TE/Prabhupada 1057 - భగవత్-గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని

Revision as of 17:29, 2 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1057 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

భగవత్-గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని. ప్రభుపాద: అజ్ఞానాంధకారంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరచిన నా ఆధ్యాత్మిక గురువునకు నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను చైతన్య మహా ప్రభు యొక్క కోరికను ఈ భౌతిక జగత్తునందు స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాద తన పాదాపద్మముల చెంత నాకు ఆశ్రయం ఎప్పుడు ఇస్తాడు? నేను నా ఆధ్యాత్మిక గురువుగారి పాదాలకు, భక్తి మార్గంలో ఉన్న అందరి పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను సమస్త వైష్ణవులకు, ఆరుగరు గోస్వాములయిన శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి జీవ గోస్వామి, మరియు వారి సహచరులకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను శ్రీ అద్వైత ఆచార్య ప్రభునకు, శ్రీ నిత్యానంద ప్రభునకు, శ్రీ చైతన్య మహా ప్రభునకు మరియు శ్రీనివాస్ ఠాకూర్ నేతృత్వంలోని అతని భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పుడు నేను శ్రీ క్రి ష్ణుని పాదపద్మములకు, శ్రీమతి రాధారాణికి లలిత మరియు విశాఖ నేత్రుత్వంలోని గోపికలందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఓ ప్రియమయిన శ్రీ క్రీష్ణ, కరుణా సాగరా, నీవే ఆపదల్లో ఉన్నవారి స్నేహితుడవు మరియు ఈ సృష్టికి మూలం. సమస్త గోపగణానికి ప్రభువు నీవు, సమస్త గోపికలకు ముఖ్యంగా శ్రీమతి రాధారాణికి ప్రాణప్రదం నీవు. నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. కరిగించిన బంగారపు శరీర ఛాయతో, బృందావనానికి రాణి అయిన శ్రీమతి రాధారాణికి, నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నీవు వృషభాను యొక్క కూతురవు మరియు శ్రీ కృష్ణునికి ఎంతో ప్రీతికరం. నేను భగవంతుని వైష్ణవ భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. కల్ప వృక్షములలాగా వారు అందరి కోరికలను తీర్చగలరు. వారు పతీత జీవాత్మల పట్ల అత్యంత దయ కలిగి ఉంటారు. నేను శ్రీ కృష్ణ చైతణ్య మహాప్రభువుకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వయిత, గదాధర, శ్రీవాస్. మొదలగు చైతణ్య మహా ప్రభువు భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నా ప్రియమైన ప్రభువా, మరియు ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తీ, దయచేసి నన్ను మీ సేవలో నన్ను నియమించండి. నేను ఈ భౌతిక సేవతో విసిగిపోయాను. దయచేసి మీ సేవలో నన్ను నియమించండి. గీతోపనిషత్తుకు పరిచయము, ఎ సి భక్తివేదాంత స్వామి ద్వారా, శ్రీమద్-భాగవతము, ఇతర గ్రహాలకు సులభ మార్గం వంటి గ్రంథముల రచయిత భగవద్దర్శన్ యొక్క సంపాదకుడు, మొదలగునవి చేసినవారు. భగవత్-గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని, మరియు వివిధ వేద గ్రంథములలోని ఉపనిషత్తులన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ భగవద్-గీతకు ఆంగ్లములో చాలా వ్యాఖ్యానాలున్నాయి మరి భగవద్ గీత యొక్క మరొక ఆంగ్ల వ్యాఖ్యన అవసరం ఏమిటి అనే దాన్ని క్రింది విధంగా వివరించవచ్చు ఒక... ఒక అమేరికన్ మహిళ, శ్రీమతి. చార్లెట్ లీ బ్లంక్ నన్నుతను చదవగల ఒక ఆంగ్ల భగవద్-గీత అనువాదాన్ని సిఫార్సు చేయమని అడిగింది. నిస్సందేహంగా, అమేరికాలో భగవద్-గీతకు చాలా సంచికలు లభిస్తాయి కాని నేను చూసినంతవరకు, కేవలం అమేరికలో మాత్రమే కాక, భారతదేశంలో కూడా, వాటిలో ఏ ఒక్కటి ప్రామానికమైందిగా చెప్పలేము, ఎందుకంటే వారిలో దాదాపు అందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తంచేశరు భగవద్-గీతకు వ్యాఖ్యాన రూపంలో భగవద్-గీత యొక్క యథాతథమైన భావాన్ని ముట్టుకోకుండా. భగవద్-గీత యొక్క భావాన్ని భగవద్-గీతలోనే పేర్కొనబడింది. అది ఈ విధంగా చెప్పవచ్చు. మనం ఒక ఔషదాన్ని తీసుకోవాలనుకుంటే, మనం పాటించాల్సివుంటుంది దాని మీద పేర్కొన్న మార్గదర్శకాలను. మనం ఒక ఔషదాన్ని మన కోరిక మీద కాని లేదా స్నేహితుడి సలహా మీద కాని తీసుకోకూడదు, మనం కేవలం దాని మీద వ్రాసిన సూచనలను అనుసరించి మరియు వైద్యుని సలహాను అనుసరించి తీసుకోవాలి. అలాగే, భగవద్-గీతను కూడా వక్త ఇచ్చిన నిర్దేశాలను అనుసరించి యథాతథముగా తీసుకోవడం లేదా స్వీకరించడం చేయాలి..