TE/Prabhupada 0382 - దశావతారము స్తోత్రము యొక్క భాష్యము
Purport to Sri Dasavatara Stotra -- Los Angeles, February 18, 1970
తదుపరి మరగుజ్జు అవతారమైన వామన ఉంది. భగవంతుడు వామన బలి మహారాజు ముందు ఆవిర్బవించారు. ఇది మరొక మోసం. బలి మహారాజు విశ్వవ్యాప్త గ్రహలన్నింటినీ జయించారు, దేవతలు చాలా కలత చెందిన్నారు. వామన మహారాజు ... వామనదేవ బలి మహారాజు వద్దకు వెళ్ళాడు. నాకు కొంత దానము ఇవ్వoడి, నేను బ్రాహ్మణుడిని. నేను మీ నుండి వేడుకోవాలని వచ్చాను. " కావునా బలి మహారాజు ఇలా అన్నాడు," అవును నేను నీకు ఇస్తాను. " అతను మూడు అడుగుల భూమి మాత్రమే కోరుకున్నాడు. ఒక అడుగు ద్వారా మొత్తం విశ్వాన్ని ఆక్రమించాడు, పై భాగమును మరొక పాదంతో ఇతర సగాన్ని ఆక్రమించాడు. అప్పుడు మూడవ అడుగుకు బలి మహారాజు ఇలా అన్నాడు, "అవును, ఇప్పుడు స్థలము లేదు". దయచేసి మీ పాదాలను నా తలపై ఉంచండి. ఇప్పటికీ నా తల ఉంది. " అందువలన బలి మహారాజు త్యాగమునకు వామనదేవుడు చాలా ఆనందపడ్డాడు. అతను భగవంతుని కోసం ప్రతిదీ విడిచిపెట్టాడు. అందువలన అతడు గొప్ప ప్రామాణికులలో ఒకడు. పన్నెండు ప్రామాణికులలో బలి మహారాజు ఒకరు, ఎందుచేతనంటే అతడు భగవంతుని సంతృప్తిపరచటానికి ప్రతిదానిని త్యాగము చేసాడు.
తదుపరి పరశురామ. పరశురామ, ఇరవై ఒక్కసార్లు అతను ఊచకోత చేశాడు అందరి క్షత్రియ రాజులను చంపడం కోసం. ఆ సమయంలో క్షత్రియు రాజులు చాలా మోసగించే వారు, అందువలన అతను వారిని ఇరవై ఒక్క సార్లు చంపాడు. వారు ఎక్కడెక్కడికో పారిపోయారు. మహాభారత చరిత్ర నుండి ఇది అర్ధం అవుతుంది, ఆ సమయంలో కొందరు క్షత్రియులు పారిపోయి యూరోపియన్ వైపున ఆశ్రయం పొందారు. ఇండో-యూరోపియన్ భాగము ఆ క్షత్రియుల నుండి వచ్చినది . ఇది చరిత్ర, మహాభారతo నుండి చారిత్రక సమాచారం.
తరువాత అవతారం భగవంతుడు రామ అతను పది తలలు కలిగిన రావణునితో పోరాడాడు. ... తదుపరి అవతారం బలరామ. బలరామ కృష్ణుడి అన్నయ్య. అతను సంకర్షుణుని ఆవతారం, కృష్ణుడి యొక్క తదుపరి విస్తరణ. అందువలన అతను చాలా తెలుపు రంగులో ఉన్నాడు, అతను నీలిరంగు వస్త్రాలను ధరించాడు, అతను తన నాగలి తో, కొన్నిసార్లు యమున నదిపై కోపంగా ఉన్నాడు, అతను యమునా నదిని పొడిగ చేయడానికి ప్రయత్నించాడు. ఆ వివరణ ఇక్కడ ఇవ్వబడింది. యమున, అతనoటే భయం వలన, ఆమె బలరామ ప్రతిపాదనకు అంగీకరించింది. తరువాత అవతారం బుద్ధుడు . భగవంతుడు బుద్ధుడు, వేదముల సూత్రాలను అతను విమర్శించాడు. అందువలన అతను నాస్తికుడిగా లెక్కించబడుతాడు. వేద సూత్రములతో ఏకీభవించని ఎవరైనా నాస్తికుడుగా పరిగణింపబడతారు. బైబిల్లో బైబిల్ ను నమ్మని వ్యక్తిని హెతెంస్ అంటారు. అదేవిధంగా వేదముల సూత్రాలను అంగీకరించని వారిని నాస్తికులు అని పిలుస్తారు. కృష్ణుడి అవతారమైన బుద్ధుడు, అతను చెప్పాడు "నాకు వేదాలపై నమ్మకం లేదు." కారణం ఏమిటి? కారణం జంతువులను రక్షించడం.. ఆ సమయంలో ప్రజలు వేదబలి అనే కారణం కింద జంతువులను బలి చేసేవారు. రాక్షసులలాంటి వ్యక్తులు, వాటికి రక్షణ అనే పేరుతో , వాటిని ఏదో చేయాలని. ఒక గొప్ప న్యాయవాది న్యాయ పుస్తకము యొక్క రక్షణను తీసుకుంటాడు అతను చట్టమును చట్టవిరుద్ధం చేస్తాడు. అదేవిధంగా, రాక్షసులు చాలా తెలివైనవవారు, ఆధ్యాత్మిక ఉత్తర్వులను ఉపయోగించుకొని అన్నీ అర్ధం లేనివి చేస్తారు. ఈ విషయాలు జరుగుతున్నాయి. వేదముల యజ్ఞము యొక్క నెపంతో, జంతువులను ఇష్టము వచ్చినట్లు చంపుతున్నారు. భగవంతుడికి ఈ నిస్సహాయ జంతువులు మీద దయ కలిగింది అతను భగవంతుడు బుద్ధగా ఆవిర్భవించారు ఆయన తత్వము అహింస అతని తత్వము నాస్తికత్వము, ఎందుకంటే అతను "దేవుడు లేడు" అని అన్నాడు. భౌతికము విషయముల కలయిక వలన ఈ సృష్టి ఉన్నది, మీరు భౌతిక అంశములను విడగొడితే, అక్కడ శూన్యం ఉంటుంది ఆనందం, నొప్పి అనే భావనలు ఉండవు. అది నిర్వాణమ్, జీవిత అంతిమ లక్ష్యం. "ఇది అతని తత్వము. కాని నిజానికి తన లక్ష్యము జంతువులను చంపడము ఆపడము, చాలా పాపములను చేయకుండా వ్యక్తులను ఆపడానికి. అందువల్ల భగవంతుడు బుద్ధుడిని కూడా ఇక్కడ ప్రార్ధించారు. ప్రజలు ఆశ్చర్యపోతారు, బుద్ధ భగవానుడు నాస్తికుడిగా పిలువబడ్డారు, ఇప్పటికీ వైష్ణవులు, విష్ణువుకు(బుద్ధుడు) వారి గౌరవప్రదమైన ప్రార్ధనలు చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే వైష్ణవులకు, దేవుడు తమ వేర్వేరు ప్రార్ధనలకు ఎలా ప్రభావము చూపేడున్నారో వారికి తెలుసు. ఇతరులకు తెలియదు.
తదుపరి అవతారం కల్కి. ఇంకా జరగ వలసి ఉన్నది. ఈ , కలి యుగము చివరలో కల్కి అవతారం కనిపిస్తుంది. కలి యుగము కాలం, యొక్క వ్యవధి ఇప్పటికీ ఉంది, నా ఉద్దేశ్యం, 400,000 సంవత్సరాలలో నెరవేరుతుంది. కలి చివరిలో, చివరి దశలో అంటే, సుమారు 400,000 సంవత్సరాల తర్వాత, కల్కి అవతారం కనిపిస్తుంది. శ్రీమద్-భాగవతం లో భగవంతుడు బుద్ధుని రూపం కూడ ఊహించినందువల్ల వేదముల సాహిత్యములలో ఇది ఊహించబడింది. శ్రీమద్-భాగవతం ఐదు వేల సంవత్సరాల క్రితం సంకలనం చేయబడింది, భగవంతుడు బుద్ధ 2,500 సంవత్సరల క్రితం కనిపించారు. అందువల్ల భగవంతుడు బుద్ధుని ఆగమనమును గురించి ఇది అంచనా వేయబడింది కలి యుగము ప్రారంభంలో భగవంతుడు బుద్ధుడు కనిపిస్తాడు అని సూచన ఉంది, అది వాస్తవము అయినది అదేవిధంగా, కల్కి అవతారం గురించి అంచనా ఉంది, అది కూడ వాస్తవమైనది అవుతుంది. ఆ సమయంలో, భగవంతుడు కల్కి పని కేవలము చంపడం మత్రమే ఉంటుంది. సూచనలు ఇవ్వడము ఉండదు. భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు భగవద్గీత రూపంలో ఉపదేశమును ఇచ్చాడు. కానీ కలి యుగము ముగింపులో, ప్రజలు చాలా అధోగతి చెందుతారు ఏ ఆదేశం ఇవ్వాలన్నా అవకాశం ఉండదు వారు అర్థం కూడ చేసుకోలేరు. ఆ సమయంలో ఆయుధం మాత్రమే వారిని చంపడానికి ఉంటుంది. భగవంతుని చేత చంపబడినవాడు, అతడు రక్షణ పొందుతాడు. అది దేవుడు కనికరపు లక్షణము. అతను రక్షిoచినా లేదా అతను చంపేసినా ఫలితం ఒక్కటే. అది కలి యుగము యొక్క చివరి దశ, ఆ తరువాత మళ్ళీ, సత్య-యుగ, ధార్మిక యుగము, మొదలవుతుంది. ఇవి వేదముల సాహిత్యం యొక్క ప్రకటనలు.