TE/Prabhupada 0360 - మనము నేరుగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళము. కృష్ణుడి సేవకుడికి మనము మన సేవను ప్రారంభించాలి

Revision as of 19:16, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.42 -- Mayapur, March 22, 1976


ఇక్కడ, ko nu atra te akhila-guro bhagavan prayāsa. ప్రతిఒక్కరికీ అదనపు ప్రయోజనము కావాలి మనల్ని అనుగ్రహించడానికి, కానీ కృష్ణుడికి అవసరం లేదు. ఆది కృష్ణుడు. అయిన ఇష్టపడిన దానిని ఏదైనా చేయగలడు. ఇతరులపై ఆధారపడడు. ఇతరులు కృష్ణుడి అనుమతి పై ఆధారపడినప్పటికీ, కృష్ణుడికి ఎవరు అనుమతి అవసరం లేదు. అందువలన ప్రహ్లాదుడు మహారాజు చెప్పాడు. bhagavan prayāsa. Prayāsa, ప్రత్యేకంగా భక్తులు తీసుకోకూడదని సూచించారు. చాలా కష్టమయిన కొన్ని పనులను తీసుకోకూడదు. వద్దు మనకు సాధ్యమయ్యే సాధారణ విషయాలను మనము తీసుకోవాలి. అయితే, ఒక భక్తుడు ప్రమాదం తీసుకుంటాడు. హనుమాన్ లాగానే. అయిన భగవంతుడు రామచంద్రుని యొక్క సేవకుడు. అయితే భగవంతుడు రామచంద్రునికి సీతాదేవి సమాచారం కావాలి. అయితే అయిన పరిగణించలేదు, "నేను సముద్రం యొక్క అవతలి వైపుకు ఎలా వెళ్ళాలి, లoకకు?" అయిన కేవలం భగవంతుడు రామచంద్రుని నందు విశ్వాసము ఉంచి, "జయ రామ" అని సముద్రము పైన ఎగిరినాడు. రామచంద్రుడు వంతెనను నిర్మించవలసి వచ్చినది . వాస్తవానికి, ఆ వంతెన కూడా అద్భుతమైనది ఎందుకంటే ఈ కోతులు రాళ్ళను తెచ్చాయి, అవి సముద్రంలోకి విసిరివేసాయి, కాని రాళ్లు తేలుతూ ఉన్నాయి. మీ గురుత్వాకర్షణ చట్టం ఎక్కడ ఉంది? రాళ్లు నీటిలో తేలుతున్నాయి. ఇది శాస్త్రవేత్తలు చేయలేరు. కానీ భగవంతుడు రామచంద్రుడు కోరుకున్నాడు; ప్రతి రాయి తేలినది. లేకపోతే అది ఒక వంతెన అయ్యే స్థాయికి రావడానికి సముద్రంలో మనం ఎన్ని రాళ్ళు విసరాలి? , అది సాధ్యం కాదు. ఇది సాధ్యం, ప్రతిదీ సాధ్యమవ్వుతుంది, కానీ రామచంద్రుడు, భగవంతుడు రామచంద్రుడు, కోరారు, "ఇది సరళీకృతం అవ్వవలెను. వారు రాయిని తీసుకొని వస్తే అది తేలుతుంది. అప్పుడు మనము వెళ్తాము. " రాళ్లు లేకుండా అయిన వెళ్ళగలడు, కానీ అయిన కోతులకు కొoత సేవ ఇవ్వాలానుకున్నాడు. అనేక కోతులు ఉన్నాయి.Baro baro badare, baro baro peṭ, laṅka diṅgake, mata kare het. అనేక ఇతర కోతులు ఉన్నాయి, కానీ హనుమాన్కు ఉన్నా సామర్థ్యం వాటికీ లేదు. అందువల్ల వాటికీ కొoత అవకాశాము ఇచ్చారు "మీరు కొన్ని రాళ్ళను తీసుకు రండి. మీరు హనుమాన్ వలె సముద్రంపై ఎగర లేరు, మీరు రాయి తీసుకుని రండి, నేను రాళ్ళను అడుగుతాను తేలమని. "

కృష్ణుడు ఏదైనా చేయగలడు. Aṅgāni yasya sakalendriya-vṛttimanti. అయిన ఏమైన చేయగలడు. మనము అయిన దయ లేకుండా చేయలేము. ప్రహ్లాద మహారాజు ఇలా అడుగుతున్నాడు: "మీరు మా మీద దయతో కరుణ చూపెట్ట గలగితే, ఇది మీకు ఒక గొప్ప పని కాదు, ఎందుకంటే మీకు నచ్చినది ఏదైనా మీరు చేయవచ్చు. మీరు ప్రపంచము యొక్క సృష్టికి, నిర్వహణకు విధ్వంసము యొక్క కారణం కనుక, అది మీకు కష్టం కాదు. " అంతేకాక, mūḍheṣu vai mahad-anugraha ārta-bandho. సాధారణంగా, ఎవరైతే ārta-bandhu, బాధలు పడుతున్న మానవుల యొక్క స్నేహితుడో, వారు ప్రత్యేకంగా మూర్ఖులకు, జులాయిలకు అనుగ్రహము చూపుతారు. కృష్ణుడు ఈ ఉద్దేశ్యంతో వస్తున్నాడు ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు ముర్ఖులు. Duṣkṛtino. Na māṁ duṣkṭtino mūḍhāḥ prapadyante. సాధారణంగా మనము, మనము పాపం చేస్తాము కనుక , మనము ముర్ఖులము కనుక మనము కృష్ణుడికి శరణాగతి పొందము. Na māṁ prapadyante. కృష్ణుడికి శరణాగతి పొందని వారిని, అయినను duṣkṛtina, mūḍha, narādhamā, māyayāpahṛta-jñānā వర్గీకరించారు. కృష్ణుడి యొక్క సంకల్పం నుండి స్వతంత్రం పొందడం సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. అందుచేత కృష్ణుడి అనుగ్రహము లేకుండా, స్వతంత్రంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్న వారు, వారు అందరు ముర్ఖులు. వారు కృష్ణుడు చెప్పినది ఏది అంగీకరించరు, వారు కృష్ణుడు లేకుండా కొన్ని చట్టాలను స్థాపించటానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు అవసరం లేదు. ఇది చాలామంది శాస్త్రవేత్తలు, వారు ఇలా అంటారు. ఇప్పుడు మనకు శాస్త్రము ఉన్నాది. మనము ప్రతిదీ చేయవచ్చు. వారు మూర్ఖులు. ఇది సాధ్యం కాదు. స్వతంత్రంగా మీరు కృష్ణుడి అనుగ్రహము లేకుండా ఏమి చేయలేరు.

కృష్ణుడి అనుగ్రహమును ఎల్లప్పుడూ కోరుకోవటము ఉత్తమమైనది. మీరు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని నేరుగా పొందలేరు. ఆది మరొక విషయము. Kiṁ tena te priya-janān anusevatāṁ naḥ. మీరు అయిన భక్తుడి అనుగ్రహము లేకుండా కృష్ణుడి దగ్గరకు వెళ్ళలేరు. Yasya prasādād bhagavat-prasādaḥ.. భగవoతుని యొక్క అనుగ్రహమును నేరుగా మీరు పొందలేరు. అది మరొక మూర్ఖత్వం. మీరు కృష్ణుడి సేవకుని ద్వారా వెళ్ళాలి. Gopī-bhartur pada-kamalayor dāsa-dāsa-dāsānudāsaḥ. ఇది మన పద్ధతి. మనము నేరుగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళము. కృష్ణుడి సేవకుడికి మనము మన సేవను ప్రారంభించాలి. కృష్ణుడి సేవకుడు ఎవరు? మరొక కృష్ణుడి సేవకునికి సేవకుడు అయిన వ్యక్తి. ఇది dāsa-dāsānudāsa అని పిలువబడుతుంది. ఎవరూ కృష్ణుడికి స్వతంత్రంగా సేవకుడు కాలేడు. ఇది మరొక మూర్ఖత్వం. కృష్ణుడు ఎవరి సేవను నేరుగా అంగీకరించడు. లేదు. అది సాధ్యం కాదు. మీరు సేవకుని సేవకుడి ద్వారా రావాలి ( CC Madhya 13.80 ) . దీనిని పరంపర పద్ధతి అని పిలుస్తారు. మీరు పరంపర పద్ధతి ద్వారా జ్ఞానాన్ని అందుకుంటున్నప్పుడు ... కృష్ణుడు బ్రహ్మాకు చెప్పారు, బ్రహ్మా నారదునికి చెప్పారు, నారదుడు వ్యాసదేవునికి చెప్పారు మనము ఈ జ్ఞానాన్ని పొందుతున్నాము. కృష్ణుడిలాగే ... భగవద్గీత కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు.

మనము అవగాహన పద్ధతిని వదిలేస్తే, అర్జునుడి లాగా అప్పుడు మీరు కృష్ణుడు, లేదా దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. అది సాధ్యం కాదు. అర్జునుడు అంగీకరించిన పద్ధతిని మీరు తీసుకోవాలి. అర్జునుడు కూడా ఇలా అన్నాడు, "నేను మిమల్ని అంగీకరించాను, భగవంతునిగా దేవాది దేవుడిగా, వ్యాసదేవుడు అంగీకరించాడు, ఆసీత అంగీకరించాడు, నారదుడు అంగీకరించాడు " అదే విషయము. మనము కృష్ణుణ్ని అర్థం చేసుకోవాలి. మనము నేరుగా అర్థం చేసుకోలేము. అందువల్ల కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి నేరుగా వ్యాఖ్యానం ద్వార ప్రయత్నించే వారు, వారు అందరు ముర్ఖులు. వారు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. చాలా గొప్ప మనిషి అని పిలవబడే వారు కావచ్చు, . ఎవరూ గొప్ప వ్యక్తి కాదు. వారు కూడా sa vai... Śva-viḍ-varāhoṣṭra-kharaiḥ saṁstutaḥ puruṣaḥ paśuḥ ( SB 2.3.19) Puruṣaḥ paśuḥ. ఈ గొప్ప, గొప్ప వ్యక్తులు , కొoదరు మూర్ఖులచే ఎంతగానో కీర్తించ బడే వారు, ఈ గొప్ప, గొప్ప నాయకులు, వారు ఏవరు? వారు కృష్ణుడి భక్తులు కాకపోవటము వలన, వారు నాయకత్వము వహించ లేరు. వారు కేవలం మోసము చేస్తారు. అందువలన మనము వారిని అoదరిని ముర్ఖులు అంటాము. ఈ ప్రమాణము. ఈ ఒక ప్రమాణాన్ని తీసుకోండి. మీరు ఎవరి దగ్గర నుండి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే, మొదట అతడు కృష్ణుడి భక్తుడా కాదా అని మీరు చూడండి. లేకపోతే ఏ పాఠం తీసుకోకండి. మనము ఒక వ్యక్తి నుండి ఏదైనా పాఠాన్ని తీసుకోము, "బహుశా," "అయివుండవచ్చు," ఇలాంటిది. కాదు మనకు అటువంటి శాస్త్రవేత్త లేదా గణిత శాస్త్రజ్ఞుడు అవసరము లేదు. వద్దు కృష్ణుడి భక్తుడైన వాడు, కృష్ణుడు తెలిసిన వాడు, కేవలము కృష్ణ అని వినటం ద్వారా పారవశ్యంతో మునిగిపోయిన వాడు, వారి నుండి పాఠం నేర్చుకోండి. లేకపోతే అoదరు దుష్టులు. ధన్యవాదాలు.