TE/Prabhupada 0180 - హరే కృష్ణ మంత్రము మలినాలను తొలిగిస్తుంది

Revision as of 05:28, 20 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0180 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.5.11 -- New Vrindaban, June 10, 1969

ప్రభుపాద: Vināpi pada-cāturyaṁ bhagavad-yaśaḥ-pradhānāṁ vacaḥ pavitram ity aha tad vāg pavitra iti. ఇది చాలా పవిత్రమైనది. ఏమి పిలుస్తారు? క్రిమి సంహారిణి. మొత్తం ప్రపంచం మాయాచే ప్రభావితమైనది ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, హరే కృష్ణ మంత్రం మలినాలను తీసివేస్తుంది. ఇది ఖచ్చితము , మలినాలను తీసివేస్తుంది Tad-vāg-visargo janatāgha-viplavaḥ. Bhagavad-yaśaḥ-pradhānāṁ vacaḥ pavitram ity aha tad vāg iti, sa cāsau vāg-visargo vacaḥ prayogaḥ. Janānāṁ samuho janatā, tasya aghaṁ viplavati naśayati. Viplava అంటే అది చంపుతుంది. ఎందుకంటే మలినాలను తీసివేస్తుంది. ఉదాహరణకు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఎలా మలినాలను తీసివేస్తుందో చెప్పవచ్చును దీనిని తీవ్రంగా తీసుకున్న వారు వెంటనే పాపములను ఆపేస్తారు, నాలుగు సూత్రాలు, నియంత్రణ సూత్రాలు, అక్రమ లైంగిక జీవితం, మత్తుమందులు, జూదం మాంసం తినడం. ఎలా మలినాలను తీసివేస్తుంది. ఈ నాలుగు సూత్రాలు పాపములను పెంచుతాయి. అన్ని ఇతర పాపములు ఒకదాని తరువాత మరొకటి వస్తాయి. దొంగిలించడం, తరువాత మోసం, తరువాత ... మనము ఈ నాలుగు సూత్రాలను అనుసరిస్తే చాలా ఇతర విషయాలు వస్తాయి. మనము ఈ నాలుగు సూత్రాలను ఆపివేస్తే, అది మిగత పాపములను అపివేస్తుంది మీరు తప్పక తెలుసుకోవాలి. అది ఎలా నిర్వహించబడుతుంది? ఈ మలిన నిర్మూలన పద్ధతి ద్వారా, హరే కృష్ణ మంత్రమును జపించుట ద్వార. లేకపోతే, అది కేవలం సైద్ధాంతిక జ్ఞానం ద్వారా మార్పు రాదు.

నిజానికి,మలినాలను నిర్ములన చేస్తుంది. Janatāgha-viplavaḥ. అది ఆ వ్యక్తి తరువాత చేయ బోవు పాపములను ఆపుతుంది. మనం కొనసాగినట్లయితే "హరే కృష్ణ మంత్రమును జపము చేస్తూ, నా దగ్గర ఒక మలిన నిర్మూలన పద్ధతి ఉంది. అందువల్ల నేను ఈ నాలుగు పాపములు చేయవచ్చు, నాకు పాపము లేదు క్రిస్టియన్ చర్చికి వెళ్లి, వారు ఒప్పుకొంటారు. పర్వాలేదు. ఒప్పుకోవడం అనేది మలినాల నిర్మూలన పద్ధతి కానీ మీరు మళ్ళీ ఎలా చేస్తారు? అర్థం ఏమిటి? మీరు చర్చికి వెళ్ళి, అంగీకరిస్తారు. ఇది మంచిది. ఇప్పుడు నీ పాపములు క్షమింoచబడ్డాయి. పర్వాలేదు. కానీ ఎందుకు మీరు మళ్లీ చేస్తున్నారు? జవాబు ఏమిటి? ఏ క్రిస్టియన్ పెద్దమనిషిని అడిగినట్లయితే, వచ్చే సమాధానం ఏమి ఉంటుoది: "మీరు పాపములు చేస్తున్నారు, అన్నిటికి, ప్రభువైన యేసుక్రీస్తు ముందు చర్చిలో ఒప్పుకుంటూన్నారు, దేవుని ప్రతినిధిగా, లేదా అయిన ప్రతినిధికి, లేదా దేవుడికి. మీ పాపములు అన్ని క్షమించబడ్డాయి. పర్వాలేదు. కానీ ఎందుకు మీరు మళ్లీ చేస్తున్నారు? " జవాబు ఏమిటి?

నారా-నారయన: వారు మళ్ళీ అంగీకరిస్తారు.

ప్రభుపాద: వారు మళ్ళీ అంగీకరిస్తారు. అది ఒక వ్యాపారముగా మారింది. ఆ "నేను చేస్తాను ..." ఇది ఆలోచన కాదు. మన, ఈ అపరాధముల జాబితా, అపరాధముల జాబితా, అది నిషేధిస్తుంది ... Nāmno balād yasya hi pāpa-buddhiḥ. ఇలా భావిస్తున్న ఎవరైనా, "నేను ఈ మలిన నిర్ములన పద్ధతిని కలిగి ఉన్నాను, నేను పాపములు చేస్తాను నేను హరే కృష్ణ మంత్రమును జపము చేస్తాను, అది క్షమించబడుతుంది, " అది గొప్ప పాపం.