TE/Prabhupada 0116 - మీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దు
Lecture with Allen Ginsberg at Ohio State University -- Columbus, May 12, 1969
ఆత్మ ఉన్నాది, ఈ శరీరం ఆ ఆత్మ వలన అభివృద్ధి చే౦దినది, ఆ ఆత్మ ఒక శరీరం నుండి మరో దానికి వలసపోతుంది. అది పరిణామం అంటారు. ఆ పరిణామ పద్ధతి జరుగుతుంది, 8,400,000 జీవి జాతులలో నుండి నీటి జీవులు, పక్షులు, జంతువులు, మొక్కలు, అనేక జాతులలో. మనకు ఇప్పుడు అభివృద్ధి చెందిన చైతన్యం, మానవ రూపములో వచ్చినది. మనము దానిని సరిగా ఉపయోగించుకోవాలి. ఇది మన కృష్ణ చైతన్య ఉద్యమం. మనము కేవలం ప్రజలను విద్యావంతులను చేస్తూ, "మీ విలువైన జీవితాన్ని, మానవ జీవితాన్ని వృథా చేయవద్దు అని ప్రచారము చేస్తున్నాము మీరు ఈ అవకాశాన్ని కోల్పోతే, మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. " ఇది మా ప్రచారం. ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ కృష్ణ చైతన్యమును తీసుకోండి.
ఈ పద్ధతి చాలా సులభం. మీరు యోగా పద్ధతి లేదా తాత్విక, ఊహాత్మక పద్ధతులను క్లిష్టమైన పద్ధతిలు తీసుకోవాలసిన అవసరము లేదు. ఈ యుగంలో అది సాధ్యం కాదు. అంతే ... నేను నా స్వంత అనుభవము నుండి మాట్లాడటం లేదు, కానీ గొప్ప గొప్ప ఆచార్యులనుoడి, గొప్ప గొప్ప పెద్ద ఋషుల అనుభవములను నేను తీసుకుంటూన్నాను వారు చెప్పుతారు kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā. మీరు మీ తదుపరి జీవితం ఏమిటి తెలుసుకోవాలనుకుంటే, మీమల్ని మీరు తెలుసుకోవాలంటే మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే, దేవుడుతో మీ సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే, ఈ విషయాలు మీకు తెలుపబడతాయి - ఇది వాస్తవ జ్ఞానము - కేవలం ఈ మంత్రాన్ని జపిస్తూ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది ఆచరణాత్మకమైనది. మేము ఏది వసులు చేయుటలేదు. మనము మోసము చేయడము లేదు నేను మీకు కొన్ని రహస్య మంత్రములను ఇస్తాను, మీవద్ద యాభై డాలర్లను వసూలు చేస్తాను. లేదు ఇది అందరికీ తెరిచి ఉన్నది. దయచేసి తీసుకోండి. ఇది మా అభ్యర్థన. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము, మీ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. దయచేసి ఈ మంత్రాన్ని తీసుకోండి. మీరు ఎక్కడైనా జపము చేయండి మీరు అనుసరించాల్సిన కఠినమైన నియమాలు లేవు. మీకు కావలసినప్పుడు, మీకు కావలసిన చోట, జీవితంలో ఏ పరిస్థితిలో అయిన ... మనము అరగంట క్రితము జపము చేసిన విధముగా. ఏదైనా పరిస్థితిలో మీరు ఆనందమును అనుభవించవచ్చు. ఇదేవిధంగా, మీరు దీన్ని కొనసాగించవచ్చు. ఈ హరే కృష్ణమంత్రమును జపము చేయండి. ఇది మీకు ఉచితంగా ఇవ్వబడిoది. కానీ మీరు ఈ హరే కృష్ణ మంత్రమును తత్వము ద్వారా తెలుసుకోవాలనుకుంటే, జ్ఞానము ద్వారా, తర్కం ద్వారా, మా వద్ద చాల పుస్తకాలు వున్నవి. మనము కేవలం సెంటిమెంటల్గా నాట్యము చేస్తున్నామని అనుకోవద్దు. లేదు, మాకు బ్యాక్ గ్రౌండ్ వున్నది ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఈ మంచి సందేశాన్ని మీకు అందించడానికి ముఖ్యంగా మీ దేశానికి వచ్చాను, ఎందుకంటే మీరు దీన్ని అంగీకరించినట్లయితే, మీరు కృష్ణ చైతన్యము యొక్క ఈ విజ్ఞానాన్ని అర్ధం చేసుకుంటే, ప్రపంచంలోని ఇతర ప్రదేశాలవారు కూడా అనుసరిస్తారు, ప్రపంచం యొక్క దిశ మారుతుంది. ఇది వాస్తవము.