TE/Prabhupada 0203 - ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని ఆపవద్దు
Lecture and Initiation -- Chicago, July 10, 1975
ప్రభుపాద: యజ్ఞము, త్యాగం ... Yajña-dāna-tapaḥ-kriyā మానవ జీవితం యజ్ఞాచారణము, దానము చేయుట, మరియు తపస్సును ఆచరించడానికి ఉద్దేశించబడింది. మూడు విషయాలు, మానవ జీవితం అంటే. మానవ జీవితం అంటే పిల్లులు మరియు కుక్కలలాగా జీవించడం కాదు. ఇది వైఫల్యం. ఆ రకమైన నాగరికత, కుక్క నాగరికత వలన మానవ జీవితం వైఫల్యం అవుతుంది. మానవ జీవితం మూడు విషయాల కోసం ఉద్దేశించబడింది: yajña-dāna-tapaḥ-kriyā. యజ్ఞములు ఎలా చేయాలో, దానములు ఎలా ఇవ్వాలో ప్రతి వారు ముందర తెలుసుకోవాలి మరియు ఎలా తపస్సాధన చేయాలో తెలుసుకోవటము. ఇది మానవ జీవితము కాబట్టి యజ్ఞ-దాన-తపస్య అనునవి ఇతర యుగాలలో వారు వారి స్తోమత ననుసరించి నిర్వర్తించారు ఉదాహరణకు సత్య-యుగములో, వాల్మికి ముని, అతను అరవై వేల సంవత్సరాలు పాటు తపస్సులు, ధ్యానములు చేసాడు. ఆ యుగములలో ప్రజలు వందల వేల సంవత్సరాల నివసిన్చారు. అది ఇప్పుడు సాధ్యం కాదు. ఆ యుగాల్లో ధ్యానం సాధ్యమయింది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. అందుచేత, శాస్త్రము చెబుతుంది, yajñaiḥ saṅkīrtana-prāyaiḥ: నీవు ఈ యజ్ఞము చేయి. సంకీర్తన. కాబట్టి సంకీర్తన యజ్ఞం చేయుటము వలన, మీరు అదే ఫలితం పొందవచ్చు. అరవై వేల సంవత్సరాల ధ్యానం తరువాత వాల్మీకి మునికి ఫలితం వచ్చినట్లు మీరు కేవలం సంకీర్తన చేయటము ద్వారా అదే ఫలితము పొందవచ్చు. కొన్ని రోజులలోనే కావచ్చు ఇది చాలా దయ కలది నాకు చాలా ఆనందముగా వుంది, పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో, అదృష్టవంతులు అయిన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, మీరు ఈ సంకీర్తన యజ్ఞములో చేరారు. ప్రజలు ప్రశంసిస్తున్నారు. నేను కూడా చాల ఆనందముగా వున్నాను కాబట్టి ఈ యజ్ఞం, మీరు బస్సులలో భగవత్ మూర్తులను ముల మూలలకు తీసుకోనివెళ్లి యజ్ఞములు చేస్తున్నారు మీ మొత్తం దేశం జాతీయంగా ఈ సంప్రదాయాన్ని అంగీకరించే వరకు ఈ విధానాన్ని కొనసాగించండి.
భక్తులు: జయ! ప్రభుపాద: వారు అంగీకరిస్తారు. ఇది చైతన్య మహా ప్రభు ముందరే చెప్పారు
- pṛthivīte āche yata nagarādi-grāma
- sarvatra pracāra haibe mora nāma
చైతన్య మహాప్రభు కోరినట్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణం లో, ప్రతి దేశములో, ప్రతి నగరంలో, ఈ సంకీర్తన ఉద్యమం ఉంటుంది, మరియు శ్రీ చైతన్య మహాప్రభు కు ప్రజలు బద్ధులై వుంటారు: "మా ప్రభూ! నీవు మాకు మహోన్నత విషయం ఇచ్చావు." ఇది ముందే చెప్పబడింది. కేవలం మనము చేయగలిగినంత ప్రయత్నం మనము చేయాలి. కనుక ఇది అంత కష్టమైంది కాదు. మీరు భగవత్ మూర్తులను కూడా స్థాపించారు. అనేక బస్సులలో మరియు ఒక నగరం నుండి మరియొక నగరానికి, పట్టణాలకు , గ్రామాలకు భగవత్ మూర్తులను తీసుకువెళుతున్నారు మరియు మీరు ఇప్పుడు అనుభవము పొంది వున్నారు, కాబట్టి ఈ ఉద్యమాన్ని విస్తరించండి. నేను పదేపదే చెప్పినట్లు మీ దేశం, అమెరికా, అదృష్టవంతమైనది మరియు వారికి ఇది మాత్రమే అవసరం, సంకీర్తన ... అప్పుడు వారు పరిపూర్ణత చెందుతారు. నేను నిన్న చాలా విషయాలు చర్చించాను - బహుశా మీరు డైలీ న్యూస్ పేపర్లో చుచివుండవచ్చు - అందువలన పూర్తిగా అభివృద్ధి చేయవలసి వుంది, భగవత్ సంభందమైన అభివృద్ధి ఇప్పుడు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలు అంత బాగా లేవు. భౌతికంగా, ఈ జీవిత పోటి మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు సహకరించదు. అందుకు మీరు బాధపడవలసిన అవసరంలేదు. భౌతికంగా అభివృద్ధి చెందండి, కానీ మీ ఆధ్యాత్మిక విధి మరియు ఆధ్యాత్మిక గుర్తింపును మర్చిపోకండి. మరచిపోతే అది నష్టమే. అది śrama eva hi kevalam (SB 1.2.8), కేవలం అది సున్యంలో పనిచేస్తున్నట్లు అవుతుంది. మీ చంద్రుని యాత్ర లాగే, ఆ సమయం మరియు ఖర్చు వ్యర్ధమైనవి మీరు చాలా బిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టారు, అందువలన మీకు వచ్చిందేంటి? యింత మట్టి, అంతే. ఆ విధంగా మూర్ఖంగా ఉండకండి. ఆచరణాత్మకముగా వుండండి అలాంటి పెద్ద మొత్తం డబ్బు, డాలర్లు ఖర్చు పెట్టాలనుకుంటే, మీ దేశమంతా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాపింప చేయవచ్చు, అప్పుడు అపారమైన ప్రయోజనం సాధించవచ్చు ఏమైనా, మేము ఏమీ చెప్పలేము. మీ డబ్బు మీరు దూరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చు. అది మీ వ్యాపారం. కాని మేము మీ అధికారులను మరియు బుద్ధిమంతులందరినీ ఈ సంకీర్తన ఉద్యమాన్ని అనుసరించమని అభ్యర్థిస్తున్నాము, ముఖ్యంగా అమెరికాలో, మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు, యూరోప్, ఆసియాకు విస్తరిన్ప చేయాలి. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా మీరు ఇప్పటికే గౌరవాన్ని పొందారు. మీకు మేధస్సు వుంది. మీకు అన్ని వున్నవి ఈ ఉద్యమాన్ని మీరు అనుసరించండి, హరే కృష్ణ ఉద్యమం, సహనంతో, శ్రద్ధతో మరియు మేధస్సును వుపయోగించి చేపట్టండి. ఇది చాలా సులభం. మీరు ఇప్పటికే అనుభవశాలి అయి వున్నారు దీన్ని ఆపవద్దు. ఇంతకు ఇంతగా వృద్ధి చేయండి మీ దేశం సంతోషంగా ఉంటుంది, మరియు మొత్తం ప్రపంచం సంతోషంగా ఉంటుంది.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: జయ!