TE/Prabhupada 0554 - మనము ఈ మాయా ప్రపంచంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉన్నాము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0554 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0553 - Vous n’avez pas besoin de vous rendre dans les Himalayas. Restez dans la ville de Los Angeles|0553|FR/Prabhupada 0555 - Endormi pour ce qui est des sujets spirituels|0555}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0553 - మీరు హిమాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు.మీరు లాస్ ఏంజిల్స్ నగరంలోనే ఉండండి|0553|TE/Prabhupada 0555 - భౌతిక వ్యక్తులు, వారు ఆధ్యాత్మిక అవగాహన విషయములో నిద్రిస్తున్నారు|0555}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|v7h4ll804Wo|మనము ఈ మాయా ప్రపంచంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉన్నాము  <br />- Prabhupāda 0554}}
{{youtube_right|pFnbzaqzSOQ|మనము ఈ మాయా ప్రపంచంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉన్నాము  <br />- Prabhupāda 0554}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


తమాల కృష్ణ: 67: "నీటిలో ఉన్న పడవ బలమైన గాలిచేత త్రోసి వేయబడినట్లుగా అయినప్పటికీ, మనస్సు ఇంద్రియాలలో ఒక దానిపై స్థిరంగా ఉంటే మనిషి యొక్క బుద్ధిని తీసుకువెళుతుంది. "

ప్రభుపాద: అవును. మీరు. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రంపై మీరు ఒక పడవలో ఉంటే లేదా ఒక చక్కని సీటులో, కానీ మీరు ఏ నియంత్రణ సామర్థ్యం కలిగి లేకుండా ఉంటే, ఆ పసిఫిక్ మహా సముద్రం యొక్క ఒక అల వెంటనే సముద్రపు అడుగుభాగంలోకి తీసుకు వెళ్ళుతుంది. కాబట్టి ఇది అవసరం. మనము ఈ మాయా ప్రపంచంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉన్నాము. సంసార- సముద్ర . దీనిని సముద్ర అని పిలుస్తారు. మనకు ఎటువంటి నియంత్రణా శక్తి లేనప్పుడు ఏ సమయంలో అయినా మన పడవ తిరగబడుతుంది. అవును.

తమాల కృష్ణ : 68: "అందువల్ల, శక్తివంతమైన భుజములను కలిగిన వాడా, ఒకరు తమ ఇంద్రియాలను తమ ఇంద్రియ వస్తువుల నుండి అణిచిపెట్టి ఉంచేవారు పరిపూర్ణంగా స్థిరమైన బుద్ధి కలిగి ఉంటారు. "

ప్రభుపాద: అవును. ఇప్పుడు, ఎవరి ఇంద్రియాలు అణచి పెట్టి ఉంటాయో... ఈ మానవ జీవితం ఇంద్రియాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది. తపః. దీనిని తపస్యా, తపస్సు అంటారు. ఉదాహరణకు నేను ఏదో ఒక రకమైన ఇంద్రియలకు నేను అలవాటు పడితే. ఇప్పుడు, నేను కృష్ణ చైతన్యముని తీసుకుంటాను. నా ఆధ్యాత్మిక గురువు లేదా గ్రంథం ఇలా చెబుతోంది, "దీన్ని చేయవద్దు." కాబట్టి ప్రారంభంలో, నేను కొంత అసౌకర్యం అనుభవిస్తాను, కానీ మీరు తట్టుకోగలిగితే, అది తపస్యా. అది తపస్యా. తపస్య అంటే నేను కొంత అసౌకర్యం, శారీరకంగా అనుభూతి చెందుతున్నాను, కానీ నేను తట్టుకుంటున్నాను. అది తపస్యా అని పిలువబడుతుంది. ఈ మానవ రూపం ఆ తపస్సు కొరకు ఉద్దేశించబడింది. అంతే కాని నా ఇంద్రియాలు ఈ సంతృప్తి కోరుతున్నాయి కనుక, నేను వెంటనే అర్పిస్తాను. కాదు నేను నాకుగా శిక్షణ పొందుతాను. నా ఇంద్రియాలు కోరవచ్చు, నా ప్రియమైన అయ్యా, ఈ సదుపాయాన్ని నాకు ఇవ్వండి, నేను చెప్తాను, "లేదు మీరు పొందలేరు." దీనిని గోస్వామి లేదా స్వామి అని పిలుస్తారు. ప్రస్తుతం, ప్రతి ఒక్కరూ, మనము, మనము మన స్వామిని లేదా ఇంద్రియాల గురువు అయినాము. వాస్తవానికి మీరు ఇంద్రియాలకు గురువు అయితే అప్పుడు మీరు స్వామి లేదా గోస్వామి. అది స్వామి లేదా గోస్వామి యొక్క ప్రాముఖ్యత. దుస్తులు ప్రాముఖ్యము కాదు. నియంత్రించే శక్తి కలిగి ఉన్న వ్యక్తి, ఇంద్రియాలచే నిర్దేశింపబడనివాడు, ఇంద్రియాలకు సేవకుడు కానివాడు . నా నాలుక నిర్దేశిస్తోంది, "దయచేసి ఆ రెస్టారెంట్కు తీసుకెళ్ళండి మాంసము ముక్కలను తినండి." ఆ స్టీక్ అంటే ఏమిటి? స్టీక్స్?

భక్తుడు: స్టీక్.

ప్రభుపాద: స్టీక్? స్పెల్లింగ్ ఏమిటి?

భక్తుడు: S-t-e-a-k.

ప్రభుపాద: ఏమైనప్పటికీ... లేదా వేయించిన కోడి మాంసము. అవును. కాబట్టి నాలుక నాకు నిర్దేశిస్తోంది. కాని మీ నాలుకను మీరు నియంత్రిస్తే, "లేదు. నేను మీకు తీపి గూలాబ్ జామును ఇస్తాను. అక్కడకు వెళ్లవద్దు."(నవ్వు) అప్పుడు మీరు ఇంద్రియాలకు గురువు అవుతారు. మీరు చూడండి? ఇతరులు ప్రయత్నిస్తున్నారు "అక్కడకు వెళ్ళవద్దు," అని చెప్పడము మాత్రమే. అది అసాధ్యం. నాలుకకు రుచికరమైనది ఏదో ఉండాలి. లేకపోతే అది సాధ్యం కాదు. ఇది కృత్రిమమైనది. అయితే నాలుక, మీరు ఈ వేయించిన కోడి మాంసమును లేదా స్టీక్ లేదా ఇది లేదా అది వాటి కన్నా చాలా రుచికరమైనది ఏదైనా ఇవ్వండి, అది ఆగిపోతుంది. అది విధానం. మన విధానం అది. పాలమీగడతో తయారు చేసిన అన్నమును మనము ఇవ్వవచ్చు. ఎంత బాగుంటుంది. ఆయన మాంసం-తినడం మరచిపోతాడు. కాబట్టి ఇది విధానం, కృష్ణ చైతన్యము. అన్ని ఇంద్రియాలకు దేనినైన సరఫరా చేయాలి. కృత్రిమంగా దానిని ఆపదు. అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. ఇతరులు, వారు కేవలం ఇంద్రియాల పనిని ఆపడానికి కృత్రిమంగా ప్రయత్నిస్తున్నారు. లేదు. అది సాధ్యం కాదు.