TE/Prabhupada 0560 - ఒక వ్యక్తి నైతిక ప్రవర్తనను అంగీకరించితే తప్ప, మేము అతనికి దీక్షను ఇవ్వము

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి:... కాస్మిక్ స్టార్ మరియు మనము కేవలం జనవరి పేరును మార్చాము, మొదటి సంచిక. కేవలం మొట్టమొదటి సంచికను మాత్రమే, సరే, అది ప్రచురించబడినది, ఈ రోజు ప్రింటర్ నుండి వస్తుంది.

ప్రభుపాద: ప్రతి నెలా ప్రచురించబడుతుందా?

విలేఖరి: ప్రతి నెలా, అది సరైనది, అది సరైనది, అవును. మేము తూర్పు ధర్మములను గురించి రాస్తాము. బిషప్ జేమ్స్ పైక్, UFOs, జ్యోతిష్యంపై ఈ నెల ఒక ఫీచర్ వ్యాసం రాసినాము. మీకు డాక్టర్ బోడే తెలుసా, Frambose Bode... ఆయన మన్లీ హాల్ తో ఉన్నాడు. మన్లీ హాల్ గురించి మీకు తెలుసా? ప్రభుపాద: లేదు.

విలేఖరి: మీకు ఫ్రాంబోస్ బోడ్ తెలియదా?

ప్రభుపాద: లేదు.

విలేఖరి: ఆయన భారతదేశం నుండి వచ్చినారు. పార్సీ.

ప్రభుపాద: అవునా. పార్సీ, అవును.

విలేఖరి: ఆయన వచ్చే నెలలో మాకు ఒక వ్యాసం రాస్తాడు. కానీ నేను డాన్తో మాట్లాడాను నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న విషయాలు ఒకటి అతనికి చెప్పాను, నేను మా పాఠకులలో చాలా మంది, యునైటెడ్ స్టేట్స్ కి చెందినవారు చాలా మంది ఉన్నారు వారు భయంకరంగా గందరగోళముగా ఉన్నారు. చాలా మంది అవతారములు అని అని చెప్పుకుంటున్నారు భారతదేశం నుండి ఈ దేశానికి వచ్చిన వారు ఎవరైనా, ఒకరి తరువాత ఒకరు, తరువాత మరొకరు, వారు చెప్తారు...

ప్రభుపాద: నేను ప్రకటించగలను, వారు అందరు చెత్త అని.

విలేఖరి: అది ఏమిటి... నేను అడగాలనుకుంటున్నాను... మీరు ఇంకొంచం ఎక్కువ వివరించగలరా.

ప్రభుపాద: నేను ఇంకా చెప్పగలను, వారు అందరు దుష్టులు, మూర్ఖులు

విలేఖరి: ఉదాహరణకు మహర్షి...

ప్రభుపాద: ఆయన మూర్ఖులలో మొదటి వాడు. నేను బహిరంగంగా చెప్తాను.

విలేఖరి: మీరు దానిని వివరించగలరా, నాకు కొంచెము నేపధ్యము ఇవ్వండి దాని మీద , ఎందుకు, ఎందుకంటే మా పాఠకులు...

ప్రభుపాద: నాకు తెలియదు, కానీ ఆయన ప్రవర్తన నుండి నేను ఆయన దుష్టులలో మొదటి వాడు అని అర్థం చేసుకోగలను. నేను ఆయన గురించి తెలుసుకోవాలని అనుకోవడము లేదు, కానీ ఆయన చేసినది ఏమి... కానీ అద్భుతమైన విషయము ఏమిటంటే పశ్చిమ దేశాలలో ప్రజలు, వారు అధునాతనంగా ఉండాల్సింది. వారు ఈ మూర్ఖులచే ఎలా మోసగించ బడుతున్నారు?

విలేఖరి: సరే, నేను అనుకుంటున్నాను ప్రజలు వారు నమ్మాలి అనుకున్న దానిని వారు నమ్ముతారు. వారు దేని కోసమో చూస్తున్నారు, ఆయన ఆ దారిలో వస్తున్నాడు...

ప్రభుపాద: అవును. కానీ వారికి చాలా చౌకగా ఏదో కావాలి. అది వారి తప్పు.

విలేఖరి: అవును.

ప్రభుపాద: ఇప్పుడు మా శిష్యులకు, మేము చౌకైనది ఇవ్వము. మా మొదటి షరతు వారి ప్రవర్తన, , నైతిక ప్రవర్తన. మీరు చూడండి? కాబట్టి ఒక వ్యక్తి నైతిక ప్రవర్తనను అంగీకరించకపోతే తప్ప, మేము అతనికి దీక్షను ఇవ్వము ఈ సంస్థలో అతన్ని అనుమతించము. ఈ మహర్షి, "ఓ, నీవు ఇష్టపడేది నీవు ఏమైనా చేయవచ్చు అని చెప్తున్నాడు మీరు కేవలం నాకు ముప్పై ఐదు డాలర్లు చెల్లించాలి నేను మీకు ఏదో ఒక మంత్రం ఇస్తాను. " మీరు చూడండి. కాబట్టి ప్రజలు మోసం చేయాబడాలని కోరుకున్నారు, కావున చాలా మంది మోసగాళ్లు వచ్చారు. వారు ఏ విధమైన క్రమశిక్షణ విధానాన్ని పాటించాలని కోరుకోరు, మీరు చూడండి? ఏది ఏమైనా. వారికి డబ్బు ఉంది. వారు "నేను చెల్లిస్తాను" అని అనుకుంటారు. వెంటనే ఆయన డబ్బు పొందుతాడు.

విలేఖరి: తక్షణ స్వర్గం. ప్రభుపాద: అవును. అది వారి పరిస్థితి. ఉదాహరణకు ప్రజలు చంద్ర లోకము వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుగా. నేను నా అభిప్రాయం ఇచ్చాను. మీరు లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో చూసినారా? ఈ అవకాశం చాలా అరుదు.

విలేఖరి: ఓ? ప్రభుపాద: అవును. ఎందుకు కాదు? ఉదాహరణకు మీ దేశంలో, ఇమ్మిగ్రేషన్ కోసం మీకు కొంత కోటా ఉంది ఈ లోకము లోపలకు, ఎవరైనా వస్తే, మీ ఇమ్మిగ్రేషన్ విభాగం యొక్క ఆజ్ఞ లేకుండా, ఎవరూ ప్రవేశించలేరు. ప్రజలు మరింత అధునాతనంగా ఉన్న ఆ లోకములోకి మీరు ఎలా ఆశించగలరు, వారిని దేవతలు అని పిలుస్తారు, వారు పది వేల సంవత్సరాల పాటు జీవిస్తున్నారు, మీరు వెళ్లి, వెంటనే చంద్ర గ్రహాములోనికి ప్రవేశించగలరు అని ఆశించగలరా? వారు టికెట్లు అమ్ముతారు, రిజర్వేషన్లు. మీరు చూడండి? ప్రతిదీ, వారు అపహాస్యము చేస్తారు