TE/Prabhupada 0233 - మనము కృష్ణ చైతన్యమును గురువు మరియు కృష్ణుడి కృప ద్వార పొందుతాము

Revision as of 18:55, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

కృష్ణుడికి శత్రువులు ఉన్నారు. ఆరిసుధన. అయిన వారిని చంప వలసి ఉన్నది. కృష్ణుడికి రెండు కార్యకలపాలు ఉన్నాయి : paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtam ( BG 4.8) దుష్టులను ... వారు దుష్టులు. కృష్ణుడిని సవాలు చేసిన రాక్షసులు, కృష్ణుడితో పోటీ పడాలని కోరుకుంటున్నారు, వీరు కృష్ణుడి యొక్క ఆస్తిని పంచుకోవాలనుకుంటున్నారు, వారు కృష్ణుడి శత్రువులు, వారు చంపబడాలి. శత్రువులను చంపడం ఇక్కడ సరి ఆయినది, సాధారణంగా కాదు. తరువాత ప్రశ్న, "సరే, శత్రువులు, మీరు వారిని చంపవచ్చు, ఒప్పుకున్నాము. కానీ నా గురువులను చంపమని మీరు నాకు ఎలా సలహా ఇస్తారు? Gurūn ahatvā. అయితే కృష్ణుడి కోరిక కోసం, అవసరమైతే, మీ గురువును కుడా మీరు చంపవలసి ఉంటుంది. అది తత్వము. కృష్ణుడి కొరకు. కృష్ణుడు కోరుకుంటే, అప్పుడు మీరు చేయకుండా ఉండకుడదు ... మీ గురువుని చంపాలని కృష్ణుడు కోరుకుంటే, అప్పుడు మీరు దాన్ని చేయాలి. ఇది కృష్ణ చైతన్యము. అయితే, కృష్ణుడు గురువుని చంపాలని మిమ్మల్ని అడగడు, కాని ... ఎందుకంటే గురువు కృష్ణుడు ఒక్కరే. Guru-kṛṣṇa-kṛpāya ( CC Madhya 19.151) గురువు కృప ద్వారా మనము కృష్ణ చైతన్యమున్ని,కృష్ణుడిని పొందుతాము వాస్తవమైన గురువుని చంపకుడదు, కానీ గురువు అని పిలవబడే వానిని చంపవచ్చు. నకిలీ గురువుని చంపవచ్చు ప్రహ్లాద మహారాజు లాగే. ప్రహ్లాద మహారాజు ఉండగా ... అయిన నిలబడి ఉన్నాడు. నరసింహ స్వామి తన తండ్రిని చంపుతున్నాడు తండ్రి గురువు. Sarva-devamayo guruḥ ( SB 11.17.27) అదేవిధంగా, తండ్రి కూడా గురువు, కనీసం, అధికారిక గురువు. భౌతికంగా అయిన గురువు. ప్రహ్లాద మహారాజు తన గురువును చంపడానికి నరసింహ స్వామిని ఎందుకు అనుమతించాడు? అయిన తండ్రి. అందరికీ తెలుసు హిరణ్యకశిపుడు తండ్రి అని. మీ తండ్రిని ఎవరైనా వ్యక్తిని హత్య చేస్తుoటే మీరు చూడాలనుకుంటున్నారా మీరు నిలబడి ఉంటారా? మీరు నిరసన తెలపరా? మీ బాధ్యత కాదా? లేదు, అది మీ బాధ్యత. మీ తండ్రి మీద దాడి చేసినప్పుడు, మీరు నిరసన తెలపాలి. కనీసం, మీరు చేయలేకపోతే, మీరు పోరాడాలి. మొదట మీరు మీ జీవితాన్ని పణముగా పెట్టాలి: ఎలా , నా తండ్రి నా ముందు చంపబడ్డాడు? అది మన బాధ్యత. కానీ ప్రహ్లాద మహారాజు నిరసన వ్యక్తం చేయలేదు. అయిన అభ్యర్థించి ఉండవచ్చు - అయిన భక్తుడు - "నా ప్రియమైన సర్, ప్రభు, నా భగవంతుడా, మీరు నా తండ్రిని మన్నించ్చండి." అయిన చేశాడు. కానీ అయినకు తెలుసు "నా తండ్రి చంపబడటం లేదు, నా తండ్రి యొక్క శరీరం చంపబడుతుంది." తరువాత అయిన తన తండ్రి కోసము వేరొక విధంగా వేడుకున్నాడు. మొదట, నరసింహస్వామి కోపంగా ఉన్నప్పుడు, అయిన శరీరమును చంపుతున్నాడు, అయినకు తెలుసు " నా తండ్రి శరీరం కాదు, ఆత్మ నా తండ్రి. నా తండ్రి శరీరమును చంపి భగవంతుడు తనకు తాను సంతృప్తి పరుచు కొనిస్తాను తరువాత నేను నా తండ్రిని రక్షిస్తాను. "