TE/Prabhupada 0421 - మహా మంత్రం జపించేటప్పుడునివారించవలసిన పది అపరాధములు(ఒకటి నుండి అయిదు వరకు)

Revision as of 19:26, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture & Initiation -- Seattle, October 20, 1968


మధుద్విస: శ్రీల ప్రభుపాద ? నేను పది అపరాధములను చదవవచ్చా?

ప్రభుపాద: సరే. మధుద్విస : ఇవి మన దగ్గర ఉన్నవి .

ప్రభుపాద: అవును , చదవండి

మధుద్విస: మహా మంత్రం జపించేటప్పుడు నివారించవలసిన పది అపరాధములు .మొదటిది: భగవంతుని యొక్క భక్తుని దూషించటం

ప్రభుపాద : ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుని యొక్క ఏ భక్తుడినైనను దూషణ చేయకూడదు, ఏ దేశములో అయినా ఇది పట్టింపు లేదు ఉదాహరణకు జీసస్ క్రైస్ట్ లాగే, అతను ఒక గొప్ప భక్తుడు మరియు మహమ్మద్ కూడా, అతడు కూడా ఒక భక్తుడు ఇది అలా కాదు మనం ఒక్కరమే భక్తులము వారు భక్తులు కారు అని ఆలోచించ వద్దు. దేవుని దివ్యమైన మహిమలను ప్రచారము చేసే వారు ఎవరైనను , అతడు ఒక భక్తుడు. అతన్ని దూషించకూడదు .మీరు జాగ్రత్తగా ఉండాలి. తరువాత?

మధుద్విస: రెండవది దేవతలను భగవంతుడిని ఒకే స్థాయిలో పరిగణించటం లేక చాలా మంది భగవంతులు ఉన్నారని అనుకోవటము

ప్రభుపాద: అవును అలా అనేకమైన అర్థంలేని విషయాలున్నాయి వారు అంటారు ఉప దేవతలు నిజమే, మీకు ఇతర దేవతలతో ఎటువంటి వ్యవహారములు లేవు అనేక వేద శాస్త్రాలలో వందల వేల మంది దేవతలు ఉన్నారు . ప్రత్యేకంగా మనము కృష్ణుడిని పూజించినా లేదా శివుడిని లేదా కాళీ మాతాను ఒక్కటే అని జరుగుతుంది ఇది అర్థం లేనిది . మీరు వారందరినీ దేవదేవుని తో సమానస్థాయిలో చూడకూడదు. ఎవరూ భగవంతుని కంటే ఎక్కువ కాదు భగవంతునితో ఎవరూ సమానం కాదు ఈ సమానత్వమును మానాలి. ఆ తర్వాత?

మధుద్విస: " మూడవది: ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయడం".

ప్రభుపాద: అవును ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞలను ఎప్పటికీ మీ జీవిత లక్ష్యముగా తీసుకోవాలి అప్పుడే ప్రతీది స్పష్టంగా ఉంటుంది. ఆ తర్వాత,

మధుద్విస: " నాల్గవది : వేదాల యొక్క ప్రామాణికాన్ని తగ్గించటం

ప్రభుపాద: అవును ఎవరు కూడా వేదాల యొక్క ప్రామాణికాన్ని తగ్గించకూడదు. ఇది కూడా అపరాధం .ఆ తర్వాత ,

మధుద్విస: " అయిదవది : “ దేవుని యొక్క పవిత్ర పేర్లను మనకు తోచిన విధంగా వివరించటం .

ప్రభుపాద: అవును , ఈ రోజు మనము హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నట్లుగా ఇంకో రోజు వేరే అబ్బాయిని, ఒక ప్రతీక . ఇది ప్రతీకగా కాదు .మనం కృష్ణుణ్ణి కీర్తిస్తున్నాము "కృష్ణ" ఆయనతో మాట్లాడుతున్నాము. హరే అంటే కృష్ణుని శక్తిని తలచటం, మనం ప్రార్థిస్తున్నాము, ఏమంటే దయచేసి నన్ను కూడా మీ సేవలో పాల్గొనేలా చేయండి .అదే హరే కృష్ణ .ఇంకా ఇతర వివరణలు ఏమీ లేవు . హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఒకే ఒక్క ప్రార్థన “ ఓ భగవంతుని యొక్క శక్తి, ఓ కృష్ణా, రామా నన్ను మీ సేవలో నిమగ్నం చేయండి . ఇంక ఏ వివరణ లేదు