TE/Prabhupada 0956 - తండ్రి కుక్కపిల్ల కుక్క ను ఎప్పుడూ అడగదు, 'స్కూల్ కి వెళ్ళు'. లేదు. అవి కుక్కలు

Revision as of 13:03, 2 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0956 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750623 - Conversation - Los Angeles


తండ్రి కుక్క పిల్ల కుక్క ను ఎప్పుడూ అడగదు, 'స్కూల్ కి వెళ్ళు'. లేదు. అవి కుక్కలు

Dr. Mize: ఒక ఆత్మ ఉందని మనస్సుకు ఎలా తెలుస్తుంది?

ప్రభుపాద: బుద్ధి స్పష్టంగా ఉన్న ప్రొఫెసర్ల నుండి పాఠాన్ని నేర్చుకోవడం ద్వారా. ఎందుకు విద్యార్థులు మీ దగ్గరకు వస్తున్నారు? ఎందుకంటే వాడి బుద్ధి స్పష్టంగా లేదు. మీరు వాడి మనస్సును శుద్ధం చేయాలి, వాడికి మనస్తత్వ శాస్త్రమును బోధిస్తూ, భావన...., ఆలోచించడము, అనుభూతి చెందడము, సంకల్పము చేయడము. అందువలన వాడు ఒక జ్ఞానము ఉన్న వ్యక్తి దగ్గరకు రావాలి , ఎవరికీ తెలుసో, మనస్సును ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా మనస్సు యొక్క కార్యక్రమాలను అర్థం చేసుకోవాలి, వాటితో ఎలా వ్యవహరించాలి. దీనికి విద్య అవసరం. ఒక కుక్క ఈ విద్యను తీసుకోలేదు, కానీ మానవుడు తీసుకోవచ్చు. అందువల్ల మానవుని యొక్క కర్తవ్యము, మనస్సును ఎలా నియంత్రించాలి, పిల్లులు, కుక్కలు లాగా ప్రవర్తించకూడదు. అది మానవుడు అంటే. ఆయన జిజ్ఞాస కలిగి ఉండాలి, ఎందుకు ఇది జరుగుతోంది? ఎందుకు ఇది జరుగుతోంది? ఆయన విద్య తీసుకోవాలి. అది మానవ జీవితం. ఆయన విచారణ చేయకపోతే, ఆయన విద్య తీసుకోకపోతే, ఆయనకి కుక్కలకు మధ్య తేడా ఏమిటి? ఆయన ఒక కుక్కగా మిగిలిపోతాడు. ఆయన మానవ జీవితం యొక్క ఈ అవకాశాన్ని పొందాడు. ఆయన ప్రతీదీ ఏమిటన్నది అర్థం చేసుకోవడానికి ప్రయోజనము పొందాలి, కుక్క స్థితిలో ఉండకూడదు, కేవలం తినడం, నిద్రపోవటం, లైంగిక జీవితం రక్షించుకోవటము. ఇది కుక్క మరియు మానవుడికీ మధ్య ఉన్న వ్యత్యాసం. మనస్సును ఎలాగ నియంత్రించాలో అని ఆయన జిజ్ఞాసను కలిగి ఉండకపోతే, ఆయన కనీసము మానవుడు కూడా కాదు. ఒక కుక్క ఎప్పుడూ విచారణ చేయదు. ఒక కుక్కకు తెలుసు అది "నేను మొరిగేటప్పుడు, ప్రజలు కలత చెందుతారు." ఆయన ఎన్నడూ అడగడు, ఈ మొరిగే అలవాటును ఎలా నియంత్రించాలి? (నవ్వు) ఎందుకంటే ఆయన కుక్క, ఆయన అలా చేయలేడు. ఒక మానవుడు తెలుసుకోగలడు అది "జనులు నన్ను ద్వేషిస్తారు. నేను ఏదైనా తప్పు చేస్తే. నా మనస్సును ఎలా నియంత్రించాలి?" అది మానవుడు. అది మానవుడికి కుక్కకి మధ్య గల వ్యత్యాసం. అందువల్ల వేదముల ఉత్తర్వు, "వెళ్ళండి విచారించండి, మీరు ఈ మానవ రూపాన్ని పొందారు." అథాతో బ్రహ్మ జిజ్ఞాస: "ఇప్పుడు, ఈ సమయము ఆత్మ గురించి విచారించే సమయం." Tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). మీరు ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే, సరైన గురువు దగ్గరకు వెళ్లి ఆయన నుండి పాఠాలు నేర్చుకోండి. అదే విషయం మనము మన పిల్లలకు ఉపదేశించుతాము: మీరు జీవితంలోని ఉన్నత స్థాయిలో విద్యావంతులు అవ్వాలనుకుంటే, పాఠశాలకు వెళ్లండి, కళాశాలకు వెళ్లండి, పాఠం నేర్చుకోండి. అది మానవ సమాజం. కుక్క తండ్రి కుక్క పిల్లని ఎన్నడూ అడగడు, "పాఠశాలకు వెళ్లు." అని, లేదు. అవి కుక్కలు.

జయతీర్థ: ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాలు, ఆత్మ యొక్క స్వభావము గురించి ఏ కోర్సును భోధించడము లేదు.

ప్రభుపాద: అందువల్ల ఆయన ఇలా అన్నాడు, "నేను కుక్కగా మారితే తప్పు ఏమిటి?" ఎందుకంటే అక్కడ విద్య లేదు. ఆయనకు కుక్క మరియు మానవుడుకు మధ్య వ్యత్యాసం తెలియదు. అందువలన ఆయన "నేను కుక్కగా మారితే తప్పు ఏమిటి? అని అంటున్నాడు ఏ నేరారోపణ లేకుండా లైంగిక ఆనందం కోసం మరింత సౌకర్యాలను పొందుతాను." ఇది విద్య యొక్క పురోగతి.

డాక్టర్. Mize: మనస్సు, అప్పుడు, ఒక ఆత్మ ఉంది అని ఎలా తెలుసుకుంటుంది?

ప్రభుపాద: నేను చెప్పేది, మీరు విద్యావంతులై ఉండాలి. ఈ వ్యక్తులను ఆత్మ గురించి ఎలా ఒప్పించారు? వారు విద్యాభ్యాసం చేశారు. అభ్యాసం సాధన మరియు జ్ఞానం ద్వారా. విద్యాభ్యాసం పొందటము ద్వారా ప్రతిదీ నేర్చుకోవాలి. అందువల్ల వేదముల ఉత్తర్వు తద్-విజ్ఞానార్థం, "ఆ శాస్త్రము తెలుసుకోవాలంటే" గురుమేవ అభిగచ్ఛేత్, "మీరు గురువు, ఉపాధ్యాయుడు దగ్గరకు తప్పనిసరిగా వెళ్లాలి." కాబట్టి సమాధానం ఏమిటంటే మీరు బోధకుడు దగ్గరకు వెళ్ళాలి ఎవరైతే మీకు బోధించగలరో అక్కడ ఆత్మ ఎలా ఉంది అని