TE/Prabhupada 0873 - భక్తి అంటే మన ఉపాధుల నుండి మనం బయట పడటం

Revision as of 16:17, 18 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0873 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750519 - Lecture SB - Melbourne


భక్తి అంటే మన ఉపాధుల నుండి మనం బయట పడటం. ఇంద్రియ ఆనందం కోసం నేను ఇప్పుడు ఈ శరీరాన్ని పొందాను,భారతీయ శరీరం; మీరు ఈ ఆస్ట్రేలియన్ లేదా అమెరికన్ లేదా ఐరోపా శరీరాన్ని పొందారు. కానీ మీరు ఈ శరీరాన్ని మార్చకతప్పదు. Tathā dehāntara-prāptiḥ ( BG 2.13) మనము శాశ్వతులము. Na jāyate na mriyate vā kadācit ( BG 2.20) ఆత్మకు పుట్టుకలేదు,మరణమూ లేదు. మనము కేవలం శరీరాన్ని మార్చుకుంటాము. Tathā dehāntara-prāptiḥ.ఎలాగంటే మన శరీరాన్ని మనం మారుస్తున్నట్లుగానే.

తల్లి గర్భంలో మనము ఒక చిన్న శరీరాన్ని కలిగి ఉన్నాము. అది పెరుగుతుంది,అలా మనము బయటకు వస్తాము. మళ్ళీ అది పెరుగుతుంది. పెరుగుతుంది... అది వాస్తవానికి పెరుగుతోంది; అది మార్పుకు గురవుతోంది. పసివాడు తన శరీరాన్ని శిశువుగా మారతాడు, శిశువు తన శరీరాన్ని బాలునిగా మార్పుచెందుతాడు. మరియు బాలుడు తన శరీరాన్ని యువ్వనావస్థకు మారుతున్నాడు. అలా ... ఈ విధముగా మీరు శరీరం మారుస్తున్నారు. అది మీకు అనుభవంలో వుంది. మీరు పిల్లవాడి శరీరాన్ని కలిగి ఉన్నారు-మీకు గుర్తుంది. లేదా మీరు ఒక బాలుని శరీరాన్ని కలిగి ఉన్నారు-మీకు గుర్తుంది. కానీ ఆ శరీరం సజీవంగా లేదు. కానీ మీరు జీవించివున్నారు. కాబట్టి సారాంశం ఏమంటే ఈ శరీరం ఎంతమాత్రమూ నివాసయోగ్యము కానప్పుడు, మనము మరొక శరీరం అంగీకరించాల్సి ఉంటుంది. దీనిని తథా దేహాన్తరా-ప్రాప్తి అని పిలుస్తారు. కాబట్టి మనం మార్చకతప్పదు. ఇది ప్రకృతి నియమం. ఆత్మ శాశ్వతమైనది. Na jāyate na mriyate vā kadācit na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఆత్మకు ముగింపులేదు; కేవలం ఒక ప్రత్యేకమైన రకపు శరీరం ముగుస్తుంది. లేదు. ప్రజలకు ఇది తెలియదు. మరియు వారు కేవలం పాపకృత్యాలలో నిమగ్నమయ్యారు కాబట్టి, వారు ఎంత మందబుధ్ధిగా మారారంటే ఈ సాధారణ సత్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. ఎలాగైతే మీరు ఈ జీవితంలో శరీరాన్ని మారుస్తున్నట్లుగానే, మీరు ఈ శరీరాన్ని వదలి ఇంకో జీవితానికి మారుతారు. ఇది చాలా సరళమైన సత్యము. కానీ భౌతిక నాగరికత పురోగతి కారణాన, మనము ఎంత మందబుధ్ధులుగా,మూర్ఖులుగా మారామంటే దానిని గ్రహించలేము.

కానీ భారతదేశంలో ఇప్పటికీ, అది నిమ్నజాతికి చెందినదైనా, మీరు ఒక మారుమూల గ్రామానికి వెళ్తే: ఒక సాధారణ మనిషి, అతనికి విద్య లేదు, అతను నమ్ముతాడు. అతనికి విశ్వాసం వుంది. మరియు ఇక్కడ పాశ్చాత్య దేశాలలో, నేను చాలామంది గొప్ప, గొప్ప ఆచార్యులను చూసాను. వారికి అస్సలు అవగాహనలేదు. నేను మాస్కోలో ఒక గొప్ప ప్రొఫెసర్, కోట్వోస్కిని కలుసుకున్నాను. ఆయన చెప్పాడు, "స్వామీజీ, ఈ శరీరం ముగిసిన తర్వాత, సర్వం ముగుస్తుంది." చూడండి. ఆయన ఒక గొప్ప విధ్యావేత్త మరియు చాలా గొప్ప విభాగమైన ఇన్డోలజీకి అధిపతి. ఆయనకు అవగాహనలేదు. కానీ ఇది వాస్తవం కాదు. వాస్తవమేమంటే మనము అందరమూ స్ఫులింగాలము, ఆధ్యాత్మిక స్ఫులింగాలము, భగవంతుని విభిన్నాంశలము. ఏదో ఒక కారణాన, మనము ఇంద్రియభోగం కోసం ఈ భౌతికప్రపంచంలోకి వచ్చాము. ఆధ్యాత్మిక జగత్తులో ఇంద్రియభోగం వుండదు. ఇంద్రియ పవిత్రీకరణ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియాలు అపవిత్రమైనవి. అవి కేవలం భౌతిక వస్తువులని ఆస్వాదించాలని కోరుకుంటాయి. కాబట్టి కృష్ణ చైతన్యము అంటే మీరు మీ ఇంద్రియాలను పవిత్రము చేసుకోవాలి. అది పధ్ధతి.

sarvopādhi-vinirmuktaṁ
tat-paratvena nirmalam
hṛṣīkena hṛṣīkeśa-
sevanaṁ bhaktir ucyate
(CC Madhya 19.170)

భక్తి అంటే మన ఉపాధుల నుండి మనం బయట పడటం. ఆ ఉపాది ఏమిటి? ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, నేను అమెరికన్, "నేను భారతీయుడిని", "నేను యురోపియన్ను ", "నేను ఆస్ట్రేలియన్ ను" నేను పిల్లి, "నేను కుక్క," నేను ఇది "," నేను అది "-దేహపరంగా. మనము ఈ శారీరక అవగాహనతో కూడిన జీవితం నుండి బయటపడాలి,అంటే"నేను ఈ శరీరాన్ని కాదు." Ahaṁ brahmāsmi: "నేను ఆత్మను." ఈ సాక్షాత్కారాన్ని మనం పొందాలి. అప్పుడు ఏ వ్యత్యాసాలు ఉండవు "ఇక్కడ ఒక అమెరికన్ వున్నాడు, ఇక్కడ ఒక ఆస్ట్రేలియన్ వున్నాడు, ఇక్కడ ఒక హిందవు ఉన్నాడు, ఇక్కడ ఒక ముస్లిం, ఇక్కడ ఒక చెట్టు ఉంది,ఇక్కడ.... "లేదు. Paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) పండిత అంటే అర్ధం జ్ఞానంకలవాడు, విషయాలను యధారీతిగా ఎరిగిన వాడు. వారికి,

vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
(BG 5.18)


ఒక వ్యక్తి, చాలా జ్ఞానము కలవాడు, విద్య, చాలా సున్నితమైన ... విద్యా అంటే, విద్యావంతుడు అంటే, ఆయన సున్నితమైనవాడు, తెలివిగా ఉంటాడు. అతను మూఢుడు మరియు దుష్టుడు కాదు. అది విద్య.అది విద్య యొక్క సూచిక. అతను చాలా విద్యావంతుడై ... వివేకి మరియు మితభాషియై వుంటాడు.ఒక పదం లో చెప్పాలంటే, అతనిని పెద్ద మనిషి అని పిలుస్తారు.