TE/Prabhupada 0062 - మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడుని, అంతర్గతంగా మరియు బాహ్యంగా, చూడగలగితే

Revision as of 18:29, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974

ప్రభుపాద: ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్. మీరు కృష్ణుడిని పూజిస్తే, ఎటువంటి తపస్సు అవసరం లేదు భగవంతుని తెలుసుకోవాలంటే చాలా పద్ధతులు, తపస్సులు ఉన్నాయి. కొన్నిసార్లు మనము భగవంతుడిని, చూడటానికి అడవికి వెళ్లుతాము వివిధ పద్దతులు ఉన్నాయి, కానీ గ్రంథాలలో నిజానికి మీరు కృష్ణుడికి పూజలు చేస్తే ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్, ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్, మీరు తీవ్రముగా తపస్సు చేయవలసిన అవసరం లేదు. మరియు ఆరాధితో, ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్, చివరకు తీవ్రముగా తపస్సు చేసిన తరువాత మీకు కృష్ణుడు అంటే ఎవరో తెలియకపోతే ఏమి ప్రయోజనము ఉంది? ఇది నిరుపయోగం. ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్, అంతర్ బహిర్ యది హరిస్ తపసా తతః కిమ్. అదేవిధముగా, మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడిని, అంతర్గతంగా బాహ్యంగా, చూడగలగితే అది అన్ని తపస్సులకు ముగింపు. కృష్ణుడు మళ్ళీ చెప్తున్నారు, కుంతి చెప్పింది: కృష్ణుడు లోపల బయట, వున్నప్పటికీ మనము అయనని చూడటానికి కళ్ళు కలిగి లేము ఎందుకంటే, "అలక్ష్యం," ఆయన అదృశ్యంగా ఉన్నారు". కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు వున్నట్లు కేవలం ఐదుగురు పాండవుల వారి తల్లి కుంతి, వారు మాత్రమే కృష్ణుడు పురుషోత్తముడు భగవంతుడు అని అర్థం చేసుకున్నారు కొందరు మాత్రమే అర్థము చేసుకున్నారు. కృష్ణుడు వారితో వున్నా, కృష్ణుడిని సాధారణ మానవునిగా తీసుకున్నారు. అవజా..., అవజానన్తి మామ్ మూఢా మానుషీం తనుమాశ్రితమ్. కృష్ణుడు మానవ సమాజము పట్ల చాలా కరుణ కలిగి ఉండుట వలన తను వ్యక్తిగతంగా వచ్చారు ఆయనను, అయనిని చూడటానికి కళ్ళు కలిగి లేకపోవటము వలన, వారు ఆయనను చూడలేకపోయారు. అందువలన కుంతి చెప్తుంది, అలక్ష్యం, "మీరు కనిపించరు. మీరు అంతః బహిః, సర్వ భూతానామ్." అయినప్పటికి అంతః బహిః భక్తులు కానీ వారికి. అందరి హృదయములో కృష్ణుడు కలడు ఈశ్వరః సర్వ భూతానామ్ హృద్ధేశి. చూపెడుతూ అందరి హృదయములో కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు, అందువలన, ధ్యానం, యోగా సిద్ధాంతము ఏమిటంటే హృదయములో కృష్ణుడు ఉన్నాడు అని కనుగొనుట దీనిని ధ్యానం అంటారు కృష్ణుడి స్థానము ఎల్లప్పుడూ దివ్యమైనది.

మనము ఈ ఆధ్యాత్మిక పద్ధతి అయిన ఈ కృష్ణ చైతన్యమును అంగీకరిస్తే కర్తవ్యము విధానాలను పాటిస్తూ పాపాత్మకమైన జీవితమును విడువటకు ప్రయత్నిస్తే, మీరు కృష్ణుడిని చూడలేరు ఎందుకంటే మీరు అన్ని పాపములును చేస్తున్నారు అప్పుడు కృష్ణుడిని చూడటము సాధ్యం కాదు. న మామ్ దుష్క్రితినో మూఢాః ప్రపద్యంతే నరాధమః. ఎవరైతే ఆ దుష్క్రితినః ... కృతి అంటే, ప్రతిభావంతులైన వారు అని అర్థం; వారి ప్రతిభ పాపములను చేయుటకు ఉపయోగించబడుతున్నది. కాబట్టి, అందువలన మనము. అభ్యర్థిస్తాము మనము అడగము. ఇవి మన నియమాలు నియంత్రణలు, ప్రతి ఒక్కరు పాప పనులను చేయరాదు. పాపములను, పాపాత్మకమైన జీవితం యొక్క నాలుగు స్తంభాలు అక్రమ మైథునం, మాంసం తినడము, మత్తు పానీయాలు, జూదం ఉన్నాయి. ఇవి చేస్తే వారు పతనము అవుతారు. కాబట్టి మన విద్యార్థులకు సూచిస్తాము... కాదు, వారు పాటించాలి, లేకుంటే లేకుంటే వారు పతనము అవుతారు. ఒక పాపాత్మకమైన మనిషికి భగవంతుడు అర్థం కాడు ఎందుకంటే. ఒక వైపు, మనము భక్తి యుక్త సేవలో నియమ నిబంధనలను సాధన చేయాలి మనము పాపముల నుండి దూరంగా ఉండాలి మరొక వైపు. అప్పుడు కృష్ణుడు వుంటాడు మనతో. మీరు కృష్ణుడితో మాట్లాడవచ్చు, కృష్ణుడితో ఉండవచ్చు, కృష్ణుడు చాలా కరుణ కలిగినవాడు. కుంతి తన మేనల్లుడు, కృష్ణుడితో మాట్లాడుట వలె అదేవిధముగా, మీరు కృష్ణుడిని మీ కొడుకుగా, మీ భర్తగా అనుకొని మాట్లాడవచ్చు మీ ప్రేమికుడిగా మీ గురువుగా మీ స్నేహితుని వలె, మీ యజమాని వలె, మీరు ఇష్టపడుతున్నట్లుగా.

నేను చికాగో ఆలయం చూడటానికి చాలా సంతోషంగా ఉన్నాను. మీరు చాలా బాగా పాటిస్తున్నారు, మీ హాల్ కూడా చాలా బాగుంది మీ సేవతో ఉన్నత స్థానము వెళ్ళండి. మీరు కృష్ణుని అవగాహన చేసుకుంటారు అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది.

మీకు ధన్యవాదాలు.

భక్తులు: జయ! హరి బోల్!