TE/Prabhupada 0734 - మాట్లాడలేని వ్యక్తి. ఆయన ఒక గొప్ప లెక్చరర్ లేదా వక్త అవుతాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0734 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Bombay]]
[[Category:TE-Quotes - in India, Bombay]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0733 - Le temps est tellement précieux, même si vouz payez des milliards de pièces d'or, vous ne pouvez pas retrouver un seul moment|0733|FR/Prabhupada 0735 - On est tellement insensés qu'on ne crois pas à la prochaine vie|0735}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0733 - సమయం చాలా విలువైనది. లక్షల బంగారు నాణేలను చెల్లించినా ఒక్క క్షణమును తిరిగి పొందలేరు|0733|TE/Prabhupada 0735 - మనము ఎంతో మూర్ఖంగా ఉన్నాము కావున మనం తరువాతి జీవితము మీద నమ్మకము కలిగిలేము|0735}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|zUGz4jVjWfk|మాట్లాడలేని వ్యక్తి. ఆయన ఒక గొప్ప లెక్చరర్ లేదా వక్త అవుతాడు  <br />- Prabhupāda 0734}}
{{youtube_right|0NBPd_COnP4|మాట్లాడలేని వ్యక్తి. ఆయన ఒక గొప్ప లెక్చరర్ లేదా వక్త అవుతాడు  <br />- Prabhupāda 0734}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



Lecture on SB 7.7.19-20 -- Bombay, March 18, 1971


ఇక్కడ సాంఖ్య తత్వము ఉంది, వర్ణన సాంఖ్య తత్వము. ఇరవై నాలుగు మూలకాలు, ఇరవై నాలుగు మూలకాలు. ఎనిమిది స్థూల మరియు సూక్ష్మ మూలకాలు, ఆపై వాటి ఉత్పత్తి, పది ఇంద్రియాలు, పనిచేసే ఇంద్రియాలు మరియు, జ్ఞానమును సంపాదించే ఇంద్రియాలు. ఎనిమిది, పది, పద్దెనిమిది. అప్పుడు ఇంద్రియ వస్తువులు, ఐదు. పద్దెనిమిది ప్లస్ ఐదు, ఇరవై మూడు. ఆ తరువాత ఆత్మ. ఇరవై నాలుగు అంశాలు, సాంఖ్య తత్వము, అవి విశ్లేషించబడ్డాయి. సాంఖ్య తత్వము... యూరోపియన్ తత్వవేత్తలు, వారు ఈ సాంఖ్య తత్వ పద్ధతిని చాలా ఇష్ట పడతారు, ఎందుకంటే సాంఖ్య తత్వములో ఈ ఇరవై నాలుగు అంశాలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. సాంఖ్య తత్వము. Dehas tu sarva-saṅghāto jagat. అందువల్ల రెండు రకాల శరీరములు ఉన్నాయి, jagat and tasthuḥ- కదిలేవి మరియు కదలకుండా ఉండేవి. కానీ అవి అన్ని ఈ ఇరవై నాలుగు మూలాకాల కలయికతో ఉన్నాయి. Atraiva mṛgyaḥ puruṣo neti netīty. ఇప్పుడు, ఈ ఇరవై నాలుగు మూలకాల నుండి ఆత్మను మనము కనుగొనాలి తీసివేయడము ద్వారా, "ఆత్మ ఎక్కడ ఉంది, ఆత్మ ఎక్కడ ఉంది, ఎక్కడ ఆత్మ ఉంది?" కానీ ఆయన ఆ నియమాలను నిబంధనలను, పద్ధతిను అనుసరించినప్పుడు ఆ విధముగా కనుగొనవచ్చు. అది సాధ్యమే.

anvaya-vyatirekeṇa
vivekenośatātmanā
svarga-sthāna-samāmnāyair
vimṛśadbhir asatvaraiḥ
(SB 7.7.24)

కాబట్టి మరింత వివరణ, ఈ విషయము చాలా కష్టము, కానీ చాలా ముఖ్యం. ప్రహ్లాద మహారాజు తన రాక్షస తరగతి స్నేహితులకు వివరిస్తున్నాడు. ఐదు సంవత్సరాల పుత్రుడు, ఆయన ఎలా సాంఖ్య తత్వము వివరిస్తున్నాడు? ఆయన ఒక భక్తుడు కనుక, ఆయన ప్రామాణికుల నుండి మొత్తం తత్వమును విన్నాడు, నారద ముని. Mūkhaṁ karoti vācālaṁ paṅguṁ laṅghayate girim. అందువలన, ఆధ్యాత్మిక గురువు యొక్క దయ వలన వర్ణించబడింది, mūkhaṁ karoti vācālam. మూకమ్ అంటే అర్థం మూగవాడు, మాట్లాడలేని వ్యక్తి. ఆయన ఒక గొప్ప లెక్చరర్ లేదా వక్త అవుతాడు. ఆయన మూగ అయినప్పటికీ, ఆయన గొప్ప లెక్చరర్గా మారవచ్చు, mūkhaṁ karoti vācālam. Paṅguṁ laṅghayate girim, కుంటివాడు, నడవ లేని వాడు, ఆయన పర్వతాలను దాటవచ్చు. Mūkhaṁ karoti vācālaṁ paṅguṁ laṅghayate... Yat kṛpā tam ahaṁ vande, ఎవరి కరుణ వలన ఈ విషయములు సాధ్యమవుతాయో, నేను నా పవిత్రమైన ప్రణామములు అర్పిస్తున్నాను. Param ānanda bhavam, భగవంతుడు, అన్ని ఆనందముల యొక్క నిధి. కృష్ణుడి దయ ద్వారా అది సాధ్యమే. భౌతిక గణన ద్వారా అది సాధ్యం కాదు. భౌతిక గణన ఒకరు చెప్తారు "అది ఎలా సాధ్యమవుతుంది? మీరు చెప్తారు మూగవాడు చాలా చక్కగా ప్రసంగిస్తున్నాడు? అది సాధ్యం కాదు. " లేదా, "ఆ కుంటి మనిషి ఇప్పుడు పర్వతాలను దాటుతున్నాడు?" కాబట్టి భౌతికంగా అది సాధ్యం కాదు. కానీ కృష్ణుడు లేదా ఆయన ప్రతినిధి యొక్క దయ ద్వారా... ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు, అయిదు ఏళ్ళ పుత్రుడు లాగా, ఆయన ఆత్మ యొక్క స్వరూపం గురించి చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన నారద ముని యొక్క దయను పొందాడు, కృష్ణుడి ప్రతినిధి. కావున ఇది సాధ్యమే.