TE/Prabhupada 0178 - కృష్ణుడు ఇచ్చిన ఆజ్ఞ ధర్మము

Revision as of 17:03, 19 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0178 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on SB 1.10.1 -- Mayapura, June 16, 1973

ధర్మా అంటే భగవంతుడు దేవాదిదేవుడు ద్వారా ఇవ్వబడింది. అది ధర్మము . మీరు ధర్మాన్ని తయారు చేయలేరు. ఈ రోజుల్లోనే చాలా ధర్మాలు తయారు చేయబడ్డయి. అవి ధర్మము కాదు. ధర్మాము అంటే భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ. అది ధర్మము . కృష్ణుడు చెప్పినట్లు sarva-dharman parityajya mam ekam saranam vraja (BG 18.66). మనము చాలా ధర్మాలను తయారు చేసాము: హిందూ ధర్మా, ముస్లిం ధర్మా, క్రిస్టియన్ ధర్మా, పార్సీ ధర్మా, బుద్ధ ధర్మా, ఈ ధర్మా, ఆ ధర్మా. ఇవి అన్ని ధర్మము కాదు. అవి మానసిక కల్పన, మానసిక కల్పన. లేకపోతే అవి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణ కోసం తీసుకోండి, హిందువులు ఆవుని చంపడం ఆధర్మమని భావిస్తారు, ముస్లింలు ఆవును చంపడం వారు ధర్మముగా భావిస్తారు. ఇది సరైనదా? ఆవును చంపడం ఆధర్మము లేదా ధర్మమా?

ఈ మానసిక కల్పనలు ఉన్నాయి. చైతన్య-చరితామ్రుత కరాకా చెప్పుతాడు, ei bhala ei manda saba manodharma, మానసికముగా కల్పితమైనది. వాస్తవ ధర్మా అనేది భగవంతుడు దేవాదిదేవుడు ద్వారా ఆదేశించబడుతుంది. అది ధర్మము . అందువల్ల కృష్ణుడు చెప్తాడు, sarva-dharman parityajya mam ekam saranam vraja: (BG 18.66) "మీరు తయారు చేసిన ధర్మాలన్ని వదిలివేయoడి. ఇక్కడ వాస్తవమైన ధర్మము ఉంది." Saranam vraja. "కేవలము నాకు ఆశ్రయము పొందండి, అది వాస్తవమైన ధర్మము ." Dharmam tu saksad bhagavat-pranitam (SB 6.3.19). చట్టం లాగానే. చట్టాలు తయారు చేయవచ్చు లేదా ప్రభుత్వము ఇవ్వవచ్చు. మీరు మీ ఇంటి వద్ద ఏటువంటి చట్టం చేయలేరు. ఇది చట్టం కాదు. చట్టం అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు. మహోన్నతమైన ప్రభుత్వం దేవాదిదేవుడు Aham sarvasya prabhavo mattah parataram nanyat (BG 10.8). కృష్ణుడి కంటే ఎవరూ ఎక్కువగా లేరు. అందువల్ల కృష్ణుడు ఇచ్చిన ఉత్తర్వు ధర్మము . మన ఈ కృష్ణ చైతన్యము ఉద్యమము ఆ ధర్మాము. కృష్ణ చెప్తాడు sarva-dharman parityajya mam ekam saranam vraja: (BG 18.66) "మీరు అన్ని ఇతరధర్మాలు అని పిలవబడే వాటిని వదిలేయండి, ఈ ధర్మా, ఆ ధర్మా, చాలా ధర్మాలను విడిచిపెట్టాoడి. కేవలము నాకు శరణాగతి పొందండి.

మనం అదే సూత్రాన్ని బోధిస్తున్నాం, ఇది చైతన్య మహాప్రభు, ద్వారా నిర్ధారించబడింది ... Amara ajnaya guru hana tara' ei desa, yare dekha tare kaha krsna-upadesa (CC Madhya 7.128). ఇది ధర్మము . చైతన్య మహాప్రభు ఏ ధర్మాని నూతన పద్ధతిని తయారు చేయలేదు. చేయలేదు చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు Namo maha-vadanyaya krsna-prema-pradaya te, krsnaya krsna-caitanya-namne (CC Madhya 19.53). వ్యత్యాసం ఏమిటంటే ... అయినే కృష్ణుడు. ఒకే వ్యత్యాసం ఏమిటంటే, కృష్ణుడు, దేవాదిదేవుడిగా, నేరుగా ఆదేసిస్తాడు "మీరు అర్ధం లేని వాటిని అన్నీటిని వదిలేయండి. కేవలం నాకు శరణాగతి పొందండి ఇది కృష్ణుడు. అయిన భగవంతుడు దేవాదిదేవుడు అయినందున, అయిన నేరుగా ఆజ్ఞ ఇస్తున్నాడు. అదే కృష్ణుడు, ప్రజలు అయినని తప్పుగా అర్థం చేసుకున్నారు కనుక... పెద్ద, పెద్ద విద్వాంసులు, వారు చెప్తారు, "ఇది చాలా విడ్డురముగా ఉన్నది. కృష్ణుడు ఇలా ఆజ్ఞ ఇవ్వటము కానీ వారు మూర్ఖులుగా ఉన్నారు. వారికి తెలియదు. వారికి కృష్ణుడు అంటే అర్థం తెలియదు. ప్రజలు అయినని తప్పుగా అర్ధం చేసుకొనుట వలన కృష్ణుడికి సంపూర్ణంగా ఎలా ఆశ్రయము పొందాలో ప్రచారము చేయడానికి కృష్ణ భక్తుడిగా కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వచ్చారు. కొన్నిసార్లు నా సేవకుడు నాకు మసాజ్ ఇస్తాడు. నేను తన తలకి మర్దన ఇవ్వడం ద్వారా, "ఈ విధముగా చేయండి." నేను అయిన సేవకుడిని కాదు, కానీ నేను ఆయనకు బోధిస్తున్నాను. అదేవిధంగా, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు, కానీ అయిన కృష్ణుడిని ఎలా చేరుకోవచ్చో ఖచ్చితంగా బోధిస్తున్నాడు, అదే సూత్రం. కృష్ణుడిని ఎలా సేవించాలి. "మీరు నాకు శరణాగతి పొందండి," అని కృష్ణుడు చెప్పారు, చైతన్య మహాప్రభు చెప్పుతాడు "మీరు కృష్ణుడికి ఆశ్రయము పొందండి." ఈ సూత్రం మీద ఎటువంటి మార్పు లేదు.