TE/Prabhupada 1046 - కృష్ణుడితో నృత్యం చేయడము ఆడుకోవటము చేయగల ఒక శరీరాన్ని పొందాలా లేదా నిర్ణయించుకోండి

Revision as of 08:22, 25 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1046 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


కృష్ణుడితో కలసి నృత్యం చేయడము మాట్లాడడము ఆడుకోవటము చేయగల ఒక శరీరాన్ని పొందాలా లేదా నిర్ణయించుకోండి నితాయ్: "అజామిళుడు తన కుమారుడి మీద ప్రేమతో ఉన్న జీవితాన్ని గడుపుతుండగా, ఆయనకు మరణ సమయము వచ్చినది. ఆ సమయంలో ఆయన ఏ ఇతర ఆలోచన లేకుండా తన కుమారుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు."

ప్రభుపాద:

sa evaṁ vartamāno 'jño
mṛtyu-kāla upasthite
matiṁ cakāra tanaye
bāle nārāyaṇāhvaye
( SB 6.1.27)

కావున వర్తమానా. ప్రతి ఒక్కరూ ఒక రకమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది భౌతిక జీవితం. నేను నిర్దిష్ట చైతన్యములోనే ఉన్నాను, మీరు నిర్దిష్ట చైతన్యములో ఉన్నారు- ప్రతి ఒక్కరు ప్రకృతి యొక్క విధానాల ప్రకారం, మనము జీవితములో భిన్నమైన భావన మరియు చైతన్యమును కలిగి ఉన్నాము దీనిని భౌతిక జీవితం అని పిలుస్తారు. మనము అందరము, మనము ఇక్కడ కూర్చుని ఉన్నాము, మనము ప్రతి ఒక్కరము భిన్నమైన చైతన్యమును కలిగి ఉన్నాము. సాధారణంగా, అది ఇంద్రియ తృప్తి కోసం ఉద్దేశించబడింది. భౌతిక జీవితము అంటే ప్రతి ఒక్కరూ ప్రణాళిక చేస్తున్నారని అర్థం, "ఈ విధముగా నేను జీవిస్తాను. ఈ విధముగా నేను డబ్బు సంపాదిస్తాను. నేను ఈ విధముగా ఆనందిస్తాను. "ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమము ఉన్నది.

కాబట్టి అజామిళుడు కూడా ఒక కార్యక్రమాన్ని కలిగి ఉన్నారు. తన కార్యక్రమము ఏమిటి? ఆయన కార్యక్రమం, ఆయన తన చిన్న పిల్లవాని మీద చాలా అనుబంధం కలిగి ఉన్నందున, మొత్తం శ్రద్ధ వాని మీద ఉంది, ఎలా పిల్లవాడు కదులుతున్నాడు, పిల్లవాడు ఎలా తింటున్నాడు, పిల్లవాడు ఎలా మాట్లాడుతున్నాడు, కొన్నిసార్లు ఆయన పిలుస్తున్నాడు ఆయన తినిపిస్తున్నాడు కాబట్టి ఆయన మొత్తం మనస్సు పిల్లవాడు యొక్క కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నది మునుపటి శ్లోకములో మనము ఇప్పటికే చర్చించాము:

bhuñjānaḥ prapiban khādan
bālakaṁ sneha-yantritaḥ
bhojayan pāyayan mūḍho
na vedāgatam antakam
( SB 6.1.26)

అజామిళుడు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు, వారు ఒక రకమైన చైతన్యములో నిమగ్నమై ఉన్నారు. దానికి కారణం ఏమిటి? ఎలా చైతన్యము అభివృద్ధి చెందుతుంది? ఇది చెప్పబడింది, sneha-yantritaḥ. స్నేహ అంటే ప్రేమ ద్వారా... ఆప్యాయత అనే యంత్రం ద్వారా ప్రభావితము అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యంత్రం ద్వారా ప్రభావితమవుతున్నారు. ఈ యంత్రం... ఈ శరీరం ఒక యంత్రం. స్వభావం ద్వారా అది పని చేస్తున్నది. భగవంతుని నుండి దర్శకత్వం వస్తోంది. మనము ఒక రకముగా ఆస్వాదించాలనుకుంటాము, కృష్ణుడు మనకు ఒక నిర్దిష్టమైన శరీరాన్ని ఇచ్చాడు. యంత్రము ఉదాహరణకు మీరు వివిధ రకముల మోటారు కార్లను కలిగి ఉన్నారు. మీకు కావాలి... కొందరు కోరుకుంటున్నారు, "నాకు బ్యూక్ కారు కావాలి". కొందరు అడుగుతారు, "నాకు చేవ్రొలెట్ కావాలి," కొందరు, "ఫోర్డ్." అవి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధముగా, మన శరీరం కూడా ఆ విధముగా ఉన్నది కొంత మందికి ఫోర్డ్, కొంత మందికి చెవ్రోలెట్, కొంత మందికి బ్యూక్, కృష్ణుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఈ రకమైన కారును, లేదా శరీరాన్ని మీరు కోరుకున్నారు. మీరు కూర్చొని ఆనందించండి. ఇది మన భౌతిక స్థితి.

Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe arjuna tiṣṭhati ( BG 18.61) మనము మర్చిపోతాము. శరీరాన్ని మార్చిన తర్వాత, నేను కోరుకున్న దానిని మరచిపోతున్నాను, నేను ఈ రకమైన శరీరాన్ని ఎందుకు కలిగి వున్నాను. కానీ కృష్ణుడు, ఆయన మీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన మరచిపోడు. ఆయన మీకు ఇస్తాడు. Ye yathā māṁ prapadyante ( BG 4.11) మీరు ఈ రకమైన శరీరాన్ని కోరుకున్నారు: మీరు దాన్ని పొందుతారు. కృష్ణుడు చాలా దయతో ఉంటాడు. ఎవరైనా ప్రతిదీ తినగలిగే శరీరాన్ని కోరుకుంటే, అందువల్ల కృష్ణుడు పంది యొక్క శరీరాన్ని ఇస్తాడు, కావున అది మలం కూడా తినగలదు. "నేను కృష్ణుడితో నృత్యం చేస్తాను" అని ఎవరైనా ఆ రకమైన శరీరాన్ని కోరుకుంటే, అప్పుడు ఆయన ఆ శరీరాన్ని పొందుతాడు. ఇప్పుడు, మీరు ఏ శరీరాన్ని పొందబోతున్నారో నిర్ణయించుకోవాలి అది కృష్ణుడితో నృత్యము చేయగలగేది, కృష్ణుడితో మాట్లాడగలిగేది, కృష్ణుడితో కలిసి ఆడగలిగేది. మీరు దాన్ని పొందవచ్చు. మీరు ఎలా మలం మరియు మూత్రం తినాలి అనే శరీరమును కోరుకుంటే, మీరు దానిని పొందుతారు