TE/Prabhupada 0032 - నేను మాట్లాడవలసినదంతా నా పుస్తకాలలో మాట్లాడాను
Arrival Speech -- May 17, 1977, Vrndavana
ప్రభుపాద: కావున నేను మాట్లాడలేను. నేను చాలా నీరసంగా ఉన్నాను. నేను చండీఘర్ కార్యక్రమునకు వెళ్ళవలసి ఉంది ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి కానీ ఆ కార్యక్రమమును రద్దు చేసుకున్నాను. ఎందుకంటే నా శరీర ఆరోగ్య స్థితి చాలా క్షీణిస్తోంది. అందుకే వృందావనముకు రావడానికి మొగ్గు చూపాను. చావు వస్తే, ఇక్కడే రానివ్వనీ. కొత్తగా చెప్పడానికి ఇప్పుడు ఏమి లేదు. నేను ఏదైతే చెప్పాలో, నా పుస్తకాలలో చెప్పాను. ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోండి మరియు మీ కృషిని కొనసాగించండి. నేను ఉన్నా లేకపోయినా, దానితో సంబంధం లేకుండా. ఏ విధంగా కృష్ణుడు శాశ్వతముగా జీవిస్తున్నాడో, అదే విధంగా, జీవి కూడా శాశ్వతముగా జీవిస్తాడు. కానీ కీర్తిర యస్య స జీవతి: ఎవరైతే భగవంతునికి సేవ చేస్తాడో వాడు చిరకాలము జీవిస్తాడు." కావున మీరు కృష్ణుడికి సేవ చేయడం నేర్చుకున్నారు. మరియు కృష్ణుడి తో మనము శాశ్వతముగా జీవించవచ్చు. మన జీవితం శాశ్వతం. న హన్యతే హన్యమానే శరీరే (భగ 2. 20). ఈ శరీరము తాత్కాలికముగా మరణించడము అది పట్టించుకోవలసిన అవసరము లేదు. శరీరం ఉన్నదే మరణించడము కొరకు. తథా దేహాంతర-ప్రాప్తిః(భగ 2 13). కావున కృష్ణుడికి సేవ చేస్తూ చిరకాలము జీవించండి చాలా ధన్యవాదాలు.
భక్తులు: జయ!