TE/Prabhupada 0661 - ఈ అబ్బాయిల కంటే మెరుగైన ధ్యానము చేయువారు లేరు వారు కృష్ణుడి పై దృష్టి కేంద్రీకరించారు
Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969
నా మీద ధ్యానం చెయ్యాలి. చివరకు, ధ్యానం దేని మీద చేయాలి. శూన్యము మీద కాదు. కేవలం విష్ణువు పైన, ఈ విష్ణువు రూపం అది సాంఖ్య-యోగ.
ఈ సాంఖ్య-యోగ మొదట కపిల దేవుని చే సాధన చేయబడింది. ఆయన భగవంతుని అవతారం, కృష్ణుడు. కాబట్టి ఇది యోగ యొక్క రహస్యం. ఇది, నేను చెప్పాలనుకుంటున్నది, కూర్చుని మీ ముక్కు యొక్క కొనను చూసే పద్ధతి నేరుగా కూర్చుని, ఇవన్నీ, నేను చెప్పాలనుకుంటున్నది, అంటే విష్ణువు రూపం లేదా కృష్ణుని పై మీ మనస్సును దృష్టి పెట్టడానికి మీకు సహాయం చేస్తాయి. నామీద ధ్యానం చేయాలి. ఈ ధ్యానం అంటే కృష్ణుని పై ధ్యానం. కాబట్టి ఇక్కడ ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో, ఇది కేవలం కృష్ణుడి పైన నేరుగా, ఇంక ఏమీ లేదు.... అందువలన ఈ అబ్బాయిల కంటే మెరుగైన ధ్యానము చేయువారు లేరు. వారు కేవలం కృష్ణుడి పై దృష్టి కేంద్రీకరించారు. వారి మొత్తం కర్తవ్యము కృష్ణుడు. వారు తోటలో పని చేస్తున్నారు, భూమిని తవ్వుతున్నారు, ఓ మంచి గులాబీ ఉంటుంది, మనము కృష్ణుడికి అర్పించాలి. ధ్యానము. ఆచరణాత్మక ధ్యానము. నేను గులాబీని పెంచుతాను అది కృష్ణుడికి ఇవ్వబడుతుంది. త్రవ్వించుటలో కూడా ధ్యానం ఉంది. మీరు చూడండి? వారు చక్కని తినుబండారాలను సిద్ధం చేస్తున్నారు, “ఓ, ఇది కృష్ణునిచే తినబడుతుంది.” కాబట్టి వంటలో ధ్యానం ఉంది. మీరు చూడండి? కీర్తన, జపము చేయటము, నృత్యం చేయడం గురించి ఏమి చెప్తాము. కాబట్టి ఇది..... వారు కృష్ణుడిపై ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేస్తారు. పరిపూర్ణ యోగి. ఎవరైనా వచ్చి సవాలు చేయనివ్వండి. ఈ అబ్బాయిలు పరిపూర్ణ యోగులు.
మేము ఖచ్చితమైన యోగ పద్ధతిని బోధిస్తున్నాము. మానసిక కల్పన పద్ధతి కాదు. భగవద్గీత ప్రామాణికం మీద. మేము కల్పనలను ఏదీ తయారు చేయలేదు, కానీ ఇక్కడ ప్రకటన, మీరు చూస్తున్నారా? కేవలము మీ మనస్సును కృష్ణుడు లేదా విష్ణువు పైన కేంద్రీకరించండి. వారి కార్యక్రమాలు ఎలా మలచబడినవి అంటే. వారు కృష్ణుడి గురించి తప్ప వేరేది ఆలోచించలేరు, కృష్ణుని గురించి తప్ప వేరేది ఆలోచించలేరు, కృష్ణ, కృష్ణ. కాబట్టి వారు అత్యధిక ధ్యానవంతులు. "హృదయములో నా గురించి ఆలోచించండి నన్నే అంతిమ లక్ష్యంగా చేసుకోండి.” కాబట్టి కృష్ణుడు, జీవితం యొక్క అంతిమ లక్ష్యం. వారు కృష్ణుని లోకమునకు బదిలీ చేయబడుట కోసం తయారవుతున్నారు. ఇక్కడ ఒక ఖచ్చితమైన యోగ ఉంది. వారు పరిపూర్ణ యోగను సాధన చేస్తున్నారు. కొనసాగించు