TE/Prabhupada 0850 - మీరు కొంత డబ్బు పొందితే, పుస్తకాలు ముద్రణ చేయండి: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0849 - On veut voir Dieu, mais on ne reconnaît pas que nous ne sommes pas qualifiés|0849|FR/Prabhupada 0851 - Répétition de la mastication de ce qui est deja mâché. C'est la vie Matériel|0851}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0849 - మనము భగవంతుని చూడాలనుకుంటున్నాము.కానీ మనకు అర్హత లేదని మనము గుర్తించము|0849|TE/Prabhupada 0851 - నమిలినదే తిరిగి నమలడము. ఇది భౌతిక జీవితము|0851}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|rF6MVN3qbIs|మీరు కొంత డబ్బు పొందితే, పుస్తకాలు ముద్రణ చేయండి  <br />- Prabhupāda 0850}}
{{youtube_right|_jf4bL2_BPU|మీరు కొంత డబ్బు పొందితే, పుస్తకాలు ముద్రణ చేయండి  <br />- Prabhupāda 0850}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:39, 1 October 2020



750620d - Lecture Arrival - Los Angeles


మీరు కొంత డబ్బు పొందితే, పుస్తకాలు ముద్రణ చేయండి మనకు కొత్త ఆవిష్కరణ లేదు. (నవ్వు) మనము తయారు చేయము. ఇది మన పద్ధతి. మనము కేవలం ముందున్న వారి ఆదేశాన్ని ,ఉపదేశాన్ని అనుసరిస్తాము, అంతే. మన ఉద్యమం చాలా సులభం ఎందుకంటే మనము ఏదీ తయారు చేయడం లేదు. మనము కేవలం పదే పదే ముందున్న వారు ఇచ్చిన ఉపదేశాలు సూచనలను తిరిగి చెప్పి చేస్తాము. కృష్ణుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదునికి, నారదుడు వ్యాసదేవునికి ఉపదేశించారు, వ్యాసదేవుడు మధ్వాచార్య కు ఉపదేశించారు, ఈ విధముగా, తర్వాత మాధేవంద్ర పురీ, ఈశ్వర పురీ, శ్రీ చైతన్య మహాప్రభు, తర్వాత ఆరుగురు గోస్వాములు, తర్వాత శ్రీనివాస ఆచార్యులు, కవిరాజ గోస్వామి, నరోత్తమ దాస ఠాకురా, విశ్వనాథ చక్రవర్తి, జగన్నాథ బాబాజీ, భక్తివినోద ఠాకురా, గౌరకిశోర దాస బాబాజీ, భక్తిసిద్ధాంత సరస్వతి, తర్వాత మనము అదే పని చేస్తున్నాము. తేడా లేదు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రత్యేక పద్ధతి. మీరు రోజూ పాడుతున్నారు, గురు-ముఖ-పద్మ-వాక్య, చిత్తతే కొరియా ఐక్య, ఆర్ నా కొరిహో మనే ఆశా. చాలా సులభమైన విషయం. మనము గురు-పరంపర వారసత్వం ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాము. మనం కేవలం గురువు నుండి సూచనలను తీసుకోవాలి, మన హృదయం మరియు ఆత్మకు అది అమలు చేస్తే, అది విజయవంతము. అది ఆచరణాత్మకమైనది.

నాకు వ్యక్తిగత యోగ్యత లేదు, కానీ నేను నా గురువును సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించాను, అంతే. నా గురు మహారాజు నన్ను అడిగారు, "మీరు కొంత డబ్బు సంపాదించినట్లయితే, మీరు పుస్తకాలు ముద్రించండి." ఒక ఆంతరంగిక సమావేశం జరిగింది, మాట్లాడటం, అక్కడ నా ముఖ్యమైన కొందరు దైవీ సోదరులు కూడా ఉన్నారు. ఇది రాధా-కుండలో జరిగింది. గురు మహారాజా నాతో మాట్లాడటం జరిగింది ఈ బాగ్ బజార్ పాలరాతి దేవాలయం పొందినప్పటి నుంచి, చాలా విభేదాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఎవరు ఈ గది లేదా ఆ గది, ఆ గది ఆక్రమించాలి అని. ఈ ఆలయం పాలరాయిని విక్రయించాలని మరియు కొన్ని పుస్తకాలను ముద్రించాలని నేను కోరుకుంటున్నాను. " అవును. అందువల్ల ఇది ఆయన నోటి నుండి నేను తీసుకున్నాను, ఆయన పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఆయన వ్యక్తిగతంగా నాకు చెప్పారు "మీరు కొంత డబ్బు పొందితే, పుస్తకాలు ముద్రణ చేయండి." అందువలన నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తాను: "పుస్తకం ఎక్కడ ఉంది? పుస్తకం ఎక్కడ ఉంది? పుస్తకం ఎక్కడ ఉంది?" కాబట్టి దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఇది నా అభ్యర్థన. అనేక భాషలలో అనేక పుస్తకాలను ముద్రణ చేయండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారము చేయండి. అప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమము సహజముగా పెరుగుతుంది. ఇప్పుడు చదువుకున్న, జ్ఞానము కలిగిన విద్వాంసులు, వారు మన ఉద్యమాన్ని ప్రశంసించారు, పుస్తకాలను చదవడం ద్వారా, ఆచరణాత్మక ఫలితం తీసుకోవడం ద్వారా. డాక్టర్ స్టిల్స్సన్ జుడా, ఆయన ఒక పుస్తకాన్ని రచించారు, బహుశా మీకు తెలుసా, కృష్ణ కాన్... హరే కృష్ణ మరియు కౌంటర్ కల్చర్, మన ఉద్యమము గురించిన చాలా మంచి పుస్తకం, ఆయన ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. ఆయన అంగీకరించారు "స్వామిజీ, మీరు అద్భుతమైన విషయం చేశారు ఎందుకంటే మీరు మత్తు మందుల బానిస హిప్పీలను కృష్ణుని భక్తులుగా మార్చినారు, వారు మానవ సేవ కోసం తయారు అయ్యారు.