TE/Prabhupada 0664 - ఈ శూన్య తత్వము మరో భ్రమ. శూన్యము అనేది ఉండదు

Revision as of 16:55, 24 January 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0664 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: భగవద్..... “భౌతిక జీవితం యొక్క విరమణ అంటే శూన్య జీవితములోనికి ప్రవేశిస్తాము అని కాదు, ఇది కేవలం ఒక అపోహ”.

ప్రభుపాద: అవును. కాబట్టి భౌతిక జీవితమును నిలిపివేయడం శూన్యం కాదు. ఎందుకంటే నేను శూన్యము కాదు. నేను ఆత్మను. నేను శూన్యమైతే, నా శరీరం ఎలా అభివృద్ధి చెందింది? నేను శూన్యము కాదు. నేను విత్తనం. నేలమీద విత్తనాన్ని నాటినట్లుగా, అది గొప్ప వృక్షము లేదా మొక్కగా పెరుగుతుంది. అదే విధముగా తల్లి యొక్క గర్భంలో తండ్రి ద్వారా విత్తనం ఇవ్వబడుతుంది. అది వృక్షములా పెరుగుతుంది. ఈ శరీరం ఉంది. శూన్యం ఎక్కడ ఉంది? Aham bija-pradah pita ( BG 14.4) పదునాల్గవ అధ్యాయంలో మీరు చూస్తారు, వాస్తవానికి ఆ విత్తనం కృష్ణునిచే ఇవ్వబడింది. ఈ భౌతిక ప్రకృతి గర్భంలో, అనేక జీవరాశులు బయటకు వస్తున్నాయి. మీరు దీనికి వ్యతిరేకంగా వాదించలేరు, ఎందుకంటే వాస్తవానికి మన ఆచరణాత్మక జీవితంలో అదే పద్ధతిలో జరుగుతూ వుంటుంది. మనము చూస్తాము తండ్రి తల్లి గర్భంలోకి విత్తనము ఇస్తాడు, ఇంక తల్లి, నేను చెప్పేది ఏమిటంటే, పిల్లవాడు శరీరం పెంచుకోవటానికి పోషణ ఇస్తుంది. కాబట్టి శూన్యమనే ప్రశ్నే లేదు. విత్తనము శూన్యము అయితే, ఇంత చక్కని శరీరం ఎలా అభివృద్ధి చెందింది? కాబట్టి నిర్వాణం అంటే ఇంక ఎటువంటి భౌతిక శరీరాన్ని అంగీకరించకపోవటం. ఇది శూన్యపరచటానికి ప్రయత్నించకండి. అది మరొక అర్థం లేనిది. శూన్యము, మీరు శూన్యము కాదు. శూన్యము అంటే ఈ భౌతిక శరీరాన్ని రద్దు చేయటం అని అర్థం. ఈ పూర్తి బాధాకరమైన నియంత్రించబడిన శరీరం. మీ ఆధ్యాత్మిక శరీరం పెంచుకోవటానికి ప్రయత్నించండి. అది సాధ్యమే. yad gatva na nivartante tad dhama paramam mama ( BG 15.6) ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోవాలంటే చాలా తెలివైన వారిగా అవ్వాలి, జీవితం యొక్క సమస్య ఏమిటి, ఏమి, మనము ఈ విలువైన మానవ రూపం ఎలా ఉపయోగించుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ విద్య ప్రపంచవ్యాప్తంగా ఆచరణాత్మకంగా లేదు. బహుశా ఇది జీవితంలోని వాస్తవ సమస్యలను, జీవిత వాస్తవిక విలువను ప్రచారము చేస్తున్న ఏకైక సంస్థ ఇది ఒక్కటి మాత్రమే. ఈ కృష్ణచైతన్య ఉద్యమం. కొనసాగించు.

తమాల కృష్ణ: భగవంతుని సృష్టిలో ఎక్కడా శూన్యము లేదు. అయితే భౌతికము యొక్క విరమణ...

ప్రభుపాద: శూన్యము, నీవు ఎక్కడ చూసినా, భూమిలోనైనా, భూమి లోపల, నీవు శూన్యము చూడలేవు. భూమి మీద, శూన్యము లేదు; ఆకాశంలో, శూన్యము లేదు; గాలిలో, శూన్యము లేదు; నీటిలో, శూన్యము లేదు; అగ్నిలో, శూన్యము లేదు - అప్పుడు మీరు శూన్యమును ఎక్కడ కనుగొంటారు? మీరు శూన్యమును ఎక్కడ కనుగొంటారు? ఈ శూన్య తత్వము మరో భ్రమ. శూన్యము అనేది ఉండదు.