TE/Prabhupada 0144 - దీనిని మాయ అంటారు
Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970
- prakṛteḥ kriyamāṇāni
- guṇaiḥ karmāṇi sarvaśaḥ
- ahaṅkāra-vimūḍhātmā
- kartāham iti manyate
- (BG 3.27)
భక్తులను, కృష్ణుడు తానే స్వయముగా పర్యవేక్షిస్తాడు సాధారణ జీవులను మాయ పర్యవేక్షిస్తుంది. మాయా కూడా కృష్ణుని యొక్క పని మనిషి. మంచి పౌరులను , వారిని ప్రభుత్వం నేరుగా శ్రద్ధ తీసుకుంటుంది, నేరస్థులను, వారిని జైలు విభాగం ద్వారా ప్రభుత్వం నియంత్రిస్తుంది, నేర విభాగం ద్వారా. వారిని కూడా జాగ్రత్తగా చుసుకుంటారు. జైలు గృహంలో ప్రభుత్వం ఖైదీలు అసౌకర్యంగా లేకుండా జాగ్రత్త తీసుకుంటుంది. వారు తగినంత ఆహారం పొందుతారు; వారికి వ్యాధి వచ్చిన్నట్లయితే వారికి ఆసుపత్రిలో చికిత్స చేస్తారు. ప్రతి సంరక్షణ ఉంది, కానీ అది శిక్షలో భాగముగా. అదేవిధంగా, ఈ భౌతిక ప్రపంచంలో కుడా ఖచ్చితంగా రక్షణ ఉంది, కానీ, శిక్షా విధానంలో. మీరు ఇది చేస్తే, చంపలు వాయించబడుతాయి. మీరు ఇది చేస్తే, కిక్ చేయబడుతారు. మీరు ఇలా చేస్తే, ఈ విధముగా ... ఇది జరుగుతోంది. వీటిని త్రివిధ క్లేశములు అని అంటారు. కానీ మాయ ప్రభావము వలన మనము ఈ మాయా యొక్క తన్నులు, మాయ చెంప దెబ్బలు, మయ యొక్క ఈ కుమ్ములాట చాలా బాగుంది అని ఆనుకుంటున్నాము. మీరు చూడoడి? దీన్ని మాయ అని అంటారు. మీరు కృష్ణ చైతన్య౦లోకి ప్రవేశించిన వెంటనే, అప్పుడు కృష్ణుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తాడు. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ (BG 18.66). కృష్ణుడికి, మీరు ఆశ్రయము పొందిన వెంటనే, కృష్ణుడి యొక్క తక్షణ పదం, "నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్ని పాపపు ప్రతిచర్యల నుండి నేను మిమ్మల్ని రక్షిస్థాను. " మన జీవితంలో పాపభరితమైన ప్రతిచర్యలు కుప్పలు కొద్ది ఉన్నాయి, జన్మ జన్మల నుండి ఈ భౌతిక జీవితంలో మీరు కృష్ణుడికి శరణాగతి పొందీన వెంటనే, వెంటనే కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడు అన్ని పాపాత్మక ప్రతిచర్యలను ఎలా సరిదిద్దాలి అనే విషయాన్ని అయిన చూసుకుంటాడు. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mā śucaḥ. Kṛṣṇa says, "సంకోచించకండి." మీరు ", నేను చాలా పాపాత్మకమైన కార్యకలాపాలను చేశాను, కృష్ణుడు నన్ను ఎలా రక్షించగలడు?" అని అనుకుంటే లేదు. కృష్ణుడు సర్వశక్తిమంతుడు. అయిన మిమ్మల్ని రక్షిస్తాడు. మీ కర్తవ్యము అయినకి శరణాగతి పొందుట, ఏటువంటి ఆలోచనలు లేకుండా, తన సేవ కోసం మీ జీవితమును అంకితం చేయండి ఈ విధముగా మీరు రక్షించ బడుతారు.