TE/Prabhupada 0292 - మీ జ్ఞానం ద్వారా ప్రయత్నిస్తూ, మీరు దేవాదిదేవుడిని కనుగొంటే, అది మీ పరిపూర్ణత్వము

Revision as of 07:12, 20 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0292 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 4, 1968


ప్రభుపాద: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi భక్త్లులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ప్రభుపాద: ఎవరైనా అయినకి సహాయం చేస్తున్నారా? అవును, అది అన్నీ ... అసలైన వ్యక్తిని పట్టుకోవడంలో మనకు ఆసక్తి ఉంది. (నవ్వులు) మనకు ఏ విధమైన సేవకుని కొరకు ఆసక్తి లేదు. Govindam ādi-puruṣaṁ కానీ అసలైన వ్యక్తిని పట్టుకుoటే, అయిన ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు. అదే ఉదాహరణ లాగానే. వేదాలలో చెప్పబడినది. ఉపనిషత్లో ఇలా ఉంది: yasmin vijñāte sarvam evaṁ vijñātaṁ bhavanti మీరు భగవంతుడు లేదా సంపూర్ణ నిజoను అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. విడిగా అర్ధము చేసుకోవడానికి అవసరం లేదు. yasmin vijñāte sarvam evaṁ vijñātaṁ bhavanti. అదేవిధంగా, భగవద్గీతలో కూడా చెప్పబడింది,

yaṁ labdhvā cāparaṁ lābhaṁ
manyate nādhikaṁ tataḥ
yasmin sthito na duḥkhena
guruṇāpi vicālyate
(BG 6.20-23)

ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ, జీవితంలో కొన్ని ప్రమాణాల కోరకు శోధిస్తున్నాము, దానిపై మనకు ఆందోళన ఉండదు. అది ప్రతి ఒక్కరి లక్ష్యం. ఎందుకు మనము పోరాడుతున్నాం? మనము ఒక నిర్దిష్ట అంశాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. ఉదాహరణకు రెండు పక్షములు ఫుట్బాల్ ఆడటము వలె , వారు, వారిలో ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆది విజయము అవ్వుతుంది. ప్రతి ఒక్కరూ ఏదో పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, వివిధ స్థాయిల ప్రకారం, వివిధ ఆలోచనల ప్రకారం. ప్రతి ఒక్కరూ అదే విషయము కొరకు శోధించడం లేదు. కొంతమంది బౌతిక ఆనందం కోరకు వేదుకుతున్నారు, కొంతమంది మత్తు కోరకు వేదుకుతున్నారు, కొంతమంది సెక్స్ కోసము వేదుకుతున్నారు, కొంతమంది డబ్బు కోసము వేదుకుతున్నారు. కొంతమంది జ్ఞానం కోసము వేదుకుతున్నారు, కొంతమంది చాలా విషయాలు కోసము వేదుకుతున్నారు. కానీ, ఒక విషయము ఉంది. మనము దానిని పొందితే , ఆ పరిపూర్ణమును సాధిస్తే, అప్పుడు మనము సంతృప్తి చెందుతాము. "మనకు ఏమి అవసరము లేదు " అని మనము చెప్పుతాము. Svāmin kṛtārtho 'smi varaṁ na yāce ( CC Madhya 22.42) అనేక సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇలా ఉంది, ఇది కృష్ణుడు. మీరు కేవలము కృష్ణుడిని అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మీ జ్ఞానం ఖచ్చితమైనది, మీరు ప్రతి దానిని అర్థం చేసుకుంటారు. మీరు శాస్త్రమును అర్థం చేసుకుంటారు, మీరు గణితమును అర్థం చేసుకుంటారు, మీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్ ను అర్థం చేసుకుంటారు ఖగోళశాస్త్రం, తత్వము, సాహిత్యం, ప్రతిదీ. ఇది చాలా బాగుంది. భాగావతము అందువలన చెప్తూతుంది saṁsiddhir hari-toṣaṇam ( SB 1.2.13) మీరు ఏ విజ్ఞాన విభాగములో లేదా మీరు ఏ పనులను నిర్వర్తించాలో, అది మీకు పట్టింపు లేదు. మీరు మీ జ్ఞానం ద్వారా ప్రయత్నిస్తూ మీరు దేవాదిదేవుడిని కనుగొంటే, అది మీ పరిపూర్ణత్వము. మీరు ఒక శాస్త్రవేత్త, అది సరే, అది పట్టింపు లేదు. మీ శాస్త్రీయ పరిశోధన ద్వారా మీరు దేవదిదేవుడిని కనుగొంటే. అప్పుడు అది మీ పరిపూర్ణత్వము. నీవు వ్యాపారవేత్తవా? . మీ డబ్బుతో దేవాదిదేవుడిని కనుగొనoడి. మీరు ప్రేమిస్తున్నారా? కేవలము మహోన్నతమైన ప్రేమికుడిని కనుగొనండి. మీరు రుచి, సౌందర్యము లేదా తర్వాత ... నాస్తికుడు కాదు - సౌందర్య భావన, రుచి, అందం, మీరు మహోన్నతమైన వాడిని కనుగొంటే, అందం కోరకు మీ శోధన పరిపూర్ణమవుతుంది. ప్రతిదీ. కృష్ణుడు, అది కృష్ణుడు. కృష్ణుడు అంటే అoదరికి ఆకర్షణీయమైనవాడు. మీరు దేని కోరకో శోధిస్తున్నారు. మీరు కృష్ణుడిని కనుగొంటే, మీరు అవును అంటారు , మీ లక్ష్యం సాధిస్తారు. అందువలన అయిన నామము కృష్ణుడు.