TE/Prabhupada 0507 - కాబట్టి మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా, మీరు లెక్కించలేరు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0507 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(No difference)

Revision as of 09:23, 25 April 2018



Lecture on BG 2.18 -- London, August 24, 1973


ఇప్పుడు ఒక్కరోజు లెక్కించడం ద్వారా మీరు బ్రహ్మ యొక్క వయస్సు ఎంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ సహస్ర౼యుగ, మనకు నాలుగు యుగాలు ఉన్నాయి, సత్య, త్రేతా, ద్వాపర, కలి ఇవి నాలుగు.... ఈ లెక్కింపు నలభై-మూడు వందల వేల సంవత్సరాలు. ఇది నాలుగు యుగాల సంపూర్ణ మొత్తం. పద్దెనిమిది, పన్నెండు, ఎనిమిది, నాలుగు.ఎంత వస్తుంది? పద్దెనిమిది మరియు పన్నెండు? ముప్పై. ఆ పై ఎనిమిది, ముప్పై ఎనిమిది, తర్వాత నాలుగు. ఇది కఠినమైన  లెక్క. నలభై౼రెండు, నలభై౼మూడు. సహస్ర౼యుగ౼పర్యంతం. కాబట్టి చాలా సంవత్సరాలు, సహస్ర౼యుగ౼పర్యంతం అహః అహః అంటే రోజు. సహస్ర౼యుగ౼పర్యంతం అహర్ యద్ బ్రహ్మణో విదుః ( BG 8.17) ఇది బ్రహ్మ యొక్క ఒక రోజు. ఒకరోజు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. నలబై౼మూడు వందల వేల సంవత్సరాల మీ లెక్కింపు. అందువల్ల ఈ విషయాలను శాస్త్రము ద్వారా అర్థం చేసుకోవాలి. లేకపోతే, మీకు జ్ఞానము లేదు. మీరు లెక్కించలేరు. మీరు బ్రహ్మ వద్దకు వెళ్లలేరు, మీరు చంద్రుని గ్రహానికి కూడా వెళ్లలేరు. అత్యున్నతమైన బ్రహ్మలోకము గురించి మాట్లాడునది ఏముంది, ఈ విశ్వము యొక్క చివరి భాగము. కాబట్టి మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా, మీరు లెక్కించలేరు, మీరు వెళ్లలేరు. వారి అంచనా, ఆధునిక ఏరోనాటిక్స్, వారి అంచనా, అత్యున్నత లోకమునకు వెళ్ళడానికి, నలభై వేల సంవత్సరాలు అవసరం. కాంతి వేగముతో వెళ్లడం ద్వారా. ఉదాహరణకు కాంతి వేగముతో , మనకు లెక్క ఉంది.

కాబట్టి మనము ఈ భౌతిక ప్రపంచంలో కూడా అంచనా వేయలేము ప్రత్యక్ష అవగాహన ద్వారా , ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏమి మాట్లాడగలము. కాదు.... పంథాస్తు కోటి౼శత౼వత్సర౼సంప్రగమ్యో వాయోర్ అథాపి మనసో ముని ౼ పుంగవానాం (BS.5.34). మానసికంగా, ముని౼పుంగా అంటే మానసిక కల్పన. మీరు మానసికంగా ఊహించవచ్చు, కానీ మీరు అనేక వందల వేల సంవత్సరాలు చేసినా కూడా, లెక్కించేందుకు సాధ్యం కాదు. మీరు శాస్త్రం ద్వారా ఈ సత్యాన్ని అంగీకరించాలి, లేకుంటే అది సాధ్యం కాదు. అందువల్ల కృష్ణుడు చెప్పారు, నిత్య స్యోక్తాః శరీర్౼ఉక్త. ఉక్త అంటే చెప్పబడింది అని అర్థం. ఆయన అలా చేయగలిగినప్పటికీ, "నేను ఏదో ఒక సిధ్ధాంతమును వివరిస్తున్నాను," అని కాదు. ఆయన దేవాదిదేవుడు. ఇది పద్ధతి. ఉక్త లేనిదే, ప్రామాణికులు, మునుపటి ప్రామాణికులు, ఆచార్యులు,  మీరు ఏమి చెప్పలేరు. దీనిని పరంపర అని పిలుస్తారు. మీరు మీ బుద్ధితో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ మీరు ఏదైనా అదనంగా లేదా మార్పు చేయలేరు. అది సాధ్యం కాదు. అందువల్ల దీనిని నిత్యస్యోక్తాః అని పిలుస్తారు. ఇది చెప్పబడింది, ఇది ఇప్పటికే స్థిరపడింది. మీరు వాదించలేరు. నిత్యస్యోక్తాః శరీరినః అనాసినో ప్రమేయస్య ( BG 2.18)   అపరిమితమైనది.