TE/Prabhupada 0626 - మీరు వాస్తవంగా విషయాలు నేర్చుకోవాలనుకుంటే, అప్పుడు మీరు ఆచార్యులును సంప్రదించాలి
Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972
కాబట్టి శ్రవణ పద్ధతి చాలా ముఖ్యం. కాబట్టి మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం దానిని ప్రచారం చేస్తూ ఉంది ప్రామాణికుల నుండి, కృష్ణుని నుండి మీరు వినండి. కృష్ణుడు దేవాదిదేవుడు. ఇది ప్రస్తుత యుగంలో మరియు గత యుగంలో ఆమోదించబడింది. గత యుగంలో, గొప్ప ఋషులు నారద, వ్యాస, అసిత, దేవల, చాలా, చాలా గొప్ప ప్రముఖ విద్వాంసులు మరియు ఋషులు, వారు అంగీకరించారు. మధ్య యుగంలో, దాదాపు 1,500 సంవత్సరాల క్రితము, అందరు ఆచార్యులు ఉదాహరణకు శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క... ఆచరణాత్మకంగా, భారతీయ వేదముల నాగరికత, ఇప్పటికీ ఈ ఆచార్యుల యొక్క ప్రామాణికం మీద ఉంది. అది భగవద్గీతలో ఆచార్యోపాసణం అని సిఫార్సు చేయబడింది. మీరు వాస్తవంగా విషయాలు నేర్చుకోవాలనుకుంటే, అప్పుడు మీరు ఆచార్యులును సంప్రదించాలి. ఆచార్యవాన్ పురుషో వేద, "ఆచార్యులును స్వీకరించినవాడు, ఆయనకు విషయములు యథాతథముగా తెలుస్తాయి." ఆచార్యవాన్ పురుషో వేద. అందువల్ల ఆచార్యుల నుండి మనకు జ్ఞానం వస్తుంది. కృష్ణుడు అర్జునునితో చెప్పాడు, అర్జునుడు వ్యాసదేవుడు తో చెప్పాడు. అర్జునుడు వాస్తవానికి వ్యాసదేవునితో మాట్లాడలేదు, కానీ వ్యాసదేవుడు అది విన్నాడు, కృష్ణుడు చెప్పుతున్నప్పుడు, తన మహాభారత పుస్తకంలో రచించినారు. ఈ భగవద్గీత మహాభారతంలో ఉంది. కావున మనం వ్యాసుని ప్రామాణితను అంగీకరిస్తాము. వ్యాసుని నుండి, మధ్వాచార్య; మధ్వాచార్య నుండి, చాలా గురు శిష్య పరంపర ద్వార, మాధవేంద్ర పురీ వరకు. తరువాత మాధవేంద్ర పురీ నుండి ఈశ్వర పురీకి, ఈశ్వర పురీ నుండి భగవంతుడు చైతన్య మహా ప్రభువుకు; భగవంతుడు చైతన్య మహా ప్రభువు నుండి ఆరుగురు గోస్వాములకు; ఆరు గోస్వాముల నుండి కృష్ణదాస కవిరాజాకు; ఆయన నుండి, శ్రీనివాస ఆచార్యునికి ; ఆయన నుండి, విశ్వనాథ చక్రవర్తికి; ఆయన నుండి, జగన్నాథా బాబాజీకి; తర్వాత గౌరా కిశోరా దాస బాబాజీకి; భక్తివినోద ఠాకురాకి; నా ఆధ్యాత్మిక గురువుకి. అదే విషయం, మనము ప్రచారము చేస్తున్నాము. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. ఇది కొత్తది ఏమి కాదు. ఇది వాస్తవ వక్త అయిన కృష్ణుని నుండి వస్తున్నది, గురు శిష్య పరంపర ద్వార. మనం ఈ భగవద్గీతను చదువుతున్నాము. నేను కొన్ని పుస్తకాలను తయారు చేశాను నేను ప్రచారము చేస్తూన్నాను అని కాదు. కాదు. నేను భగవద్గీతను బోధిస్తున్నాను. అదే భగవద్గీత మొదటిసారి నలభై లక్షల సంవత్సరాల క్రితం సూర్య-దేవుడికి చెప్పినది తిరిగి ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి తిరిగి చెప్పబడినది. అదే విషయం గురు శిష్య పరంపర ద్వారా మన వరకు వస్తుంది, అదే విషయం మీ ముందు ఉంచబడినది. అందులో ఏ మార్పు లేదు.
కాబట్టి ప్రామాణికులు చెప్తున్నారు,
- dehino 'smin yathā dehe
- kaumāraṁ yauvanaṁ jarā
- tathā dehāntara-prāptir
- dhīras tatra na muhyati
- (BG 2.13)
కాబట్టి మేము ఈ ప్రామాణిక జ్ఞానాన్ని అంగీకరించమని జనులను అభ్యర్థిస్తున్నాము, మరియు మీ బుద్ధి ద్వారా అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ వాదనను, బుద్ధిని ఆపడానికి కాదు, కేవలం గుడ్డిగా దేనినైన అంగీకరించడానికి. కాదు. మనం మనుష్యులము, మనము బుద్ధి కలిగి వున్నాము. మనం దేనినైన బలవంతముగా అంగీకరించడానికి జంతువులము కాదు. కాదు Tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) ఈ భగవద్గీతలో మీరు చూస్తారు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, తద్విద్ధి. విద్ధి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అర్థం. ప్రణిపాత. ప్రణిపాతేన అంటే శరణాగతి, సవాలు కాదు. ఒక విద్యార్థి ఆధ్యాత్మిక గురువుకు చాలా విధేయత కలిగి ఉండాలి. లేకపోతే, అతనికి, నేను చెప్పేది, ఏమి అర్థం కాదు. తికమకగా ఉంటుంది. వినయంతో శ్రవణము చేయాలి. మనపద్ధతి...
- tasmād guruṁ prapadyeta
- jijñāsuḥ śreya uttamam
- śābde pare ca niṣṇātaṁ
- brahmaṇy upaśamāśrayam
- (SB 11.3.21)
ఇది వేదముల ఆజ్ఞ. మీరు మీ ఇంద్రియాలకు అతీతమైన విషయాలు తెలుసుకోవాలంటే, మీ ఇంద్రియ అవగాహనకు అతీతముగా ఉన్నవాటిని, అప్పుడు మీరు ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళాలి