TE/Prabhupada 0923 - ఈ నాలుగు మూలాలను బ్రేక్ చేయండి. కాబట్టి పాపపు జీవితపుపైకప్పు కూలిపోతుంది

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730422 - Lecture SB 01.08.30 - Los Angeles


ఈ నాలుగు మూలాలను బ్రేక్ చేయండి. కాబట్టి పాపపు జీవితపు పైకప్పు కూలిపోతుంది కృష్ణుని సాధారణ బాలుని వలె, మానవుడుగా తీసుకున్నట్లయితే, కృష్ణుడు అతనితో సాధారణ మానవునిగా వ్యవహరిస్తాడు. కృష్ణుని భగవంతునిగా మహోన్నతమైన వ్యక్తిగా ఆమోదించినట్లతే, భక్తుడు భగవంతుని యొక్క సాంగత్యమును ఆనందిస్తాడు. నిరాకార వ్యక్తులకు బ్రహ్మజ్యోతి అంటే చాలా ఇష్టం అయితే, దానికి( బ్రహ్మజ్యోతికి ) ఆయనే మూలం. అందువలన ఆయన ప్రతిదీ అవుతాడు. Brahmeti, paramātmeti, bhagavān iti śabdyate ( SB 1.2.11) కాబట్టి అటువంటి ఉన్నతమైన వ్యక్తితో ఈ బాలురు ఆడుకుంటున్నారు. ఎలా, ఎందుకు, వారు చాలా అదృష్టమును పొందినారు, భగవంతునితో మహోన్నతమైన వ్యక్తితో ఆడుకోవడానికి?

itthaṁ satāṁ brahma-sukhānubhūtyā
dāsyaṁ gatānāṁ para-daivatena
māyāśritānāṁ nara-dārakeṇa
sākaṁ vijahruḥ kṛta-puṇya-puñjāḥ
(SB 10.12.11)

ఈ బాలురు, గోప బాలురు, ఇప్పుడు కృష్ణునితో ఆడుకుంటున్నారు , వారు కూడా సాధారణమైనవారు కాదు. వారు ఇప్పుడు అత్యధిక పరిపూర్ణతను కలిగి ఉన్నారు, వారు దేవాదిదేవుడితో ఆడుకోగలిగారు. వారు ఈ స్థానాన్ని ఎలా సాధించారు? Kṛta-puṇya-puñjāḥ. అనేక అనేక జన్మల పవిత్ర కార్యక్రమాలను చేసినారు. ఎందుకంటే ఈ బాలురు అనేక జన్మలు తపస్సులు, ప్రాయశ్చిత్తములు చేసినారు జీవితములో అత్యంత పరిపూర్ణత సాధించడానికి. ఇప్పుడు వారికి కృష్ణునితో సమానంగా ఆడుకొనటానికి అవకాశం వచ్చినది. కృష్ణుడు భగవంతుడు దేవాదిదేవుడు అని వారికి తెలియదు. ఇది వృందావనము లీల. గోప బాలురు, వారు కేవలం కృష్ణుడిని ప్రేమిస్తారు. వారి ప్రేమకు ముగింపు లేదు. వృందావనములో అందరూ. ఉదాహరణకు యశోదా-నంద మహారాజు వలె. వారు కృష్ణుని మీద వాత్సల్య ప్రేమను కలిగి ఉన్నారు. కాబట్టి తండ్రి తల్లి కృష్ణుడిని ప్రేమిస్తారు, స్నేహితులు కృష్ణుని ప్రేమిస్తారు, అమ్మాయి స్నేహితులు, వారు కృష్ణుని ప్రేమిస్తారు, చెట్లు కృష్ణుని ప్రేమిస్తాయి, నీరు కృష్ణుని ప్రేమిస్తుంది, పువ్వులు, ఆవులు, దూడలు, ప్రతి ఒక్కరూ కృష్ణుని ప్రేమిస్తారు. ఇది వృందావనము. కాబట్టి కృష్ణుని ఎలా ప్రేమించాలో కేవలము మనము తెలుసుకుంటే, వెంటనే ఈ ప్రపంచాన్ని వెంటనే వృందావనమునగా సృష్టించుకోవచ్చు. ఇది మాత్రమే ప్రధాన విషయము. కృష్ణుని ఎలా ప్రేమించాలి. Premā pum-artho mahān..

అందువల్ల చైతన్య మహాప్రభు చెప్తారు dharma-artha-kāma-mokṣa (SB 4.8.41, CC Adi 1.90) ఈ నాలుగు విషయాల కొరకు ప్రజలు ఆశ పడుతున్నారు. Dharma-artha-kāma-mokṣa. చైతన్య మహా ప్రభు దీనిని పట్టించుకోలేదు. "ఇది జీవిత సార్ధకత కాదు." వాస్తవానికి, ఒక మనిషి... ధర్మము యొక్క భావన, ధర్మము ఉంటే తప్ప మానవ జీవితం ప్రారంభం కాదు. కానీ ప్రస్తుత క్షణము, కలి యుగములో, ధర్మ ఆచరణాత్మకత శూన్యము. కాబట్టి వేదముల గణన ప్రకారం, ప్రస్తుత మానవ నాగరికత, వారు మానవులు కూడా కాదు. ఎందుకంటే ధర్మము లేనందున. ధర్మము లేదు. నైతికత లేదు. పవిత్ర కార్యక్రమాలు లేవు. పట్టించుకోరు. ఎవరైనా ఏమైనా చేయగలరు పట్టించుకోకుండా. గతంలో నైతికత, అనైతికత, అధర్మము, ధర్మము ఉన్నాయి. కానీ కలి యుగ పురోగతితో, ప్రతిదీ నాశనమవుతుంది ఇది కలి-యుగములో చెప్పబడింది ఎనభై శాతం మంది ప్రజలు , వారు పాపత్ములు, అందరూ పాపాత్ములు. మనము ఆచరణాత్మకంగా చూడవచ్చు. మనము పాపుల జాబితాను ఇచ్చాము, నాలుగు సూత్రాలు, అక్రమ లైంగిక జీవితం, మత్తు, మాంసం తినడం జూదం. ఇవి పాపపు జీవితపు నాలుగు మూలాలు.

అందువల్ల మేము మా విద్యార్థులకు ఈ నాలుగు మూలాలను పడగొట్టమని చెప్తాము. కాబట్టి పాపత్మకమైన జీవితం యొక్క పైకప్పు కూలిపోతుంది. అప్పుడు హరే కృష్ణ కీర్తన చేయండి, మీరు ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడతారు. సరళమైన పద్ధతి. ఎందుకంటే తన జీవితము పాపముగా ఉంటే భగవంతుణ్ణి గ్రహించలేరు. అది సాధ్యం కాదు. అందువల్ల కృష్ణుడు చెప్తాడు: yeṣām anta-gataṁ pāpam ( BG 7.28) Anta-gatam అంటే పూర్తి అయినది అని అర్థం