TE/Prabhupada 0525 - ఎందుకంటే మాయ చాలా బలంగా ఉంది, మీరు కొంచెం నమ్మకంగా ఉంటే, వెంటనే దాడి జరుగుతోంది
Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968
తమాల కృష్ణ: ప్రభుపాద, నేను కొన్నిసార్లు మీకు సేవ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఈ సేవ ఎంత చెడ్డగా అసంపూర్ణంగా చేస్తున్నానో అని నేను భావిస్తున్నప్పుడు, నాకు భయంకరంగా అనిపిస్తుంది. ఏ విధముగా అనుభూతి చెందడము మంచిది?
ప్రభుపాద: (నవ్వు) మీకు భయంకరంగా అనిపిస్తుందా?
తమాలకృష్ణ: అవును.
ప్రభుపాద: ఎందుకు? నీకు భయంకరంగా ఎప్పుడు అనిపిస్తుంది?
తమాలకృష్ణ: నేను చేసిన పొరపాట్లను చూసినప్పుడు, అన్ని పొరపాట్లు చేస్తుంటాను.
ప్రభుపాద: కొన్నిసార్లు... ఇది బాగుంది. పొరపాట్లను అంగీకరించటం.... ఏ తప్పు లేకపోయినప్పటికీ. ఇది నిజాయితీ సేవ యొక్క లక్షణం. తండ్రి తన కుమారునికి చాలా ప్రియమయినట్లుగా, లేదా కుమారుడు తండ్రికి చాలా ప్రియమైన వాడు. కుమారునికి చిన్న జబ్బులు ఉంటే, తండ్రి ఆలోచిస్తున్నాడు, నా కుమారుడు చనిపోవచ్చు. నేను వేరు అవ్వచ్చు. ఇది తీవ్రమైన ప్రేమ యొక్క చిహ్నం. అన్ని సార్లు కుమారుడు వెంటనే చనిపోతున్నట్లు కాదు, మీరు చూడండి, కానీ ఆయన అలా ఆలోచిస్తున్నాడు. వేరు అవ్వటము. మీరు చూడండి? కాబట్టి ఇది మంచి సంకేతం. మనం చాలా చక్కగా చేస్తున్నామని మనం అనుకోకూడదు. మనము ఎల్లప్పుడూ "నేను చేయలేకపోతున్నాను" అని అనుకోవాలి. ఇది చెడ్డది కాదు. మనము ఎప్పుడూ "నేను పరిపూర్ణుడను" అని ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే మాయ చాలా బలంగా ఉంది, మీరు కొంచెం నమ్మకంగా ఉంటే, వెంటనే దాడి జరుగుతోంది. మీరు చూడండి? వ్యాధి పరిస్థితిలో..... ఉదాహరణకు చాలా జాగ్రత్తలు తీసుకునే పద్ధతి ఉన్న వ్యక్తి వలె, పునఃస్థితి తక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది చెడు కాదు. మనము ఎల్లప్పుడూ ఇలా అనుకోవాలి, "బహుశా నేను చక్కగా పని చేయడం లేదు". కానీ అది మన శక్తి లో ఉన్నంత వరకు, మన కర్తవ్యాన్ని చక్కగా అమలు చేద్దాం, కానీ అది చాలా పరిపూర్ణము అని మనము ఎప్పుడూ ఆలోచించ కూడదు. చాలా బాగుంది