TE/Prabhupada 0532 - కృష్ణుడి ఆనందం భౌతికమైనది కాదు

Revision as of 09:59, 11 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0532 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971


ఎందుకనగా కృష్ణుడు, పరమ సత్యము, ఆనందమయ, అందువలన eko bahu syāmఆయన అనేకంగా మారెను. మనం కూడా కృష్ణుని లోని భాగము లేదా అంశం, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కొరకు ఉద్ధేశించబడినవారము. మరియు ప్రధాన ఆనంద శక్తిని రాధారాణి అని పిలుస్తారు.

rādhā-kṛṣṇa-praṇaya-vikṛtir hlādinī-śaktir asmād
ekātmānāv api bhuvo (purā) deha-bhedo-gatau tau
caitanyākhyaṁ prakaṭam adhunā tad-dvayaṁ caikyam āptaṁ
rādhā-bhāva-(dyuti)-suvalitaṁ naumi kṛṣṇa-svarūpam
(CC Adi 1.5)

అందువల్ల కృష్ణుడు పరం బ్రహ్మణ్, భగవద్గీత నుండి మీకు తెలిసినట్లుగా. అర్జునుడు భగవద్గీతని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన కృష్ణుడిని ధృవీకరించాడు. para brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12)

కాబట్టి కృష్ణుడు పరం బ్రహ్మణ్. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం గొప్ప సాధువులను చూస్తాము. కేవలం బ్రహ్మానందం ఆస్వాదించడానికి, అతను భౌతిక ఆనందాన్నంతా వదిలి వేస్తాడు. ఆయన సన్యాసి అవుతాడు. అహం బ్రహ్మాస్మి. కేవలం అతను తాను బ్రహ్మ సాక్షాత్కారం పొందానని అర్థం చేసుకోవడానికి కాబట్టి ఎవరయినా బ్రహ్మ సాక్షాత్కారం కొరకు భౌతిక విషయాలన్నింటినీ వదిలి వేస్తుంటే, మీరు ఆలోచించండి ఆ పరంబ్రహ్మణ్, సర్వశ్రేష్టమైన బ్రహ్మణ్, ఏదైనా భౌతికమైనది ఆస్వాదిస్తుందా? లేదు కృష్ణుడి ఆనందం భౌతికమైనది కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. బ్రహ్మణ్ సాక్షాత్కారం కొరకు మనం భౌతిక విషయాలన్నింటినీ విడిచిపెడుతున్నాము. పరం బ్రహ్మణ్ ఏదైనా భౌతికాన్ని ఎలా ఆనందిస్తాడు. ఈ ప్రశ్న చాలా చక్కగా జీవ గోస్వామిచే చర్చించబడింది.

కాబట్టి ఎప్పుడైతే పరం బ్రహ్మణ్... మొట్టమొదటగా పరం బ్రహ్మణ్ సమాచారం ఈ భౌతిక ప్రపంచంలో లేదు. కొద్దిగా బ్రహ్మణ్ సమాచారం ఉంది లేదా కొద్దిగా పరమాత్మ సమాచారం ఉంది. కానీ పరం బ్రహ్మణ్ లేదా భగవంతుని సమాచారం లేదు. అందువల్ల, manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye ( BG 7.3) అని చెప్పబడింది. సిద్ధయే అంటే బ్రహ్మణ్ లేదా పరమాత్మను అర్థంచేసుకోవడము. కానీ బ్రహ్మణ్ మరియు పరమాత్మను అర్థము చేసుకున్న అనేకమంది వ్యక్తులలో, ఎంతో అరుదుగా ఒక వ్యక్తి కృష్ణున్ని తెలుసుకుంటాడు. మరియు ఆ... మొదటగ... (విరామం) మనము కృష్ణుడి ఆనందశక్తి గురించి ఏం అర్థం చేసుకోగలము? ఉదాహరణకు, నేను ఒక గొప్ప మనిషి గురించి తెలుసుకోవాలంటే. అది ఒక పద్ధతి. ఆ గొప్ప మనిషి గురించి తెలుసుకోకుండా, నేను తన అంతర్గత వ్యవహారాల గురించి ఎలా అర్థం చేసుకోగలను? అదేవిధముగా, మనము కృష్ణుణ్ణి అర్థం చేసుకోకపోతే, కృష్ణుడు ఎలా ఆనందిస్తున్నారో మనం ఎలా అర్థం చేసుకుంటాము? అది సాధ్యం కాదు. కానీ గోస్వాములు, మనకు సమాచారం ఇస్తున్నారు, కృష్ణుడి ఆనంద శక్తి ఏమిటి. అది శ్రీమతి రాధారాణి. కావునా మనం రాధా-కృష్ణుల ప్రేమ వ్యవహారాల గురించి వివరించాము, భగవంతుడు చైతన్య మహాప్రభు భోధనామృతం పుస్తకములో, 264 పేజి లో. మీరు ఈ పుస్తకం తీసుకొని ఉంటే, మీరు చదువుకోవచ్చు, రాధా-కృష్ణుల యొక్క పరస్పర ప్రేమ వ్యవహారాలు ఎలా సర్వోత్క్రష్టమైనవో. కాబట్టి ఈరోజు, మన ప్రార్థన, రాధారాణికి ... మనము రాధారాణికి ప్రార్థన చేస్తున్నాము ఎందుకంటే ఆమె కృష్ణుడి ఆనందశక్తి. కృష్ణుడు అంటే "సర్వ-ఆకర్షణీయుడు." కానీ రాధారాణి చాలా గొప్పది, ఆమె కృష్ణుడిని ఆకర్షిస్తుంది. కృష్ణుడు అందరికీ ఆకర్షణీయంగా ఉంటాడు, ఆమె కృష్ణుడుకి ఆకర్షణీయమైనది. కాబట్టి శ్రీమతి రాధారాణి స్థానము, స్థాయి ఏమిటి? ఈ రోజు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, రాధారాణికి మన ప్రణామములు అందించాలి. రాధే వృందావనేశ్వరి.

tapta-kāñcana-gauraṅgī rādhe vṛndāvaneśvarī
vṛṣabhānu-sute devī pranamāmi hari-priye

మన కర్తవ్యము "రాధారాణి, మీరు కృష్ణుడికి ప్రియమైనవారు. నీవు వృషభానురాజు కుమార్తెవు మరియు కృష్ణుడికి ప్రియమైనదానివి కాబట్టి మేము మీకు గౌరవప్రదమైన ప్రణామములు అర్పిస్తున్నాము."

tapta-kāñcana-gauraṅgī rādhe vṛndāvaneśvarī
vṛṣabhānu-sute devī pranamāmi hari-priye