంటి వాణిజ్య మార్పిడి ఉండకుడదు. అది కావలసినది. కృష్ణుడు ఆ రకమైన ప్రేమను కోరుకుంటున్నాడు. ఇక్కడ చెప్పబడింది, ఆ స్థానము, yā te daśā, daśā... కృష్ణుడు తన తల్లి తనను కట్టడానికి తాడుతో వస్తుంది అని చూసిన వెంటనే, కావున ఆయన వెంటనే చాలా భయపడ్డాడు ఎంతగా అంటే కన్నీళ్లు బయటకు వచ్చాయి. ఓ..., నన్ను కట్టివేయడానికి తల్లి వస్తుంది. Yā te daśāśru-kalila añjana. లేపనం కడిగివేయబడినది. సంభ్రమ. గొప్ప గౌరవముతో తల్లిని చూస్తున్నాడు, ప్రేమ భావముతో అవును, అమ్మా, నేను నీకు అపరాధం చేశాను. దయతో నన్ను క్షమించు. ఇది కృష్ణుడి దృశ్యం. ఆ దృశ్యమును కుంతి ప్రశంసించింది. వెంటనే ఆయన తల కిందకి వచ్చింది.

కాబట్టి ఇది కృష్ణుడి యొక్క మరొక పరిపూర్ణము, ఆయన భగవంతుడు అయినప్పటికీ... భగవద్గీతలో ఆయన ఇలా చెబుతాడు: mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya ( BG 7.7) నా ప్రియమైన అర్జునా, నాకు పైన ఉన్నతమైన వారు ఎవరు లేరు. నేను అత్యున్నతమైనవాడిని. Mattaḥ parataraṁ na anyat. ఎవ్వరూ లేరు. " భగవంతుడు దేవాదిదేవుని పైన ఎవరూ లేరు, ఆ దేవాదిదేవుడు తల్లి యశోద ముందు ప్రణమిల్లుతున్నాడు. Ninīya, vaktraṁ ninīya. ఆయన అంగీకరిస్తున్నాడు: "నా ప్రియమైన అమ్మా , అవును, నేను అపరాధిని." Ninīya vaktraṁ bhaya-bhāvanayā, భయపడుతున్న భావనతో. Sthitasya. కొన్నిసార్లు యశోదమాత, తల్లి యశోద, చూస్తూ ఉండేది పిల్లవాడు చాలా భయపడినాడు అని, ఆమె చాలా కలత చెందినది. ఎందుకంటే పిల్లవాడు కలత చెందినట్లయితే... ఇది మనస్తత్వ శాస్త్రము. కొంత మానసిక ప్రతి చర్య ఉంటుంది కావున నా శిక్ష వలన కృష్ణుడు బాధపడాలని తల్లి యశోద కోరుకోలేదు. అది తల్లి యశోదా యొక్క ఉద్దేశ్యం కాదు. కానీ ఒక తల్లి వలె, పిల్లవాడు చాలా గొడవ చేస్తున్నాడు అని ఆమెకు అనిపించినప్పుడు, ...

ఈ పద్ధతి ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది, పిల్లవాడు చాలా గొడవ చేస్తూన్నప్పుడు, వాడిని ఒక ప్రదేశములో కట్టి వేస్తారు. ఇది చాలా సాధారణమైన పద్ధతి. కాబట్టి తల్లి యశోదా దానిని పాటించినది. Sā māṁ vimohayati. అందువల్ల ఆ దృశ్యమును పవిత్రమైన భక్తులు ప్రశంసించిరి, భగవంతునిలో ఎంత గొప్పతనం ఉందంటే, ఆయన సరిగ్గా ఖచ్చితమైన పిల్లవాడి లాగా ఆడుకుంటున్నాడు. ఆయన చిన్న పిల్లవాడిగా ఆడుతున్నప్పుడు, ఆయన పరిపూర్ణంగా ఆడుకుంటున్నాడు ఆయన 16,000 మంది భార్యలకు భర్తగా వ్యవహరిస్తున్నప్పుడు, ఆయన పరిపూర్ణమైన భర్తగా వ్యవహరిస్తున్నాడు. గోపికల ప్రేమికుడిగా ఆయన వ్యవహరిస్తున్నప్పుడు, ఆయన పరిపూర్ణముగా వ్యవహరిస్తున్నాడు. ఆయన గోప బాలురి స్నేహితుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణముగా వ్యవహరిస్తున్నాడు.

గోప బాలురు అందరూ కృష్ణుడిపై ఆధారపడి ఉన్నారు. తాటి చెట్టు ఫలాలను రుచి చూడాలని వారు కోరుకున్నారు, కానీ ఒక రాక్షసుడు ఉన్నాడు, గార్దభాసుర వారు ఆ తాటి చెట్టు దగ్గరకు ఎవరిని అనుమతించరు. కానీ కృష్ణుడి స్నేహితులు,గోప బాలురు, వారు కోరారు: కృష్ణా, మాకు ఆ పండును రుచి చూడాలని ఉంది. నీవు ఏర్పాటు చేయగలిగితే... అవును. తక్షణం కృష్ణుడు ఏర్పాటు చేశాడు. కృష్ణుడు మరియు బలరాముడు అడవికి వెళ్లారు. ఆ రాక్షసులు, వారు గాడిద రూపములో అక్కడ నివసిస్తున్నారు, వెంటనే వారు తమ వెనుక కాళ్లతో కృష్ణుడిని మరియు బలరాముడిని తన్నటానికి వచ్చారు. వెంటనే బలరాముడు వారిలో ఒకరిని పట్టుకొని చెట్ల పైభాగంలోకి విసిరివేసారు. రాక్షసులు చనిపోయారు.

కాబట్టి స్నేహితులు కూడా కృష్ణుడికి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు. అంతా చుట్టూ అగ్ని ఉంది. వారికి ఏమి తెలియదు. కృష్ణా. "అవును." కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు వెంటనే మొత్తం అగ్నిని మింగేశాడు. చాలా మంది రాక్షసులు దాడి చేశారు. ప్రతిరోజూ, గోప బాలురు అందరూ, వారు వారి ఇంటికి వచ్చి వారి తల్లికి వివరించేవారు: అమ్మా , కృష్ణుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. మీరు చూడండి. ఈ రోజు ఇది జరిగింది. తల్లి చెప్పేది: "అవును మన కృష్ణుడు అద్భుతం." చాలా అద్భుతము. అంతే. కృష్ణుడు భగవంతుడు అని వారికి తెలియదు, కృష్ణుడు దేవాదిదేవుడు. కృష్ణుడు అద్భుతం. అంతే. వారి ప్రేమ పెరుగుతుంది. ఎంతగా కృష్ణుడి అద్భుతమైన కార్యక్రమాలను గ్రహిస్తున్నారో, మరింత ప్రేమికులుగా మారుతున్నారు. బహుశా ఆయన ఒక దేవత అయివుండవచ్చు. అవును. అది వారి సలహా. నంద మహారాజు తన స్నేహితుల మధ్యలో మాట్లాడినప్పుడు, స్నేహితులు కృష్ణుడి గురించి మాట్లాడతారు... ఓ, నంద మహా రాజా, మీ పిల్లవాడు కృష్ణుడు అద్భుతం. అవును, నేను చూస్తున్నాను. బహుశా ఎవరైనా దేవత అవ్వవచ్చు అంతే. "అనుకుంటా." అది కూడా ఖచ్చితము కాదు. (నవ్వు) అందుచేత వృందావనములోని నివాసులు, భగవంతుడు అంటే ఎవరో, ఎవరు భగవంతుడు కాదో అని వారు పట్టించుకోరు. అది వారి కర్తవ్యము కాదు. కానీ వారికి కృష్ణుడు కావాలి మరియు కృష్ణుడిని ప్రేమించాలి. అంతే