TE/Prabhupada 0093 - భగవద్గీత కూడా కృష్ణుడే

Revision as of 18:34, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on Brahma-samhita, Lecture -- Bombay, January 3, 1973


శ్రీమద్-భాగవతము వేదాంత సూత్రం యొక్క వాస్తవ వివరణ. వేదాంత-సూత్రములో, వేదాంత-సూత్రం యొక్క వివరణ అయిన శ్రీమద్-భాగవతములో, ఇలా చెప్పబడింది,

janmādy asya yataḥ anvayāt itarataś ca artheṣu abhijñaḥ
tene brahma hṛdā ādi-kavaye muhyanti yatra sūrayaḥ
(SB 1.1.1)

ఈ వర్ణనలు ఉన్నాయి. ఆది-కవి, ఆది-కవి పదమునకు అర్థము బ్రహ్మ. తేనే బ్రహ్మ. బ్రహ్మ అంటే శబ్దం బ్రహ్మణ్, వేదముల సాహిత్యం. కృష్ణుడు బ్రహ్మ యొక్క హృదయములో ఆదేశములను ఇచ్చారు సృష్టి యొక్క ప్రారంభము నుండి బ్రహ్మ ఒక్కరే ఇప్పటికీ నివసిస్తున్నారు. ప్రశ్న ఏమిటంటే: "బ్రహ్మ వేదముల జ్ఞానమును ఎలా నేర్చుకున్నారు. ఇక్కడ వివరించారు: తేనే బ్రహ్మ... బ్రహ్మ. బ్రహ్మ అంటే వేదముల సాహిత్యం. శబ్ద- బ్రహ్మణ్. భగవంతుడు గురించి వివరణ కూడా బ్రహ్మణ్ అంటారు. బ్రహ్మణ్ పరిపూర్ణమైంది. బ్రహ్మణ్ మరియు బ్రహ్మణ్ ని వివరిస్తున్న సాహిత్యం మధ్య వ్యత్యాసం లేదు. భగవద్గీతకు కృష్ణునికి మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు భగవద్గీత అంటే కృష్ణుడు. లేకపోతే, ఎందుకు ఈ పుస్తకము పూజింపబడుతుంది, చాలా కాలముగా ఐదు వేల సంవత్సరాల నుండి లేకపోతే, భగవద్గీతే కృష్ణుడు కాకపోతే? చాలా సాహిత్య పుస్తకాలు ఈ రోజుల్లో ప్రచురించబడుతున్నాయి. ఒక సంవత్సరం తర్వాత, రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల - తరువాత వాటిని ఎవరూ పట్టించుకోరు. వాటిని పట్టించుకోరు. ఎవరూ చదవరు మీరు ప్రపంచ చరిత్రలో ఏ సాహిత్యం తీసుకున్నా ఐదు వేల సంవత్సరాలు ఏ సాహిత్యము ఉనికిలో లేదు అనేకమంది పండితులు, గురువులు తత్వవేత్తలు పలుసార్లు భగవద్గీతను చదివారు ఎందుకు? ఎందుకంటే అది కృష్ణుడు. శ్రీకృష్ణునికి భగవద్గీతకు మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు. శబ్ద-బ్రహ్మణ్. భగవద్గీతను సాధారణ సాహిత్యంగా తీసుకోకూడదు, మనము మన ABCD జ్ఞానం ద్వారా భగవద్గీత మీద వ్యాఖ్యానము చేయుట కుదరదు. అది సాధ్యం కాదు. తెలివితక్కువారు మోసము చేసేవారు, వారి ABCD పాండిత్యము ద్వారా శ్రీకృష్ణుడి మీద వ్యాఖ్యానము చేస్తారు అది సాధ్యం కాదు. ఇది శబ్ద బ్రహ్మణ్. ఇది కృష్ణుడి యందు భక్తి వున్నవారికి వివరించబడుతుంది

yasya deve parā bhaktir
yathā deve tathā gurau
tasyaite kathitā hy arthāḥ
prakāśante mahātmanaḥ
(ŚU 6.23)

అవి హృదయము నందు వివరించబడుతాయి అందువలన వేదముల సాహిత్యమును వెల్లడించబడినది అంటారు. నేను మీ ABCD జ్ఞానం ద్వారా దీనిని అర్థం చేసుకోగలను అని కాదు నేను ఒక భగవద్గీత కొనుగోలు చేయవచ్చు నాకు వ్యాకరణ జ్ఞానం తెలిసివున్నా, నేను భగవద్గీతను అర్థం చేసుకోగలనా. కుదరదు. వేదేషు దుర్లభ. బ్రహ్మసంహితలో వేదేషు దుర్లభ అని చెప్పబడినది. మీరు మీ సాహిత్య సామర్థ్యం లేదా పాండిత్యము ద్వారా అన్ని వేదముల సాహిత్యములను అధ్యయనం చేయండి. అది సాధ్యం కాదు. వేదేషు దుర్లభ. అనేక మంది వారి పాండిత్యము ద్వారా భగవద్గీతను వివరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ వారిని పట్టించుకోరు. వారు ఒక్కరిని కూడా కృష్ణుని భక్తుడిగా మార్చలేరు. ఇది ఒక సవాలు. మీ బొంబాయిలో అనేక మంది, వారు చాలా సంవత్సరాల నుండి భగవద్గీతని వివరిస్తున్నారు. కానీ వారు ఒక వ్యక్తిని కూడా పవిత్రమైన కృష్ణుని భక్తుడిగా మార్చలేదు. ఇది మన సవాలు. కానీ ఈ భగవద్గీతను, ఇప్పుడు యధాతథముగా వివరించాము, వేల కొద్ది యూరోపియన్లు అమెరికన్లు వారి తాత ముత్తాతలు లేదా కుటుంబములో ఎవరికీ కృష్ణుని నామము కూడా తెలియని వారు, భక్తులుగా మారుతున్నారు. ఈ విజయము యొక్క రహస్యము ఇది. కానీ ఈ మూర్ఖ ప్రజలకు, ఇది తెలియదు. వారు వారి అర్థములేని మూర్ఖపు జ్ఞానము ద్వారా భగవద్గీత వ్యాఖ్యానములతో, వారు భగవద్గీత అర్థము వివరించగలమని భావిస్తున్నారు నాహం ప్రకాశః యోగ మాయా-సమావృతః. కృష్ణుడు ఈ వెర్రివారికి దుర్మార్గులకు వెల్లడి కాడు. కృష్ణుడు ఎప్పటికీ అర్థము కాడు. నాహం ప్రకాశః సర్వస్వ ( BG 7.25) కృష్ణుడు చౌక విషయము కాదు. ఆయన ఈ మూర్ఖులకు అర్థం అవ్వటానికి అది సాధ్యం కాదు. నాహం ప్రకాశః సర్వస్వ యోగ మాయ-సమా... ( BG 7.25)

మనుష్యానామ్ సహస్రేషు కశ్చిద్
యతతి సిద్ధయే
యతతామపి సిద్ధానామ్
కశ్చిద్ వేత్తి మామ్ తత్వతః
( BG 7.3)