TE/Prabhupada 0254 - వేదముల జ్ఞానం గురువుచే వివరించబడుతుoది

Revision as of 18:58, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.8 -- London, August 8, 1973


వాస్తవానికి మనం అoదరము వ్యక్తులము, నిరాకారము కాదు కృష్ణుడు కూడా చెప్తాడు ... అయిన ఇలా చెబుతాడు: ఈ సైనికులు, ఈ రాజులు, నీవు నేను నా, ప్రియమైన అర్జునా, గతంలో మనము లేము అని కాదు. భవిష్యత్తులో మనం ఉండము అని కాదు. " కృష్ణుడి యొక్క ఈ ప్రత్యేక ఉపదేశము, ఆది నేను, నీవు ఇక్కడ సమావేశమైన ఈ రాజులు సైనికులు, వారు ఇంతకు ముందు ఉన్నారు. మనము ప్రస్తుతం ఉన్నట్లు, ప్రత్యేకమైన వ్యక్తిగా; అదేవిధంగా, వారు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనం ప్రత్యేక వ్యక్తులుగా ఉంటాము. " నిరాకర ప్రశ్న ఎక్కడ ఉంది? ఈ పనికిమాలిన నిరాకరవాదులు, శూన్య వాదులు. అందువల్ల, సూత్రం ఏమిటంటే విషయములను వాస్తవాముగా అర్ధం చేసుకోవటానికి , అర్జునుడు సమిపించినట్లు ప్రతి ఒక్కరు కృష్ణుడిని సమీపించాలి, Śiṣyas te 'ham: ( BG 2.7) "ఇప్పుడు నీ శిష్యుడిని మీరు నాకు నేర్పించండి. Śādhi māṁ prapannam నేను ఆశ్రయము పొందుతున్నాను. నేను మీతో సమాన స్థాయిలో మాట్లాడటానికి ప్రయత్నించటములేదు. "

గురువుని అంగీకరించినట్లు అంటే గురువు ఏమి చెప్పినా దానిని మీరు అంగీకరించాలి. లేకపోతే, గురువును స్వికరించవద్దు. ఒక ఫ్యాషన్ కోసము చేయవద్దు. మీరు సిద్ధంగా ఉండాలి. అది ప్రప్పన్నం అని పిలుస్తారు. Tad viddhi praṇipātena ( BG 4.34) గురువును పరీక్షించటానికి కాదు, ఆశ్రయము పొందటము ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అతనిని పరీక్షిస్తాను, అతనికి ఎంత తెలుసు. అప్పుడు గురువు ఉండడము వలన ఉపయోగము ఏమిటి? కాదు అందువల్ల అర్జునుడు ఇలా అంటాడు: "మీరు కాకుండా, ఈ కలవరమైన స్థితిలో నన్ను నిజంగా సంతృప్తి పరచే వారు ఎవరూ లేరు." Yac chokam ucchoṣaṇam indriyāṇām ( BG 2.8) "నా ఇంద్రియాలు ఎండిపోతున్నాయి." ఎందుకంటే బాహ్యమైన ఇంద్రియాలు ... అవి వాస్తవ ఇంద్రియాలు కాదు. వాస్తవ ఇంద్రియాలు లోపల ఉన్నాయి. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanam ( CC Madhya 19.170) మనము కృష్ణుడిని, సేవించవలసి ఉంది .హృషికేశ.. కృష్ణుడు వాస్తవమైనవాడు, మనము వాస్తవిక స్థితికి రావాలి. అప్పుడు మనము కృష్ణుడికి సేవ చేయవచ్చు. Hṛṣīkeṇa. Tat paratvena nirmalam.మనఇంద్రియాలను పవిత్రము అయినప్పుడు. Indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ, manasas tu paro buddhir ( BG 3.42) ఆవి వివిధ దశలు ఉన్నాయి. ఈ శరీర భావము అంటే ఇంద్రియాలు అని అర్థం. కానీ మీరు ఈ ఇంద్రియాలను అధిగమించినప్పుడు, మీరు మానసిక స్థితికికు వస్తారు. మీరు మానసిక స్థితిని అధిగమించినప్పుడు, మీరు మేధస్సు స్థితికి వస్తారు. మీరు మేధస్సు స్థితికి మీదకి వచ్చినప్పుడు, మీరు అధిగమించినప్పుడు, మీరు ఆధ్యాత్మిక స్థితికి వస్తారు. అది ఆధ్యాత్మిక రూపం. వివిధ తరగతులు దశలను ఉన్నాయి. స్థూల శారీరక స్థితిలో మనము pratyakṣa-jñānamను కోరుకుంటాము ప్రత్యక్ష అంటే ప్రత్యక్షానుభవముచే. జ్ఞానం యొక్క వివిధ దశలు ఉన్నాయి. Pratyakṣa, aparokṣa, pratyakṣa, parokṣa, aparokṣa, adhokṣaja, aprakṛta. ఈ జ్ఞానం యొక్క వివిధ దశలు ఉన్నాయి. శరీర స్థితిలో, ప్రత్యక్షఅనుభవములో పొందిన జ్ఞానం, వాస్తవమైన జ్ఞానం కాదు. అందువలన, మనము ఈ శాస్త్రవేత్తలను, శాస్త్రవేత్తలు అని పిలవబడే వారిని సవాలు చేయవచ్చు. వారి జ్ఞానం యొక్క ప్రాథమిక సూత్రం శరీర భావనపై ఉన్నది, ప్రత్యక్ష, ప్రయోగాత్మక జ్ఞానం . ప్రయోగాత్మక జ్ఞానం అంటే ఈ స్థూల ఇంద్రియ అనుభవము. ఇది ప్రయోగాత్మకమైనది. Pratyakṣa. అందరూ చెబుతారు: "మనము దేవుణ్ణి చూడలేము." దేవుడు అటువంటి చర్చనీయంస విషయము కాదు మీరు ఈ ప్రత్యక్ష అనుభవముతో మీరు చూడటానికి . దేవుడు మరొక నామము. Anubhāva. ఉదాహరణకు ఈ గదిలో మనము నేరుగా సూర్యుడిని చూడలేము. కానీ సూర్యుడు ఉన్నాడని మనకు తెలుసు. ఇది పగటిపూట. మీకు ఇది ఎలా తెలుసు? మీరు చూడలేదు. కానీ ఇతర పద్ధతిలు ద్వార కూడా మీరు తెలుసుకొనవచ్చు. దానిని aparokṣa. అని పిలుస్తారు. Pratyakṣa parokṣa aparokṣa. ఈ విధంగా, కృష్ణ చైతన్యము అంటే adhokṣaja and aprakṛta, ఇంద్రియలకు అతీతమైన అందువలన, భగవద్గీతలో ఇలా చెప్పబడింది: adhokṣaja. ప్రత్యక్ష అనుభవము చేరుకోలేని స్థితి నుండి. ప్రత్యక్ష అనుభవము ద్వార తెలుసుకోలేనిది, అప్పుడు మీరు ఎలా చూడగలగుతారు anubhāva? అది śrota-panthā. అది శ్రుతి అంటారు. మీరు వేదాల నుండి జ్ఞానం తీసుకోవాలి. వేదముల జ్ఞానం గురువుచే వివరించబడుతుoది. అందువలన ప్రతి ఒక్కరు కృష్ణుడిని మహోన్నతమైన గురువుగా లేదా అయిన ప్రతినిధి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. అప్పుడు ఈ ఇబ్బందులు, అనగా అజ్ఞానం చెదిరిపోతుంది. Yac chokam ucchoṣaṇam indriyāṇām ( BG 2.8)