TE/Prabhupada 0531 - వేదముల సాహిత్యములో అర్థం చేసుకోనవచ్చు, కృష్ణుడు అనేక రకాలైన శక్తులను కలిగి ఉన్నాడు

Revision as of 04:42, 10 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0531 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971


ఒక జీవి నామము sarva-gaḥ. sarva-gaḥ అంటే "అతడు ఇష్టపడే చోటుకు ఎక్కడికైనా వెళ్లవచ్చు." నారద ముని లా. నారద ముని ఎక్కడికైనా ఇష్టపడే చోటుకు ప్రయాణిస్తాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలోకైనా లేదా భౌతిక ప్రపంచంలోకైనా. కాబట్టి మీరు కూడా చేయవచ్చు. మనకు అవకాశం ఉంది. గొప్ప యోగి, దుర్వాస ముని ఉండేవాడు. ఒక సంవత్సరం లోపల ఆయన విశ్వమంతా ప్రయాణించాడు, మరియు విష్ణులోకంకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. ఇది చరిత్రలో నమోదు చేయబడింది. కాబట్టి ఇవి జీవిత పరిపూర్ణములు. ఎలా ఈ పరిపూర్ణము పొందవచ్చు? కృష్ణుడిని అర్థం చేసుకోవడం ద్వారా. Yasmin vijñāte sarvam eva vijñātaṁ bhavanti. ఉపనిషత్తులు చెప్తాయి, కేవలం కృష్ణుడిని మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు ఈ విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కృష్ణ చైతన్యము అటువంటి మంచి విషయం.

కాబట్టి ఈరోజు, ఈ సాయంత్రం, మనము రాధాష్టమి గురించి మాట్లాడుతున్నాం. కృష్ణుడి యొక్క ముఖ్య శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రాధారాణి అనేది కృష్ణుడి ఆనందశక్తి. వేదముల సాహిత్యం నుండి మనము అర్థం చేసుకోనవచ్చు, కృష్ణుడు అనేక రకాలైన శక్తులను కలిగి ఉన్నాడు. Parāsya śaktir vividhaiva śruyate ( CC Madhya 13.65 భాష్యము) అదే ఉదాహరణ లాగానే, ఒక గొప్ప వ్యక్తి అనేకమంది సహాయకులు కార్యదర్శులు కలిగివున్నట్లు, కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఏమీ చేయనవసరంలేదు, కేవలం తన సంకల్పం ద్వారా ప్రతిదీ జరుగుతుంది, అదేవిధముగా, దేవాదిదేవుడు అనేక రకాల శక్తులను కలిగివున్నారు, మరియు ప్రతిదీ చాలా చక్కగా జరుగుతోంది. ఈ భౌతిక శక్తి లాగే. ఈ భౌతిక ప్రపంచం, ఎక్కడ మనం ఇప్పుడు జీవిస్తున్నామో... ఇది భౌతిక శక్తి అని పిలువబడును. బహిరంగ- శక్తి. సంస్కృత నామము బహిరంగ, కృష్ణుడి బాహ్య శక్తి. కాబట్టి ఇది ఎంతో చక్కగా జరుగుతుంది, ప్రతిదీ భౌతికశక్తిలో. అది కూడా భగవద్గీతలో వివరించబడింది, mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram: ( BG 9.10) నా పర్యవేక్షణలో భౌతిక శక్తీ పని చేస్తుంది భౌతిక శక్తి చూపు లేనిది కాదు అది.. దానికి వెనుక కృష్ణుడు ఉన్నాడు Mayādhyakṣeṇa prakṛtiḥ ( BG 9.10) ప్రకృతి అంటే ఈ భౌతిక శక్తి. అదేవిధముగా... ఇది బాహ్య శక్తి. అదేవిధముగా, అక్కడ మరొక శక్తి ఉంది, అది అంతర్గత శక్తి. అంతర్గత శక్తి ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం తెలియజేయబడింది. Parās tasmāt tu bhavaḥ anyaḥ ( BG 8.20) మరో శక్తి, పరా, ఉన్నత, సర్వోత్కృష్టమైన, ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం బాహ్య శక్తి కింద నిర్వహించబడుతుంది, అదేవిధముగా, ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అంతర్గత శక్తి ద్వారా నిర్వహించబడుతుంది. ఆ అంతర్గత శక్తి రాధారాణి.. రాధారాణి...,

నేడు రాధారాణి యొక్క అవతరణ దినోత్సవం కాబట్టి మనం రాధారాణి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. రాధారాణి ఆనంద శక్తి, హ్లాదిని- శక్తి. Ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). వేదాంత-సూత్రంలో, పరమ సత్యము వర్ణింపబడింది, ఆనందమయంగా, ఎల్లప్పుడూ ఆనందశక్తి లో. ఆ ఆనందమయ, ఆనందశక్తి... కేవలం ఆనందం. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే, ఆనందంగా, మీరు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా, మీరు ఆనందించలేరు. మీరు ఎప్పుడూ స్నేహితుల సమూహంలో, లేదా కుటుంబం, లేదా ఇతర సహచరులతో ఉంటే, మీరు ఆనందం అనుభూతి చెందుతారు. నేను మాట్లాడుతున్నట్లుగానే. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నప్పుడు మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒంటరిగా మాట్లాడలేను. అది ఆనందం కాదు. నేను ఇక్కడ రాత్రి యందు మాట్లాడ వచ్చు. అ‌ర్ధ రాత్రి, ఇక్కడ ఎవరూ లేరు. అది ఆనందం కాదు. ఆనందం అంటే అర్థం తప్పనిసరిగా ఇతరులు ఉండాలి