TE/Prabhupada 0905 - ప్రతి ఒక్కటీ భగవంతునికి చెందుతుంది అనే వాస్తవ చైతన్యానికి రండి

Revision as of 07:32, 1 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0905 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730418 - Lecture SB 01.08.26 - Los Angeles


ప్రతి ఒక్కటీ భగవంతునికి చెందుతుంది అనే వాస్తవ చైతన్యానికి రండి కాబట్టి మత్తులో ఉన్నవారు, వారు అర్థం చేసుకోలేరు. వారు భావిస్తారు: "ఇది నా ఆస్తి. నేను దొంగిలించాను, నేను రెడ్ ఇండియన్స్ నుండి ఈ అమెరికా భూభాగాన్ని దొంగిలించాను. ఇప్పుడు ఇది నా ఆస్తి. " కానీ ఆయన ఒక దొంగ అని ఆయనకు తెలియదు. అతడు ఒక దొంగ. Stena eva sa ucyate ( BG 3.12) భగవద్గీతలో. భగవంతుని ఆస్తిని తీసుకున్న వ్యక్తి, తన సొంత ఆస్తిగా చెప్పుకునేవాడు, అతడు ఒక దొంగ. Stena eva sa ucyate. అందువల్ల మనము ఈ కమ్యూనిస్ట్ ఆలోచన కలిగి ఉన్నాము, భక్తుడు, కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి. మనము కృష్ణ చైతన్య పరమైన కమ్యూనిస్ట్ కార్యక్రమమును కలిగి ఉన్నాము. అది ఏమిటి? అది ప్రతీదీ భగవంతునికి చెందుతుంది. వారు అన్ని ప్రభుత్వానికి చెందుతాయి అని ఆలోచిస్తున్నట్లుగానే. ఈ కమ్యూనిస్టులు, ఈ మాస్కోలో, మాస్కోయిట్స్, లేదా రష్యన్, లేదా చైనీస్, వారు దేశము పరముగా ఆలోచిస్తున్నారు. కానీ మనము దేశము పరముగా ఆలోచించడము లేదు. మనము భగవంతుని పరముగా ఆలోచిస్తున్నాం. అంతా భగవంతునికి చెందుతుంది. అదే తత్వము. మీరు విస్తరించండి. కేవలం మీకు కొంత బుద్ధి అవసరం, కొంచము బుద్ధి. ఈ రాష్ట్రం కొందరు ప్రజలకు చెందుతుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జనాభా ఉన్నట్లయితే, అమెరికన్ జనాభా, ఈ భూమి ఈ అమెరికా యొక్క జనాభాకు చెందుతుంది అని మీరు అనుకున్నట్లైతే. నీవు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇది భగవంతుని ఆస్తి అని మీరు ఆలోచించండి

కాబట్టి ప్రతి జీవి భగవంతుని యొక్క కుమారుడు. భగవంతుడు సర్వోన్నతమైన తండ్రి. కృష్ణుడు చెప్తాడు: ahaṁ bīja-pradaḥ pitā.. నేను సజీవంగా ఉన్న అన్ని జీవుల యొక్క విత్తనానికి తండ్రి. సర్వ-యోనిషు కౌంతేయా ( BG 14.4) ఏ రూపంలో వారు జీవించి ఉన్నా, వారు అందరు జీవులు, వారు నా కుమారులు. నిజానికి ఇది వాస్తవం. మనము జీవులందరము, మనము భగవంతుని కుమారులము. కానీ మనము మర్చిపోయాము. అందువలన మనము పోరాడుతున్నాము. ఉదాహరణకు ఒక మంచి కుటుంబానికి చెందిన వాడు, ఎవరికైన తెలిస్తే: "మా తండ్రి ఆహారం మనకు సరఫరా చేస్తున్నాడు. కావున మనం సోదరులము, మనం ఎందుకు కోట్లాడుకోవడము?" అదేవిధముగా మనము భగవంతుని చైతన్యమును కలిగి ఉంటే, మనము కృష్ణ చైతన్య వంతులమైతే, ఈ పోరాటము ముగుస్తుంది. నేను అమెరికన్, నేను భారతీయుడను, నేను రష్యన్, నేను చైనీస్. ఈ అన్ని అర్థంలేని విషయాలు ఆగిపోతాయి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది. ప్రజలు కృష్ణ చైతన్య వంతులు అయిన వెంటనే, ఈ పోరాటం, ఈ రాజకీయ పోరాటము, జాతీయ పోరాటం, వెంటనే ఆగిపోతాయి. ఎందుకంటే వారు వాస్తవమైన చైతన్యమునకు వస్తారు. ప్రతీదీ భగవంతునికి చెందినది అని. మరియు పిల్లల వలె, తండ్రి నుండి ప్రయోజనమును పొందటానికి కుటుంబంలోని పిల్లలకు హక్కు ఉంది, అదే విధముగా ప్రతి ఒక్కరూ భగవంతునిలో భాగం అయితే అదే విధముగా, ప్రతి ఒక్కరూ భగవంతుని పిల్లవాడు అయితే, అప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కు, అటువంటి హక్కు కాదు ఆ హక్కు మానవులకు చెందుతుంది. భగవద్గీత ప్రకారం, ఈ హక్కు అన్ని జీవులకు చెందుతుంది.