TE/Prabhupada 0727 - నేను కృష్ణుడి సేవకుని సేవకుని సేవకుడను

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.28 -- Mayapur, March 6, 1976


భక్తివినోద ఠాకురా ఈ పాటను పాడారు, śarīra avidyā-jāl, jaḍendriya tāhe kāla. Kāla means serpents, kāla-sarpa. కాల-సర్ప, ఇది ఏ సమయంలోనైనా మిమ్మల్ని కరుస్తుంది మరియు మిమ్మల్ని పూర్తి చేస్తుంది. మనము ప్రతి క్షణం కరవబడుతున్నాము. మనము జీవిస్తున్నాము అంటే ఇది కృష్ణుడి కృప . లేకపోతే, మన ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనవి, అవి ఎప్పుడైనా నన్ను ఏ సమయంలోనైనా పతనము చేయగలవు, కాల-సర్ప. అనేక ప్రదేశాలు ఉన్నాయి, kāla-sarpa-paṭalī protkhāta-daṁstrāyate. ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, "అవును, నేను కాల-సర్ప, సర్పంతో చుట్టబడి ఉన్నాను, అది మంచిది; కానీ నేను దంతాలను విరగ్గొట్టగలను. " కానీ కాల-సర్ప ఉంటే... అంటే ఏమిటి? ఆ కోరలు? అవి విచ్ఛిన్నమైతే-అవి తీసివేయబడితే-అవి మరింత ప్రమాదకరమైనవి కావు. ప్రమాదకరమైనవి. ఎంత కాలము వాటికి కోరలు ఉంటాయో, అవి అప్పటివరకు ప్రమాదకరమైనవి కాబట్టి protkhāta-daṁstrāyate. శ్రీ ప్రభోదానంద సరస్వతి చెప్తారు, kāla-sarpa-paṭalī protkhāta-daṁstrāyate (Caitanya-candrāmṛta 5): అవును, నేను నా కాల-సర్పాలను కలిగి ఉన్నాను, కానీ చైతన్య మహా ప్రభు యొక్క దయ వలన నేను కోరలు పీకేసినాను, అందువల్ల ఇంక ఏ మాత్రము భయము లేదు. " ఎలా సాధ్యమవుతుంది? చైతన్య మహా ప్రభు యొక్క దయ వలన అది సాధ్యమే. ఉదాహరణకు మీరు కోరలు పీకి వేయడము వలన ... నిపుణుడైన పాములను పట్టే వారు ఉన్నారు ఎందుకంటే ఈ విషం కొన్ని ఔషధ ప్రయోజనాలకు అవసరమవుతుంది, కాబట్టి వారు వాటిని తీస్తారు. అప్పుడు అది పనికిరాదు. కానీ అవి మళ్ళీ పెరుగుతాయి. పాము శరీరము అలా తయారు చేయబడింది, ఒకసారి మీరు కోరలను పీకేస్తే, అవి మళ్లీ పెరుగుతాయి. ఇక్కడ చెప్పబడింది, ఎలా సాధ్యమవుతుంది? Kāmābhikāmam anu yaḥ prapatan prasaṅgāt. ఒకసారి అది తీసి వేయవచ్చు, కానీ మీకు చెడు సాంగత్యము ఉంటే, అది మళ్ళీ పెరుగుతుంది. కామాభికామము. ఒక కామము, ఒక కామ కోరిక, మరొక కామ కోరికను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధముగా, ఒక దాని తరువాత మరొకటి, ఇది జరుగుతోంది. ఇది మన పునరావృత మవుతున్న జన్మ మరియు మరణానికి ఇది కారణం. Bhūtva bhūtvā pralīyate ( BG 8.19) అందువల్ల, మనము భక్తి స్థితిలో ప్రవేశించాలని కోరుకుంటే, అప్పుడు మనం దానిని విడిచిపెట్టాలి. Anyābhilāṣitā-śūnyam (Brs. 1.1.11). అన్యాభిలాషితా- శూన్యం.

కాబట్టి "ఇది ఎలా సున్నాగా ఉంటుంది? నేను జీవిని, నేను ఎలా సున్నాగా ఉంటాను? నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాను, ప్రణాళిక చేస్తున్నాను. నాకు చాలా కోరికలు ఉన్నాయి." వారు అంటున్నారు... జీవి యొక్క స్థితి ఏమీటో తెలియని వారు, వారు చెప్తున్నారు, ఆ "కోరికలను వదిలెయ్యండి. కోరికలు లేకుండా ఉండండి" అది సాధ్యం కాదు. కోరికలు లేకుండా ఉండటము సాధ్యం కాదు. ఎందుకంటే నేను జీవిని, నేను కోరుకోవాలి. కాబట్టి కోరికలు పవిత్రము చేయబడవచ్చు. అది కావలసినది. మీరు కోరికలను సున్నా చేయలేరు. అది సాధ్యం కాదు. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) ఇప్పుడు మన కోరికలు నేను ఉన్న స్థితి ప్రకారం ఉన్నాయి. నేను హిందువు , "నేను ముస్లిం." "నేను ఎందుకు కృష్ణ చైతన్యమును తీసుకోవాలి?" ఎందుకంటే నేను హోదా కలిగి ఉన్నాను, నేను ఈ హోదాను తీసుకున్నాను, నేను హిందూ, "నేను ముస్లిం," "నేను క్రైస్తవుడు." అందువల్ల మనము కృష్ణ చైతన్యముని తీసుకోలేము. ఓ, ఇదే... కృష్ణుడు హిందూ భగవంతుడు. కృష్ణుడు భారతీయుడు. నేను ఎందుకు కృష్ణుడిని తీసుకోవాలి? లేదు. "మీరు కోరికలేని వారై ఉండాలి" అంటే మీ ఈ తప్పుడు అవగాహనను పరిశుద్ధ పరచుకోవాలి నేను హిందువు, "నేను ముస్లిం" "నేను క్రిస్టియన్," "నేను భారతీయుడను," "ఇది నేను." ఇది పవిత్రము చేయబడాలి. ఒకరు అర్థం చేసుకోవాలి "నేను gopī-bhartur pada-kamalayor dāsa ( CC Madhya 13.80) నేను కృష్ణుడి సేవకుని సేవకుని సేవకుడను. " ఇది పవిత్రత. అప్పుడు కోరిక. అప్పుడు మీరు కృష్ణుడి సేవ తప్ప మరేమీ కోరుకోరు. అది పరిపూర్ణము. మీరు ఆ స్థితికి వచ్చినప్పుడు, మీరు కృష్ణుడిని కాకుండా మరి ఏమీ కోరుకోరు, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు, అప్పుడు మీరు విముక్తి పొందుతారు. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) అప్పుడు మీరు ఏ భౌతిక కోరిక లేకుండా నిర్మలముగా తయారవుతారు. ఆ స్థానములో మాత్రమే, hṛṣīkena hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate. అప్పుడు... నా ఇంద్రియాలు అక్కడ ఉంటాయి; నేను అర్థంలేని చెత్తను అవుతాను అని కాదు. కాదు, నా ఇంద్రియాలు ఉన్నాయి. అవి పని చేస్తాయి. అవి కేవలం కృష్ణుడికి సేవలందించటానికి పనిచేస్తాయి. అది కావలసినది. మీరు కృష్ణుడి యొక్క సేవకుని ద్వారా శిక్షణ పొందినప్పుడు అది సాధ్యం అవుతుంది. లేకపోతే అది సాధ్యం కాదు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయప్రభుపాద. (ముగింపు)